Moto G 32 : కిర్రాక్ డిజైన్‌తో మోటోరోలా ఫోన్.. ఫీచర్లు, ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Srinu

Srinu |

Updated on: Mar 24, 2023 | 1:30 PM

మోటోరోలా  జీ 32 పేరుతో రిలీజ్ చేసిన ఈ ఫోన్‌లో ఇప్పటికే 4 జీబీ వేరియంట్ అందుబాటులో ఉండగా దాన్ని అప్‌గ్రేడ్ చేస్తూ 8 జీబీ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Moto G 32 : కిర్రాక్ డిజైన్‌తో మోటోరోలా ఫోన్.. ఫీచర్లు, ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Moto G32
Follow us

ప్రారంభ స్థాయి, మధ్యస్థ ఫోన్స్‌కు ప్రసిద్ధి చెందిన మోటోరోలా కంపెనీ మరోకొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. మోటోరోలా  జీ 32 పేరుతో రిలీజ్ చేసిన ఈ ఫోన్‌లో ఇప్పటికే 4 జీబీ వేరియంట్ అందుబాటులో ఉండగా దాన్ని అప్‌గ్రేడ్ చేస్తూ 8 జీబీ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 8 జీబీ ర్యామ్‌తో అందుబాటులో ఉండే ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్‌లో రూ.11,999 ధరకు అందుబాటులో ఉంది. మినరల్ గ్రే, శాటిన్ సిల్వర్ కలర్స్‌లో ఆకర్షణీయమైన డిజైన్‌లో ఈ ఫోన్ వినియోగదారులను అలరించనుంది. అయితే ఈ ఫోన్‌లో 4 జీబీ వేరియంట్ రూ.10,499కు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఫోన్ లాంచ్ సమయంలో మాత్రం రూ.12,999గా పేర్కొనడం గమనార్హం.

మోటో జీ 32 స్పెసిఫికేష్లను ఇవే

  • 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్ ప్లే
  • స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్
  • 8 జీబీ+128 జీబీ స్టోరేజ్ కెపాసిటీ
  • 50 ఎంపీ ప్రధాన కెమెరా
  • 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 30 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu