AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motorola Price Drop: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో మోటోరోలా ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌.. మరీ ఇంత తక్కువా.. మిస్‌ అవ్వకండి!

Flipkart Big Billion Days 2025: ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్ కార్ట్ తమ కస్టమర్ల కోసం ప్రతి ఏడాది నిర్వహించే అమ్మకాల పండగ.. బిగ్ బిలియన్ డేస్ సేల్-2025ను తీసుకొచ్చింది. ఈ సేల్‌ ఈ నెల 23నుంచి ప్రారంభంకానుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు చాలా తక్కువ ధరలకు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సెల్‌లో మోటో ఫోన్స్‌పై ఎలాంటి ఆఫర్స్‌ ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

Motorola Price Drop: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో మోటోరోలా ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌.. మరీ ఇంత తక్కువా.. మిస్‌ అవ్వకండి!
Motorola Phones On Bbd Sale
Anand T
|

Updated on: Sep 15, 2025 | 5:49 PM

Share

ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్ కార్ట్ తమ కస్టమర్ల కోసం ప్రతి ఏడాది నిర్వహించే అమ్మకాల పండగ.. బిగ్ బిలియన్ డేస్ సేల్-2025ను తీసుకొచ్చింది. ఈ సేల్‌ ఈ నెల 23నుంచి ప్రారంభంకానుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్స్‌కు మాత్రం ఈ సేల్ సెప్టెంబర్ 22 నుంచే అందుబాటులో ఉండనుంది. ఈ సేల్‌లో స్మార్ట్స్‌ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్‌, గ్యాజియెట్స్‌, హోమ్‌ డేకర్స్‌ వంటి ఉత్సత్తులపై ఆయా కంపెనీలు భారీ ఆఫర్స్‌ ప్రకటించాయి. అయితే సేల్లో భాగంగా రానున్న మోటోరోలా ఫోన్స్‌కు సంబంధించిన డీల్స్‌ను కంపెనీ ఇటీవలే రివీల్ చేసింది. ఇంతకు ఆ ఆఫర్స్‌ ఏంటి.. ఏ ఫోన్‌పై ఎంత తగ్గిందో ఇక్కడ తెలుసుకుందాం.

సేల్‌లో మోటోరోలా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై ఉన్న ఆఫర్స్‌ ఇవే..

  • ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో మోటోరోలా ఫోన్స్‌ చాలా తక్కువ రేటుకు రానున్నాయి. వీటిలో ఫ్లాగ్‌షిప్, మిడ్‌రేంజ్‌ స్మార్ట్ ఫోన్స్‌ ఉన్నాయి
  • మొదటగా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల గురించి చూస్తే మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో మూడు వేరియంట్లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి.
  • వాటిలో మొదటిది 8GB + 256GB వేరియంట్‌ ప్రారంభ ధర రూ. 29,999 ఉండగా ఇది సేల్‌లో రూ. 24,999కి లభించనుంది.
  • ఇక ఎడ్జ్ 60 ప్రో 12GB + 256GB వేరియంట్‌ ప్రారంభ ధర రూ. 30,999 ఉండగా ఇది సేల్‌లో రూ. 28,999కి లభించనుంది.
  • ఇక ఎడ్జ్ 60 ప్రో 16GB + 512GB వేరియంట్‌ ప్రారంభ ధర రూ. 34,999 ఉండగా ఇది సేల్‌లో రూ. 32,999కి లభించనుంది. ఇక
  • మరో ఫ్లాగ్‌షిప్‌ పోన్‌ మోటోరోలా రేజర్ 60 8GB + 256GB ప్రారంభం ధర రూ. 49,999 గా ఉండగా ఇది సేల్‌ కేవలం రూ. 39,999 అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి: స్టన్నింగ్‌ డీల్స్‌.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో నథింగ్ ఫోన్స్‌పై భారీ ఆఫర్స్!.. ధర తెలిస్తే షాక్!

సేల్‌లో మోటోరోలా స్మార్ట్‌ఫోన్లపై ఉన్న ఆఫర్స్‌ ఇవే..

  • బిబిడి సేల్‌లో మోటో స్పార్ట్‌ఫోన్స్‌పై కూడా భారీ ఆఫర్స్‌ ఉన్నాయి. సేల్‌లో ఏ ఫోన్‌ ఎంతకు వస్తుందో చూస్తే..
  • Motorola Edge 60 Stylus ఫోన్‌ రూ. 22,999 ప్రారంభ ధరతో లాంచ్‌ కాగా బిబిడి సేల్‌ ఈ ఫోన్‌ రూ. 19,999కి లభించనుంది.
  • Moto G96 5G (8GB+128GB) ఫోన్‌ రూ. 19,999 ప్రారంభ ధరతో లాంచ్‌ కాగా బిబిడీ సేల్‌లో ఈ ఫోన్‌ రూ. 16,999కి లభించనుంది
  • Moto G86 Power ఫోన్‌ రూ. 19,999 ప్రారంభ ధరతో లాంచ్‌కాగా బిబిడి సేల్‌లో ఈ ఫోన్‌ రూ. 17,999కి లభించనుంది
  • Moto G85 5G (8+128GB) ఫోన్‌ రూ. 17,999 ప్రారంభ ధరతో లాంచ్‌ కాగా బిబిడీ సేల్‌లో ఈ ఫోన్‌ రూ. 14,999కి లభించనుంది
  • Moto G45 5G (8+128GB) ఫోన్‌ రూ. 12,999 ప్రారంభ ధరతో లాంచ్‌ కాగా బిబిడీ సేల్‌లో ఈ ఫోన్‌ రూ. 10,999కి లభించనుంది
  • Moto G35 5G (4+128GB) ఫోన్‌ రూ. 9,999 ప్రారంభ ధరతో లాంచ్‌ కాగా బిబిడీ సేల్‌లో ఈ ఫోన్‌ రూ. 8,999 లభించనుంది.

ఇవి కూడా చదవండి: గూగుల్‌ యూజర్స్‌కు బంపరాఫర్.. సేల్‌లో పిక్సెల్-9పై భారీ డిస్కౌంట్.. ధర తెలిస్తే!

మరిన్ని సైన్స్‌ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.