AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fan Speed: వేసవిలో మీ ఫ్యాన్‌ స్పీడ్‌ తగ్గిందా? ఇలా చేస్తే మరింత వేగం

సమ్మర్‌ కావడంతో ఎండ వేడి తీవ్రతరమవుతోంది. ప్రజల కూలర్లు, ఎయిర్ కండిషనర్ల ముందు వాలిపోతున్నారు. ఎండ తీవ్రత పెరిగిపోవడంతో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే సేద తీరుతున్నారు. దీంతో చాలా మంది ఉపశమనం పొందుతున్నారు. కానీ వేసవిలో ఫ్యాన్ కింద పడుకోవాల్సిన దుస్థితి దేశంలో ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే వేసవి సీజన్‌లో ఫ్యాన్ వేగం తగ్గుతుందని చాలా

Fan Speed: వేసవిలో మీ ఫ్యాన్‌ స్పీడ్‌ తగ్గిందా? ఇలా చేస్తే మరింత వేగం
Fan
Subhash Goud
|

Updated on: Apr 24, 2024 | 8:18 AM

Share

సమ్మర్‌ కావడంతో ఎండ వేడి తీవ్రతరమవుతోంది. ప్రజల కూలర్లు, ఎయిర్ కండిషనర్ల ముందు వాలిపోతున్నారు. ఎండ తీవ్రత పెరిగిపోవడంతో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే సేద తీరుతున్నారు. దీంతో చాలా మంది ఉపశమనం పొందుతున్నారు. కానీ వేసవిలో ఫ్యాన్ కింద పడుకోవాల్సిన దుస్థితి దేశంలో ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే వేసవి సీజన్‌లో ఫ్యాన్ వేగం తగ్గుతుందని చాలా మంది అంటుంటారు. మీకు అదే అనిపిస్తే, ఫ్యాన్ స్పీడ్ తక్కువగా ఉండడానికి గల కారణల గురించి తెలుసుకుందాం. దీనితో పాటు, ఫ్యాన్ స్పీడ్‌ను మళ్లీ పెంచే మార్గాలను కూడా తెలుసుకుందాం. వేసవి సీజన్‌లో రెండు కారణాల వల్ల ఫ్యాన్ స్పీడ్ తగ్గుతుందని, ఈ రెండు కారణాలు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే వాటి గురించి చాలా మందికి తెలియదు. దీంతో ఫ్యాన్ స్పీడ్ తగ్గినప్పుడు సదరు వ్యక్తులు మెకానిక్‌కి ఫోన్ చేసి రిపేరు చేయిస్తుంటారు. దీని వల్ల మీకు ఖర్చు పెరుగుతుంటుంది. మీరు దీన్ని నివారించాలనుకుంటే ఫ్యాన్ వేగం తక్కువగా ఉండటానికి గల కారణాలను తెలుసుకోవాలి.

ఫ్యాన్ వేగం ఎందుకు తక్కువగా ఉంటుంది?

వేసవిలో ఫ్యాన్ స్పీడ్ పెంచాలంటే ఫ్యాన్ స్పీడ్ ఎందుకు తక్కువగా ఉందో ముందుగా తెలుసుకోవాలి. వేసవిలో రెండు కారణాల వల్ల ఫ్యాన్ స్పీడ్ తగ్గుతుంది. ఇందులో మొదటి కారణం తక్కువ వోల్టేజీ. వేసవి కాలంలో అధిక విద్యుత్ వినియోగం వల్ల వోల్టేజీ తగ్గుతుంది. దీని కారణంగా ఫ్యాన్ వేగం తగ్గుతుంది.

ఇక రెండవ కారణం గురించి మాట్లాడినట్లయితే, ఫ్యాన్ వేగం కండెన్సర్ బలహీనతకు కారణం. మీ ఫ్యాన్ వేగం తక్కువగా ఉండి, వోల్టేజ్ సరిగ్గా ఉంటే, మీ ఫ్యాన్ కండెన్సర్ బలహీనంగా ఉందని భావించండి. అటువంటి సందర్భంలో మీరు మీ ఫ్యాన్ కండెన్సర్‌ని మార్చడం ద్వారా తనిఖీ చేయాలి.

కండెన్సర్‌ని మార్చడం ద్వారా ఫ్యాన్ వేగాన్ని ఎలా పెంచాలి?

ఫ్యాన్ వేగాన్ని పెంచడానికి మీరు మీ ఫ్యాన్ కండెన్సర్‌ని మార్చాలి. దీనికి మెకానిక్ అవసరం లేదు. ఎందుకంటే మీరు కండెన్సర్‌ను మీరే వేసుకోవచ్చు. మీరు పాత కండెన్సర్‌ను చూపించి మార్కెట్ నుండి కొత్త కండెన్సర్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇంటి మెయిన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఫ్యాన్‌లో కండెన్సర్‌ను అమర్చవచ్చు. దీని తర్వాత మీ ఫ్యాన్ పాత వేగంతో నడవడం ప్రారంభమవుతుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి