Airplane mode: ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉండే ఈ ఐదు హిడెన్ ఫ్యూచర్స్ గురించి మీకు తెలుసా?
మన జీవితంలో మొబైల్ ఫోన్ అనేది ఒక పార్ట్‌గా అయిపోయింది. దాన్ని వాడంది మనకు రోజే గడవదు. అయితే వాటిలో ఉండే అన్ని ఫీచర్ల గురించి చాలా మందికి పూర్తి స్థాయిలో తెలియదు. అలాంటి వాటిల్లో ఒక మన ఫోన్‌లో ఉండే ఎయిర్‌ప్లేన్ మోడ్. ఇప్పుడు వచ్చే ప్రతి మొబైల్‌లో ఈ మోడ్ ఉంటుంది. దాన్ని చాలా వరకు ఫ్లైట్‌లో ప్రయాణించేప్పుడు యూజ్ చేస్తారు. కానీ దీని వల్ల అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది చాలా మందికి తెలియదు. అయితే అవేంటో తెలుసుకుందాం పదండి.

మన స్మార్ట్‌ఫోన్‌లో ఉండే ఈ ఎయిర్‌ప్లేన్ మోడ్ గురించి మనం మాట్లాడుకుంటే, నేటికీ చాలా మంది ఈ మోడ్ విమాన ప్రయాణ సమయంలో మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటారు, కానీ ఈ మోడ్ మీ దైనందిన జీవితంలో పెద్ద పనులను కూడా సులభతరం చేస్తుందని మీకు తెలుసా. మనకు మొబైల్‌తో ఎక్కవగా పనిలేనప్పుడు ఈ మోడ్‌ను ఆన్ చేస్తే నెట్‌వర్క్‌లు, Wi-Fi, బ్లూటూత్ వంటి పరికరం యొక్క అన్ని వైర్‌లెస్ కనెక్షన్‌లను తాత్కాలికంగా ఆపివేస్తుంది. దీని వల్ల బ్యాటరీ వినియోగాన్ని తగ్గించడమే కాకుండా, దాని లైఫ్ కూడా పెరుగుతుంది. ఇలానే ఎయిరోప్లేన్ మోడ్ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు ఏంటనేవి చూసుకుంటే.
మొబైల్ త్వరగా ఛార్జ్ అవ్వడం
చార్జింగ్ పెట్టినప్పుడు మీ ఫోన్ నెమ్మదిగా చార్జ్ అవుతున్నట్టు అనిపిస్తే.. ఈ మోడ్ మీకు చాలా సహాయపడుతుంది. మీరు మీ మొబైల్‌ను వేగంగా ఛార్జ్ చేయాలనుకుంటే, ఛార్జ్ చేస్తున్నప్పుడు ఫోన్‌లో ఉన్న ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్‌లో ఉంచండి. ఇలా చేయడం ద్వారా నడుస్తున్న నెట్‌వర్క్ కార్యాచరణ పూర్తిగా ఆగిపోతుంది. ఇది ఫోన్ ఛార్జింగ్ వేగాన్ని కూడా పెంచుతుంది.
బ్యాటరీని కూడా ఆదా చేస్తుంది
మీరు తక్కువ నెట్‌వర్క్ కవరేజ్ ఉన్న ప్రాంతంలో ఉంటే, మీ ఫోన్ నిరంతరం సిగ్నల్ కోసం శోధిస్తుంది, ఇది మీ బ్యాటరీని త్వరగా ఖాళీ అయ్యేట్లు చేస్తుంది. అయితే, అటువంటి పరిస్థితులలో కూడా, మీరు ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయడం ద్వారా బ్యాటరీని ఆదా చేయవచ్చు.
దృష్టి కేంద్రీకరించడానికి సహాయపడుతుంది.
మనం ఏదైనా ముఖ్యమైన పని చేస్తుంటే లేదా చదువుకునేప్పుడు.. మీ ఫోన్‌లో నిరంతరం నోటిఫికేషన్‌లు వస్తుండటం, లైట్ బ్లింక్ కావడం వల్ల మీరు ఏకాగ్రతను కోల్పోతారు. అలాంటి సమయాల్లో మీరు ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఉపయోగించవచ్చు. మీరు దీన్ని ఆన్ చేసిన తర్వాత, మీకు ఎటువంటి కాల్‌లు అందవు లేదా ఇతర సందేశాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు
మీ పిల్లలను ఇంటర్నెట్ నుండి దూరంగా ఉంచుతుంది
ముఖ్యంగా పిల్లలు ఫోన్ వాడేప్పుడు ఈ ఫీచర్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ పిల్లలు మీ ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఇంటర్నెట్‌కు దూరంగా ఉంచేందుకు ఈ ఫీచర్ సహాయపడుతుంది. వారికి ఫోన్ ఇచ్చే ముందు ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేసి ఇవ్వాలి ఇలా చేయడం ద్వారా వాళ్లను ఆఫ్‌లైన్ గేమ్స్‌కు దూరంగా ఉంచడంతో పాటు ఇంటర్నెట్ వాడకుండా అడ్డుకోవచ్చు.
ఫోన్ వేడెక్కకుండా కాపాడుకోండి
కొన్నిసార్లు సిగ్నల్ సరిగా లేకపోవడం లేదా అధిక పనిభారం కారణంగా మీ ఫోన్ వేడెక్కుతుంది. అలాంటి సందర్భాలలో, ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయడం వల్ల ప్రాసెసర్‌పై లోడ్ తగ్గి మీ మొబైల్ చల్లబడి పనితీరు మెరుగుపడుతుంది.
గమనిక: పై సూచించిన ట్రిక్స్ అన్ని మీకు ఫోన్‌తో ఎక్కువగా అవసం లేనప్పుడు, నెట్‌వర్క్ సమస్యలు ఉన్నప్పుడు వాడవచ్చు, అత్యవస సమయాల్లో వీటిని మినహాయించడం మంచిది. (అంటే రాత్రి మనం పడుకునేప్పుడు, మనం విశ్రాంతి తీసుకునే సమాయాల్లో)
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




