- Telugu News Photo Gallery Technology photos Are you looking for a smartphone price under 20000 here some best phones
SmartPhone: రూ. 20 వేలలోపు స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా.? మీ బడ్జెట్‌లో ఉన్న బెస్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
SmartPhone: కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనలాని ప్లాన్ చేస్తున్నారా.? తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్ కావాలనుంటున్నారా.? అయితే ఓ సారి ఈ ఫోన్లపై లుక్కేయండి. రూ. 20 వేలు ఉన్న బడ్జెట్ ఫోన్‌లు..
Updated on: Nov 15, 2021 | 11:00 AM

iQOO Z3: ఈ ఫోన్‌లో 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఇక 64 ఎంపీ రెయిర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందించారు. 4,400 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. 5జీ నెట్‌వర్క్ సపోర్ట్ ఇచ్చే ఈ స్మార్ట్‌ఫోన్ 6జీబీర్యామ్/ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 19,990కి అందుబాటులో ఉంది.

Realme 8s 5G: 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి రియల్‌మీ 8ఎస్ మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక ఈ ఫోన్‌లో 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ఈ ఫోన్‌లో 64 ఎంపీ రెయిర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ ఫోన్ 6జీబీర్యామ్/128 జీబీ స్టోరేజ్ వెర్షన్ రూ. 17,999కి అందుబాటులో ఉంది.

Redmi Note 10 Pro/Pro Max: రూ. 20వేల లోపు ఉన్న బెస్ట్ ఫోన్స్‌లో రెడ్‌మి నోట్ 10 ప్రో/ ప్రో మ్యాక్స్ ఫోన్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలో ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. అయితే ప్రోలో 64 మెగాపిక్సెల్స్ రెయిర్ కెమెరా ఉంటే.. ప్రో మ్యాక్స్‌లో మాత్రం 108 మెగాపిక్సెల్స్ కెమెరాను అందించారు. రెండింటిలోనూ 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందించారు. రెండింటిలోనూ 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇక ఈ ఫోన్ల ధర విషయానికొస్తే రెడ్‌మీ నోట్ 10 ప్రో 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ ధర రూ. 17,999కాగా, మ్యాక్స్ ప్రో ధర రూ. 19,999గా ఉంది.

Poco X3 Pro: ఈ స్మార్ట్ ఫోన్ 6జీబీ ర్యామ్/ 128 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 18,999గా ఉంది. ఇందులో 6.67 ఇంచెన్ ఫుల్ హెచడీ + డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే 48 ఎంపీ రెయిర్ కెమెరాతో పాటు 20 సెల్ఫీ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ఈ ఫోన్‌లో 5,160 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.

Motorola G40: రూ. 20 వేల లోపు అందుబాటులో ఉన్న ఫోన్లలో మోటోరోలో జీ40 కూడా బెస్ట్ ఫోన్‌గా చెప్పొచ్చు. ఇందులో ఏకంగా 64 మెగాపిక్సెల్స్ రెయిర్ కెమెరాతో పాటు 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందించారు. ఇందులో 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,499గా ఉంది.





























