ఆ ఐదువందల మందిలో మీరున్నారా..? ఉంటే ఆ యాప్‌ని వెంటనే అన్‌ ఇన్‌స్టాల్‌ చేయండి.. లేదంటే మీ పని గోవింద..!

Fake Netflix App : ఈ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు, వీడియోలు చూడొచ్చని జనాలకు ఆశ కల్పిస్తూ వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. వారి వాట్సాఫ్

ఆ ఐదువందల మందిలో మీరున్నారా..? ఉంటే ఆ యాప్‌ని వెంటనే అన్‌ ఇన్‌స్టాల్‌ చేయండి.. లేదంటే మీ పని గోవింద..!
Fake Netflix App
uppula Raju

|

Apr 09, 2021 | 5:39 AM

Fake Netflix App : ఈ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు, వీడియోలు చూడొచ్చని జనాలకు ఆశ కల్పిస్తూ వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. వారి వాట్సాఫ్ మెసేజ్‌లు చూస్తూ వారికి తెలియకుండానే రిప్లై ఇస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి ఈ యాప్‌ని తొలగించారు కానీ అప్పటికే దీనిని 500 మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అందులో మీరు కనుక ఉంటే వెంటనే దానిని అన్ ఇన్‌స్టాల్ చేయండి లేదంటే చాలా నష్టపోతారు. ఈ రకం ఫేక్‌ బ్యాచ్‌ బారినపడ్డారా లేదా ఒక్కసారి తెలుసుకోండి..

ఫేక్ యాప్స్‌ను నిరోధించేందుకు గూగుల్ ఎంత ప్రయత్నిస్తున్నా.. కొత్త కొత్త మార్గాలతో అవి పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్లే స్టోర్‌ను ఆధారంగా చేసుకొని నెటిజన్లను బురిడి కొట్టిస్తున్నాయి. తాజాగా.. అలాంటి ఫేక్ యాప్ ఒకటి గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్నట్లు సైబర్ సెక్యురిటీ రీసెర్చర్స్ గుర్తించారు. ఆండ్రాయిడ్ సర్వీస్ యాప్ ‘ఫ్లిక్స్‌ఆన్‌లైన్’ పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న ఈ ఫేక్ యాప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లే లక్ష్యంగా జనాలను మాయ చేస్తుంది.

ఈ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుంటే నెట్‌ఫ్లిక్స్‌ యాక్సిస్‌ కల్పిస్తామని చెప్పి ఈ వారి వ్యక్తిగత సమాచారాని దోచేస్తుంది. వారికి తెలియకుండానే వాట్సాఫ్‌ని యాక్సెస్ చేస్తూ ఇతరులకు మెస్సేజ్‌లు పెడుతుంది. వారి అవసరాలకు అనుగుణంగా వాడుకుంటుంది. ఇన్‌కమింగ్ మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం ద్వారా మాల్‌వేర్‌ను హ్యాకర్లు వాట్సాప్‌లోకి పంపుతున్నారని సైబర్ సెక్యురిటీ రీసెర్చర్స్ తెలిపారు. అలా మాల్‌వేర్‌ను పంపి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, వాట్సప్ అకౌంట్‌కు సంబంధించిన క్రెడెన్షియల్స్‌ను తస్కరించడం, యూజర్స్ డేటాను దొంగిలించడం చేస్తున్నారని తేల్చారు.

CM KCR Review on Corona : తెలంగాణలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష.. కోవిడ్ టెస్ట్‌లను భారీగా పెంచాలని నిర్ణయం

రెట్టింపు కామెడీ డోసుతో రానున్న జాతిరత్నాలు డైరెక్టర్.. ఆ స్టార్ హీరోతో కలిసి నవ్వులు పంచనున్న అనుదీప్..

సూసైడ్ అటెంప్ట్ చేసిన బిగ్‏బాస్ కంటెస్టెంట్.. హస్పిటల్ బెడ్ పై అలా.. సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu