Nokia: మొబైల్‌ ఫోన్‌ తయారీ కంటే ముందు.. నోకియా ఏం చేసేదో తెలుసా.?

నోకియా.. ఈ బ్రాండ్ ప్రతీ ఒక్కరికీ తెలిసిందే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఓ 15 ఏళ్ల క్రితం మార్కెట్లో నోకియా హవా ఓ రేంజ్ లో ఉండేది. అయితే ఇంతకీ నోకియా కంపెనీ ఎలా ప్రారంభమైంది.? మొబైల్ ఫోన్స్ తయారీ కంటే ముందు నోకియా ఏ వ్యాపారం చేసింది.? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Nokia: మొబైల్‌ ఫోన్‌ తయారీ కంటే ముందు.. నోకియా ఏం చేసేదో తెలుసా.?
Nokia
Follow us

|

Updated on: Oct 21, 2024 | 11:29 AM

నోకియా.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మొబైల్ ఫోన్ అనగానే నోకియా పేరు గుర్తొచ్చేవి. ఫీచర్‌ ఫోన్‌లో నోకియా హవా ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా నోకియా మొబైల్ ఫోన్‌ ఇండస్ట్రీలో సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత నోకియా బ్రాండ్ క్రమంగా మసబారింది. ముఖ్యంగా నోకియా నుంచి ఆండ్రాయిడ్ ఫోన్‌లు విడుదల చేయకపోవడంతో మార్కెట్లో వెనకబడింది. విండోస్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఫోన్‌లను తీసుకొచ్చిన ఆశించిన స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో నోకియా సైతం ఆండ్రాయిడ్ ఫోన్‌లను తీసుకొస్తూ మార్కెట్లో మళ్లీ పుంజుకుంటోంది. అయితే నోకియా కంపెనీ మొబైల్ తయారీలోకి అడుగుపెట్టే కంటే ముందు ఏం చేసేదో ఎప్పుడైనా ఆలోచించారా.? ఒక చిన్న కంపెనీగా మొదలైన నొకియా ప్రస్థానం ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ కంపెనీగా నోకియా ఎలా అవతరించిందో ఇప్పుడు తెలుసుకుందాం..

నోకియా తొలిసారి చెక్క పల్ప్‌ ఫ్యాక్టరీని ప్రారంభించింది. 1865లో ఫిన్‌లాండ్‌లో ఈ కంపెనీ ప్రారంభించింది. చెక్క గుజ్జుతో కాగితం, ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించారు. తర్వాత నోకియా క్రమంగా తన పరిధితి విస్తరిస్తూ పోయింది. ఆ తర్వాత రబ్బరు ఉత్పత్తులు, కేబుల్స్‌తోపాటు ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీని ప్రారంభించింది.

నోకియా మొదటిసారి 1960లో టెలికాం పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం ప్రారంభించింది. టెలికాం పరికరాల తయారీని ప్రారంభించింది. స్విచ్‌ బోర్డ్‌లు, టెలిఫోన్‌లు, కేబుల్స్‌ను తయారు చేశాయి. ఈ సమయంలో నోకియా మంచి బ్రాండ్‌ను సొంతం చేసుకుంది. ఇక నోకియా 1980లో మొబైల్ తయారీ రంగంలోకి ప్రవేశించింది. 1982లో మొదటి మొబైల్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది.

ఆ తర్వాత మొబైల్‌ ఫోన్‌ మార్కెట్లో భారత్‌ పెద్ద ప్లేయర్‌గా మారింది. మరీ ముఖ్యంగా భారత మార్కెట్లో నోకియాకు ఆదరణ భారీగా పెరిగిపోయింది. 1990 నుంచి 2000 మధ్య మొబైల్‌ మార్కెట్‌ను నోకియా ఏలిందని చెప్పాలి. అయితే ఆ తర్వాత యాపిల్‌ ఐ ఓఎస్‌తో రావడం.. అలాగే సామ్‌సంగ్‌ ఆండ్రాయిడ్ ఫోన్‌తో రావడంతో నోకియా క్రమంగా మార్కెట్లో పట్టుకోల్పోతూ వచ్చింది. ఇక చైనా కంపెనీల రాకతో నోకియా షేర్‌ భారీగా తగ్గిపోయింది. అయితే తాజాగా మళ్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్‌తో నోకియా పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ