Nothing Ear 3: కొత్త టాక్ బటన్ తో నథింగ్ ఇయర్ 3 హెడ్ ఫోన్స్.. లాంఛ్ ఎప్పుడంటే..
త్వరలోనే నథింగ్ బ్రాండ్ నుంచి ఇయర్ 3 బడ్స్ రానున్నాయి. వీటిని యాపిల్ ఎయిర్ పాడ్స్ 3 కు పోటీగా లాంఛ్ చేయనున్నానరని టెక్ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ సరికొత్త బడ్స్ డిజైన్ ఎలా ఉంటుంది. ప్రత్యేకతలేంటి.. ఇప్పుడు తెలుసుకుందాం.

నథింగ్ బ్రాండ్ ఇయర్ ఫోన్స్ కు మార్కెట్ లో సూపర్ క్రేజ్ ఉంది. అంతకుముందు రిలీజ్ అయిన నథింగ్ ఇయర్ 2 బడ్స్ బాగా పాపులర్ అయ్యాయి. త్వరలోనే అప్ కమింగ్ బడ్స్ నథింగ్ ఇయర్ 3 లాంచ్ అవ్వనున్నట్లు ఒక టీజింగ్ పోస్టర్ రిలీజ్ అయింది.
లాంచ్ డేట్
నథింగ్.. తమ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ “ఇయర్ 3” ను సెప్టెంబర్18వ తేదీన లాంచ్ చేస్తున్నట్లు అఫీషియల్ ఎక్స్(ట్విటర్) అకౌంట్ ద్వారా అనౌన్స్ చేసింది. యాపిల్ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన ఆపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో 3 కి పోటీగా ఈ కొత్త బడ్స్ తీసుకువస్తున్నట్టు సమాచారం.
ఫీచర్స్
ఇయర్ 3 బడ్స్.. సరికొత్త ట్రాన్స్ పరెంట్ డిజైన్, మెటల్ బాడీ తో స్టైలిష్ గా కనిపించనున్నాయి. నథింగ్ హెడ్ ఫోన్స్ ట్రాన్స్ పరెంట్ డిజైన్ తో ఉంటాయి కాబట్టి వాటి లోపల అమర్చిన వస్తువులు పైకి కనిపిస్తుంటాయి. ఈ లేటెస్ట్ బడ్స్ లో కాస్త పెద్ద సైజు యాంటెన్నా కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే.. ఇందులో మెరుగైన బ్లూటూత్ సిగ్నలింగ్ ఉండే అవకాశం ఉంది. అలాగే చాలా డ్యూరబుల్ మెటీరియల్ తో ఈ బడ్స్ డిజైన్ చేశారు. అలాగే ఇందులో సరికొత్త టాక్ బటన్ ను కూడా అమర్చినట్టు తెలుస్తుంది. నథింగ్ ఈ బటన్ గురించి ఎక్స్ లో హైలైట్ చేస్తుంది. మరి ఈ బటన్ ఎలాంటి ఫంక్షన్స్ ను కలిగి ఉంటుందో తెలియాల్సి ఉంది. ఈ బడ్స్ గురించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




