- Telugu News Photo Gallery Technology photos Tecno Launches New smart phone tecno pop 5 c with low price have a look on features and price details
Tecno pop 5c: అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది.. టెక్నో పాప్ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Tecno pop 5c: స్మార్ట్ ఫోన్ రంగంలో మరో సంచలం రానుంది. అత్యంత తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తోంది టెక్నో పాప్ 5సీ. ఇటీవల లాంచ్ అయిన ఈ ఫోన్ ఫీచర్లను ఓసారి చూసేయండి..
Updated on: Nov 14, 2021 | 4:38 PM

ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలంటే కనీసంలో కనీసం రూ. 20వేలకు పైమాటే, కానీ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల ధరలు విపరీతంగా తగ్గిపోతున్నాయి. కంపెనీల మధ్య పెరుగుతోన్న పోటీ కారణంగా తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి.

ఇప్పటికే రిలయన్స్ జియో నెక్ట్స్ పేరుతో చవకైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా టెక్నో కంపెనీ అత్యంత తక్కువ ధరకే ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇప్పటికే ఈ ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసినప్పటికీ ధరను మాత్రం నిర్ణయించలేదు.

అయితే తాజాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ స్మార్ట్ ఫోన్ భారత్‌లో రూ. 3000 నుంచి రూ. 5000 మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది. అలా అని ఫీచర్ల తక్కువేం లేవండోయ్..

నవంబర్ 13న లాంచ్ చేసిన ఈ ఫోన్‌లో 5 ఇంచులతో 480*854 జిజల్యూషన్‌తో కూడిన టచ్ స్క్రీన్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ఈ ఫోన్‌లో 1 జీబీ ర్యామ్ అందించారు.

ఇక ఈ ఫోన్‌లో ఇన్‌బుల్ట్‌గా 16జీబీ మెమొరీని అందించారు. కెమెరా విషయానికొస్తే 5 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక 2400 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించడం విశేషం.





























