Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fastrack Smart Watch : అతి తక్కువ ధరలో ఫాస్ట్రాక్ స్మార్ట్ వాచ్.. ఫీచర్లు అదిరిపోయాయిగా..!

వర్క్ అవుట్ సమయంలో హృదయ స్పందన రేటు, ఎస్‌పీఓ2 రేట్, క్యాలరీల సమయం వంటి ఎన్నో వివరాలను తెలియజేస్తున్నాయి. అయితే యువతను ఎక్కువగా ఆకట్టుకున్న ఫాస్ట్రాక్ బ్రాండ్ నుంచి మరో కొత్త స్మార్ట్ వాచ్ రాబోతుందని తెలుస్తుంది.

Fastrack Smart Watch : అతి తక్కువ ధరలో ఫాస్ట్రాక్ స్మార్ట్ వాచ్.. ఫీచర్లు అదిరిపోయాయిగా..!
Fastrack Revoltt Fs1
Follow us
Srinu

|

Updated on: Mar 24, 2023 | 2:00 PM

భారత్‌లో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తుంది. కేవలం వాచ్‌లు సమయం చూసుకోడానికి మాత్రమే కాకుండా మనల్ని ఫిట్‌గా ఉంచడానికి నోటిఫికేషన్లు పంపడంతో పాటు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో వస్తున్నాయి. ముఖ్యంగా జీవనశైలిని మెరుగుపర్చడంలో కూడా ఈ స్మార్ట్ వాచ్‌లు సాయపడుతున్నాయి. ప్రతిరోజూ మన దినచర్యలు మెరుగుపర్చేలా నోటిఫికేషన్లు పంపుతూ ఉంటుంది. వర్క్ అవుట్ సమయంలో హృదయ స్పందన రేటు, ఎస్‌పీఓ2 రేట్, క్యాలరీల సమయం వంటి ఎన్నో వివరాలను తెలియజేస్తున్నాయి. అయితే యువతను ఎక్కువగా ఆకట్టుకున్న ఫాస్ట్రాక్ బ్రాండ్ నుంచి మరో కొత్త స్మార్ట్ వాచ్ రాబోతుందని తెలుస్తుంది. అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండేలా ఈ వాచ్‌ను రూపొందించారు. తన రివోల్ట్ సిరీస్‌లో మరో కొత్త వాచ్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తుంది. ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్‌ఎస్ 1 పేరుతో రిలీజ్ చేసిన ఈ వాచ్ కచ్చితం వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ వాచ్ ధరను కంపెనీ కేవలం రూ.1695గా మాత్రమే నిర్ణయించింది. ఫాస్ట్రాక్ ఫ్యాషన్ సెగ్మెంట్‌లో ఈ వాచ్ తన ప్రత్యేకతను చూపిస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వాచ్ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ స్మార్ట్ వాచ్‌లో వచ్చే ఇతర ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్‌ఎస్ 1 ఫీచర్లు ఇవే

  • 1.83 అంగుళాల కర్వ్‌డ్ డిస్ ప్లే
  • అధునాతన చిప్ సెట్‌తో వేగవంతమైన పనితీరు ఫ్యాషన్ ఫంక్షన్ సదుపాయంతో అందుబాటులో 200 పైగా మోడ్స్‌
  • 110 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్
  • అధునాతన ఆరోగ్య పర్యవేక్షణ లక్షణాలతో లోడెడ్
  • నిరంతర ఒత్తిడి పర్యవేక్షణ, ఆటో స్లీప్ ట్రాకింగ్, రౌండ్ ది క్లాక్ హార్ట్ బీట్ ట్రాకింగ్, ఏఐ వాయిస్ అసిస్టెంట్‌తో పాటు జెన్ జెడ్ రెడీ ఫీచర్లు
  • బ్లాక్, బ్లూ, గ్రీన్, ఆఫ్‌బీట్ టీల్ వంటి రంగుల్లో లభ్యం

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం