Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కలర్స్, ఫీచర్స్ మామూలుగా లేవుగా..! జూలై చివరినాటికి మార్కెట్లో విడుదల..
Ola Electric Scooter : ఓలా రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈ జూలై చివరి నాటికి భారత మార్కెట్లో విడుదల కానుంది. స్కూటర్ అధికారికంగా
Ola Electric Scooter : ఓలా రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈ జూలై చివరి నాటికి భారత మార్కెట్లో విడుదల కానుంది. స్కూటర్ అధికారికంగా ప్రారంభించటానికి ముందు మార్కెట్లో ఓలా స్కూటర్ కలర్స్, ఫీచర్స్ అంటూ కొన్ని ఇమేజ్‌లు హల్‌చల్ చేస్తున్నాయి. ఓలా అనేక రంగులలో భారతీయ మార్కెట్లోకి ప్రవేశిస్తుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం నలుపు, పింక్, లేత నీలం, తెలుపు రంగులలో ఉన్నాయి.
ఓలా స్కూటర్ బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే 240 కిలోమీటర్ల దూరం వరకు రాకపోకలు సాగించే వీలుంది. వేగం పెరిగే కొద్దీ ప్రయాణ సమయం తగ్గుతుంటుంది. 499 రూపాయలను చెల్లించి ఓలా స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ అమౌంట్ నామమాత్రంగా ఉండటం కూడా అడ్వాన్స్ రిజర్వేషన్ భారీగా పెరగడానికి ఓ కారణమైందని మార్కెట్ వర్గాలు చెబుతోన్నాయి. ఈ ఓలా స్కూటర్ ధర లక్ష రూపాయల నుంచి లక్షా 20 వేల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, జీపీఎస్ నావిగేషన్ అందుబాటులో ఉంటుంది. బ్లూటూత్ ద్వారా 4జీ కనెక్టివిటీ సౌకర్యం ఉంది.
దేశంలో అడ్వాన్స్ బుకింగ్‌ను ప్రారంభించిన 24 గంటల్లో లక్ష బుకింగ్‌లు వచ్చాయి. అతి పెద్ద క్లాస్ బూట్ స్పేస్, యాప్-బేస్డ్ కీలెస్ యాక్సెస్, సెగ్మెంట్-లీడింగ్ రేంజ్ వంటి ఫీచర్లతో రానుంది. డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, సింగిల్-పీస్ సీట్, ఎక్స్‌టర్నల్ ఛార్జింగ్ పోర్ట్, ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్, ఎల్‌ఇడి టైల్లైట్, సామాను తీసుకెళ్లేందుకు హుక్, స్ప్లిట్-టైప్ రియర్ గ్రాబ్ హ్యాండిల్స్, బ్లాక్ కలర్ ఫ్లోర్ మత్, పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లు ఉంటాయి.