AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Redmi Laptop: తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఈ రెడ్‌మీ ల్యాప్‌టాప్ గురించి తెలుసా? ఫీచర్లు చూస్తే అవ్వాకవుతారంతే..!

ల్యాప్‌టాప్‌లను కూడా యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఈ కంపెనీ రిలీజ్ చేసే ల్యాప్‌టాప్‌లు తక్కువ ధరకు అందుబాటులో ఉండడమే కాకుండా ప్రీమియం ల్యాప్‌టాప్‌ల్లో ఉండే ఫీచర్లు కూడా ఇందులో ప్రీ ఇన్‌స్టాల్ అయ్యి వస్తున్నాయి. ముఖ్యంగా రెడ్‌మీ బుక్ ప్రో యువతను ఎక్కువగా ఆకట్టుకుంటుంది.

Redmi Laptop: తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఈ రెడ్‌మీ ల్యాప్‌టాప్ గురించి తెలుసా? ఫీచర్లు చూస్తే అవ్వాకవుతారంతే..!
Laptop
Nikhil
|

Updated on: May 02, 2023 | 3:45 PM

Share

భారత్‌లో స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థగా ప్రవేశించిన రెడ్‌మీ కంపెనీ వినియోగదారుల ఆదరణను అందుకుంటుంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా రెడ్‌మీ కంపెనీ కూడా వివిధ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది. రెడ్‌మీ కంపెనీ తీసుకువచ్చిన టీవీలను మధ్యతరగతి ప్రజానీకం ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తాజాగా ఈ కంపెనీ రిలీజ్ చేస్తున్న ల్యాప్‌టాప్‌లను కూడా యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఈ కంపెనీ రిలీజ్ చేసే ల్యాప్‌టాప్‌లు తక్కువ ధరకు అందుబాటులో ఉండడమే కాకుండా ప్రీమియం ల్యాప్‌టాప్‌ల్లో ఉండే ఫీచర్లు కూడా ఇందులో ప్రీ ఇన్‌స్టాల్ అయ్యి వస్తున్నాయి. ముఖ్యంగా రెడ్‌మీ బుక్ ప్రో యువతను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. కేవలం రూ.37,999కు అందుబాటులో ఉండే ఈ ల్యాప్‌టాప్‌ను 15.6 అంగుళాల 242 పీపీఐ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రీఇన్‌స్టాల్ చేసి వస్తుంది. ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్‌తో పాటు 11 జెనరేషన్ నుంచి ఐ 5 ప్రాసెసర్‌తో వస్తుంది. అలాగే ఈ వేరియంట్ 512 జీబీ ఎస్ఎస్‌డీతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 8 జీబీ డీడీఆర్ ర్యామ్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. 

ఫీచర్లు ఇవే

ఈ మోడల్ సాధారణ అవసరాల కోసం చాలా ఉపయోగంగా ఉంటుంది. విండోస్ 11 హోం ఆపరేటింగ్ సిస్టమ్‌గా ఇన్‌స్టాల్ చేశారు. ఈ ల్యాప్‌టాప్ బరువు 1.8 కిలోలుగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌కు కంపెనీ ఒక సంవత్సరం వారెంటీ వస్తుంది. యాంటీ గ్లేర్ స్క్రీన్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్‌లో 1920×1080 స్క్రీన్ రిజుల్యూషన్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ డీసీ డిమ్మింగ్, 81.8% స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో ఈథర్‌నెట్, వైఫై, బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ ఎంపికలు ఉన్నాయి. రెండు యూఎస్‌బీ 3.0 పోర్ట్‌లు, ఒక USB 2.0 పోర్ట్ అందుబాటులో ఉంటుంది. 2 x 2డబ్ల్యూ స్టీరియో స్పీకర్, అంతర్నిర్మిత మైక్రోఫోన్, వేరొకరితో వీడియో కాల్ చేయడానికి వెబ్‌క్యామ్ ఫెసిలిటీ అలాగే హెచ్‌డీఎంఐ కనెక్టివిటీతో వస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..