3D Printed Bridge: రోబోట్స్ తయారు చేసిన 3డీ వంతెన.. ప్రపంచంలో ఇదే మొదటిది.. ఎక్కడ నిర్మించారంటే..

3D Printed Bridge: ప్రపంచంలో మొట్టమొదటి 3 డి ప్రింటెడ్ స్టీల్ వంతెన నెదర్లాండ్స్ రాజధానిలో నిర్మించారు. ఆ వంతెన రూపకల్పన నుండి దాని తయారీ వరకు, పనులన్నీ రోబోట్ నిర్వహించింది.

3D Printed Bridge: రోబోట్స్ తయారు చేసిన 3డీ వంతెన.. ప్రపంచంలో ఇదే మొదటిది.. ఎక్కడ నిర్మించారంటే..
3d Printed Bridge
Follow us
KVD Varma

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 21, 2021 | 12:40 PM

3D Printed Bridge: ప్రపంచంలో మొట్టమొదటి 3డి ప్రింటెడ్ స్టీల్ వంతెన నెదర్లాండ్స్ రాజధానిలో నిర్మించారు. ఆ వంతెన రూపకల్పన నుండి దాని తయారీ వరకు, పనులన్నీ రోబోట్స్ నిర్వహించాయి.  ఇది 4500 కిలోల ఉక్కుతో తయారైంది.  దీన్ని ఆమ్స్‌టర్‌డ్యామ్‌ లోని పురాతన కాలువపై ఏర్పాటు చేశారు. ఈ వంతెనను నిర్మించిన నెదర్లాండ్స్‌కు చెందిన ఎంఎక్స్ 3 డి సంస్థ జూలై 18 న ప్రజలకు అందుబాటులోకి  తీసుకొచ్చింది.

3 డి ప్రింటింగ్ టెక్నాలజీ అంటే ఏమిటి.. ఈ వంతెన ప్రత్యేకత ఏమిటి 

ఈ 12 మీటర్ల పొడవైన వంతెనను 4 రోబోలు కలిసి తయారు చేశాయి. ఇది సిద్ధం కావడానికి సుమారు 6 నెలలు పట్టింది. ఆ తరువాత పడవ సహాయంతో వంతెనను తీసుకువచ్చారు. ఆ తరువాత క్రేన్ తో కాలువపై ఉంచారు. దీనిని నిర్మించిన సంస్థ ఈ  వంతెనకు సంబంధించిన మొత్తం డేటా కంప్యూటర్‌లో భద్రపరిచింది. దీనిద్వారా మరోసారి అటువంటి వంతెనను నిర్మించడం సులభం అవుతుంది.

బ్రిడ్జి క్వాలిటీని తనిఖీ చేసే సెన్సార్ సంస్థ ఈ స్టీల్ వంతెనకు ఎంఎక్స్ 3 డి అని పేరు పెట్టింది. ఈ వంతెన ఎంత మంది బరువును మోయగలుగుతుంది? ఉష్ణోగ్రతలు పెరిగితే  దాని ప్రభావం ఎలా ఉంటుంది? అది ఎంత బలంగా ఉంటుంది? తదితర  ప్రామాణికలతో వంతెనను పరీక్షించారు.  వంతెనలో డజనుకు పైగా సెన్సార్లు ఉన్నాయి. వారి సహాయంతో, వంతెన  బలానికి సంబంధించిన మొత్తం సమాచారం తెలుసుకున్నారు.  ఆ తర్వాతే దానిని  సామాన్య ప్రజల ఉపయోగానికి అందుబాటులోకి తెచ్చారు.

వంతెన ఎప్పుడైనా దెబ్బతింటే వెంటనే సమాచారం తెలుస్తుంది. భవిష్యత్ లో నిర్మించే వంతెనలకు కూడా ఇటువంటి టెక్నాలజీ అందించవచ్చని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఇప్పుడు 3 డి-ప్రింటెడ్ స్టీల్ వంతెన నిర్మాణం విజయవంతం కావడంతో ఇప్పుడు అక్కడి ఇంజనీర్లు ఈ టెక్నాలజీతో పెద్ద భవనాలను నిర్మించగలిగే టెక్నాలజీ అభివృద్ధి చేయడానికి అవసరమైన పరిశోధనలు చేస్తున్నారు. ఈ 3 డి-ప్రింటెడ్ స్టీల్ చాలా బలంగా ఉంటుందని నిర్మాణ సంస్థ ఇంజనీర్ గిరోలామీ తెలిపారు. అయితే, ఈ బలం ముద్రణా నాణ్యత మీద ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు.

3 డి-ప్రింటింగ్ అంటే..

3 డి-ప్రింటింగ్ అనేది ఒక ఉత్పాదక సాంకేతికత. దీని సహాయంతో 3 డైమెన్షనల్ విషయాలు సృష్టించవచ్చు. ఈ విషయాలు 3D- ప్రింటర్‌తో తయారు చేస్తారు. సాధారణ ప్రింటర్‌కు సిరా, కాగితం అవసరం, కానీ 3 డి-ప్రింటర్‌తో మీరు సృష్టించిన వాటి పరిమాణం, రంగు, రూపకల్పనను కూడా నిర్ణయించవచ్చు. ప్రతిదీ సెట్ చేసిన తర్వాత, డేటాను యంత్రంలోకి అందిస్తారు. రోబోట్లు వస్తువులను తయారుచేసే పనిని పూర్తి చేస్తాయి.

Also Read: Chicago Auto Show: అద్భుతమైన టెక్నాలజీతో అదరగొట్టిన సరికొత్త కార్లు..చికాగో ఆటోషో లో సందడి!

Mosquito Tornado: ఆ దేశంలో దోమల సుడిగాలి.. వీడియో హల్ చల్.. ఇది మరో విపత్తుకు సంకేతం అంటున్న నెటిజన్లు