DND Activation Service: స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టండిలా.. ట్రాయ్ అందించే సేవలు చూస్తే అదిరిపోతారంతే..

ప్రత్యేకించి మీరు మీటింగ్‌లో బిజీగా ఉన్నప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన కాల్ కోసం వేచి ఉన్నప్పుడు. క్రెడిట్ కార్డ్‌లు, మార్కెటింగ్, టెలిషాపింగ్ లేదా మోసపూరిత కాల్స్ రావడంతలనొప్పిగా మారుతుంది. అంతేకాకుండా, ఈ కాల్‌లలో చాలా వరకు బ్యాంకు ప్రతినిధులుగా నటిస్తున్న వ్యక్తులు మోసపూరిత కాల్స్ చేస్తూ మన సొమ్మును కాజేసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి.

DND Activation Service: స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టండిలా.. ట్రాయ్ అందించే సేవలు చూస్తే అదిరిపోతారంతే..
Dnd
Follow us
Srinu

|

Updated on: Mar 07, 2023 | 5:00 PM

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఫోన్స్ వాడుతున్నారు. సమాచార మార్పిడికే కాకుండా ఇతర అవసరాలకు కూడా ఫోన్ వాడకం పెరగింది. వ్యాపార అభివ‌ృద్ధికి, ఆఫర్లు తెలియజేయడానికి కంపెనీలు కూడా ఫోన్స్‌నే సాధనంగా వాడుకుంటున్నాయి. టెక్నాలజీని వాడి అందరికీ ఫోన్స్ ద్వారా ఆఫర్ల సమాచారం చేరవేస్తున్నాయి. అయితే ఈ కాల్స్ మనం మంచి ఇంపార్టెంట్ పనుల్లో బాగా ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా టెలిమార్కెటింగ్, స్పామ్ కాల్‌లు చికాకు కలిగిస్తాయి మరియు తరచుగా మీ సమయాన్ని వృథా చేస్తాయి, ప్రత్యేకించి మీరు మీటింగ్‌లో బిజీగా ఉన్నప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన కాల్ కోసం వేచి ఉన్నప్పుడు. క్రెడిట్ కార్డ్‌లు, మార్కెటింగ్, టెలిషాపింగ్ లేదా మోసపూరిత కాల్స్ రావడంతలనొప్పిగా మారుతుంది. అంతేకాకుండా, ఈ కాల్‌లలో చాలా వరకు బ్యాంకు ప్రతినిధులుగా నటిస్తున్న వ్యక్తులు మోసపూరిత కాల్స్ చేస్తూ మన సొమ్మును కాజేసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. అయితే స్పామ్ కాల్స్‌ను అరికట్టడానికి డీఎన్‌డీ సర్వీస్ యాక్టివేట్ చేసుకోవాలంటే నిజమైన బ్యాంకింగ్ సేవలు, డెలివరీ సేవలు కూడా కోల్పోయే అవకాశం ఉండడంతో అటువైపుగా ఎవరూ ఆలోచించడం లేదు. స్పామ్ కాల్‌లను శాశ్వతంగా బ్లాక్ చేయడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రత్యేక సేవను ప్రారంభించింది. స్పామ్ కాల్స్‌ను బ్లాక్ చేయడంలో వ్యక్తులకు సహాయపడటానికి ట్రాయ్ నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (ఎన్‌సీపీఆర్)ను ప్రారంభించింది.

సింపుల్ స్టెప్స్‌తో డీఎన్‌డీ యాక్టివేషన్ ఇలా

  • మన ఫోన్ నుంచి స్టార్ట్ అని టైప్ చేసి 1909కు పంపాలి.
  • అప్పుడు కేటగిరీల జాబితాను వస్తుంది. మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న వాటి కోడ్‌ను రిప్లై ఇవ్వాలి. రియల్ ఎస్టేట్, విద్య, ఆరోగ్యం మొదలైన నిర్దిష్ట వర్గం నుంచి కాల్‌లను నియంత్రించడానికి మీరు ఎంచుకోగల కొన్ని కోడ్‌లు ఇక్కడ ఉన్నాయి.
  • తర్వతా అన్ని వర్గాలకు పూర్తిగా బ్లాక్ చేయండి (బ్లాక్) అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. 
  • బ్యాంకింగ్/ఇన్సూరెన్స్/క్రెడిట్ కార్డ్‌లు/ఫైనాన్షియల్ ఉత్పత్తుల కోసం బ్లాక్ 
  • రియల్ ఎస్టేట్ కోసం బ్లాక్ 2
  • విద్య సంబంధిత స్పామ్‌ల కోసం బ్లాక్ 3
  • ఆరోగ్యం కోసం బ్లాక్ 4
  • వినియోగ వస్తువులు/ఆటోమొబైల్స్/వినోదం/ఐటీ కోసం బ్లాక్ 5
  • కమ్యూనికేషన్/బ్రాడ్‌కాస్టింగ్ కోసం బ్లాక్ 6
  • టూరిజం, విశ్రాంతి కోసం బ్లాక్ 7
  • ఆహారం, పానీయాల కోసం బ్లాక్ 8
  • మనం ఎంచుకున్న కోడ్‌లను 1909కి పంపాలి.
  • అనంతరం మన అభ్యర్థనను నిర్ధారించే సందేశం వస్తుంది. అంతేకాదు ఈ సేవ 24 గంటల్లో ప్రారంభమవుతుంది. 

అలాగే టెలికాం యాప్స్ ద్వారా కూడా ఈ సర్వీస్‌ను యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంది. యాప్‌ను ఓపెన్ చేసి కొన్ని స్టెప్స్ ఫాలో అయితే సింపుల్‌గా ఈ సర్వీస్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..