Etrance Neo e Scooter: హైదరాబాద్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..ఒక్కసారి ఛార్జ్ చేస్తే సిటీ అంతా రౌండ్ వేయొచ్చు! ధర ఎంతంటే..

హైదరాబాద్ కేంద్రంగా ఈ స్కూటర్లను ఉత్పత్తి చేస్తున్న స్టార్టప్ కంపెనీ ప్యూర్ ఈవీ.. తన సరికొత్త ఎట్రాన్స్ నియో ఈ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ప్రత్యేకతలు.. ధర ఎంతో తెలుసుకుందాం.

Etrance Neo e Scooter: హైదరాబాద్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..ఒక్కసారి ఛార్జ్ చేస్తే సిటీ అంతా రౌండ్ వేయొచ్చు! ధర ఎంతంటే..
Etrance E Scooter
Follow us
KVD Varma

|

Updated on: Nov 15, 2021 | 10:01 AM

Etrance Neo e Scooter: హైదరాబాద్ కేంద్రంగా ఈ స్కూటర్లను ఉత్పత్తి చేస్తున్న స్టార్టప్ కంపెనీ ప్యూర్ ఈవీ.. తన సరికొత్త ఎట్రాన్స్ నియో స్కూటర్‌ను విడుదల చేసింది. ఆధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకున్నదీని ధర రూ. 78,999 (ఎక్స్-షోరూమ్). ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 120 కి.మీల రేంజ్‌ను అందిస్తుంది. అలాగే, దీని గరిష్ట వేగం గంటకు 60 కి.మీ. ఇది మాత్రమే కాదు, ఈ స్కూటర్ ధర పరంగా Ola S1 మరియు TVS ఐ క్యూబ్‌లతో పోటీపడుతుంది. ఈ స్కూటర్ల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు లక్ష రూపాయలు ఉంది.

5 సెకన్లలో 40 kmph వేగం

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన వివరాలను  స్టార్టప్ కంపెనీ  వెల్లడించింది. ఇది కేవలం 5 సెకన్లలో 0 నుండి 40 kmph వేగాన్ని అందుకుంటుంది. అలాగే, దీని లోడ్ సామర్థ్యం 150కిలోల వరకు ఉంటుంది. ఇందులో వైట్, రెడ్, బ్లూ, బ్లాక్, గ్రే , సిల్వర్ మొత్తం 6 కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఈ ఇ-స్కూటర్‌లో నాలుగు అంగుళాల ఎల్సీడీ(LCD) డిస్‌ప్లే, రీజెనరేటివ్ బ్రేకింగ్, ఎల్ఈడీ(LED) హెడ్‌లైట్ అదేవిధంగా యాంటీ థెఫ్ట్ స్మార్ట్ లాక్ ఉన్నాయి.

పోర్టబుల్ బ్యాటరీ అందుబాటులో..

ఈ ఎలక్ట్రిక్ స్టార్టప్ భారతదేశంలోని 20 రాష్ట్రాల్లో 100 కంటే ఎక్కువ ప్రదేశాలలో డీలర్లను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.5kWH లిథియం బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది BLDC మోటారుతో జతచేయబడుతుంది. ఇది పోర్టబుల్ బ్యాటరీని కలిగి ఉంది. దీని సహాయంతో మీరు ఈ బ్యాటరీని సులభంగా తీసివేయవచ్చు. ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు ఎకో మోడ్‌లో 120 కిమీల పరిధిని ఇస్తుంది. అయితే, దీని గరిష్ట వేగం 60 కిమీలు.

ఓలా స్కూటర్ తో పోటీ..

ఈ స్కూటర్ ఓలా (Ola) S1, టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పోటీపడుతుంది. ఓలా ఎస్1 ధర రూ.99,999. ఓలా S1 5 అద్భుతమైన రంగులలో వస్తుంది. ఇది భారీ బూట్ స్పేస్‌తో వస్తుంది. దీనితో పాటు, ఐకానిక్ హెడ్‌ల్యాంప్‌లు ఇందులో ఇచ్చారు. ఈ స్కూటర్ గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. అలాగే, ఇది 3.6 సెకన్లలో 0-40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 121 కి.మీ. దీనితో పాటు, ఇందులో సాధారణ, స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి: Corona Vaccine: కోవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ పెంచాల్సిన అవసరం లేదు.. స్పష్టం చేసిన నిపుణులు!

PMAY-G: గతంలో అభివృద్ధిని రాజకీయ కోణంలో చూసేవారు..అందుకే ఈశాన్యరాష్ట్రాలు అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయి.. ప్రధాని మోడీ

New Technology: మీ పక్కన ఉన్నవారికి మీ స్మార్ట్‌ఫోన్‌‌లో మీరేమి చూస్తున్నారో కనిపించదు.. సరికొత్త టెక్నాలజీ రాబోతోంది.. తెలుసుకోండి!