Smartphone: స్మార్ట్‌ఫోన్‌ కింద ఉండే ఈ హోల్‌ ఉపయోగం ఏంటో తెలుసా.?

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వినియోగం అనివార్యంగా మారింది. ప్రతీ ఒక్కరి చేతిలో ఫోన్ ఉండాల్సిందే. అయితే మనం ఉపయోగించే ఫోన్‌లో మనకు తెలియని ఎన్నో ఫీచర్లు ఉంటాయని చాలా మందికి తెలియదు. సాధారణంగా మనం ఉపయోగించే అన్ని స్మార్ట్‌ ఫోన్స్‌కి కింద ఒక చిన్న రంధ్రం కనిపిస్తుంది. అయితే మనలో చాలా మందికి దాని ఉపయోగం ఏంటో చాలా మందికి తెలియదు...

Smartphone: స్మార్ట్‌ఫోన్‌ కింద ఉండే ఈ హోల్‌ ఉపయోగం ఏంటో తెలుసా.?
Smartphone Hole
Follow us

|

Updated on: Jul 09, 2024 | 11:37 AM

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వినియోగం అనివార్యంగా మారింది. ప్రతీ ఒక్కరి చేతిలో ఫోన్ ఉండాల్సిందే. అయితే మనం ఉపయోగించే ఫోన్‌లో మనకు తెలియని ఎన్నో ఫీచర్లు ఉంటాయని చాలా మందికి తెలియదు. సాధారణంగా మనం ఉపయోగించే అన్ని స్మార్ట్‌ ఫోన్స్‌కి కింద ఒక చిన్న రంధ్రం కనిపిస్తుంది. అయితే మనలో చాలా మందికి దాని ఉపయోగం ఏంటో చాలా మందికి తెలియదు. ఇంతకీ దీని ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

స్మార్ట్‌ఫోన్‌కి కింద ఉండే చిన్న రంధ్రాన్ని సాధారణంగా మైక్రో ఫోన్‌ అనుకుంటాం. అయితే ఇది నిజానికి ఇది మైక్రోఫోన్‌ గ్రిల్‌. ఈ రంధ్రం నాయిస్‌ క్యాన్సిలేషన్‌ మైక్రోఫోన్‌గా పనిచేస్తుంది. మనం కాల్స్ మాట్లాడే సమయంలో చుట్టు పక్కల నుంచి వచ్చే శబ్ధాలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఈ మైక్రో ఫోన్ మెయిన్‌ మైక్రోఫోన్‌తో కలిసి పనిచేస్తుంది.

మీరు ఎవరికైనా కాల్‌ చేసినప్పుడు ఈ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ మైక్రోఫోన్‌ చుట్టుపక్కల నుంచి వచ్చే శబ్ధాలను గ్రహిస్తుంది. దీంతో మనం మాట్లాడేందుకు ఉపయోగించే ప్రధాన మైక్రోఫోన్‌ ద్వారా కేవలం మనం మాట్లాడే మాటలే అవతలి వ్యక్తులకు వినబడేలా చేస్తాయి. దీంతో మీరు మాట్లాడే మాటలు అవతలి వ్యక్తులకు స్పష్టంగా వినిపిస్తాయి. అయితే పక్కనున్న శబ్ధాలు వినిపించినప్పటికీ దాని తీవ్రత మాత్రం ఎంతో కొంత తగ్గుతుంది.

ఈ నాయిస్ క్యాన్సిలేజన్‌ లేకపోతే కాల్స్‌ మాట్లాడడంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. చుట్టు పక్కల శబ్ధాలు వినిపించడంతో కాల్‌ క్లారిటీగా వినిపించదు. కొన్ని రకాల పాత ఫోన్‌లలో ఇలాంటి ఫీచర్‌ అందుబాటులో ఉండవు. అయితే ప్రస్తుతం వస్తున్న దాదాపు అన్ని ఫోన్స్‌లో ఈ ఫీచర్‌ను కంపెనీలు తీసుకొస్తున్నాయి. ఇక ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న ఇయర్‌ బడ్స్‌లోనూ ఇలాంటి ఫీచర్లను కంపెనీలు పరిచయం చేస్తున్నాయి. ఈ టెక్నాలజీ ఇయర్ బడ్స్‌తో కూడా నాయిస్‌ లేకుండా సంభాషణలు చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..