Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోషల్ మీడియాతో మహిళలు జాగ్రత్త.. వేధింపులకు గురి కాకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి

మహిళలు ఆన్‌లైన్ వేధింపులను ఎదుర్కొంటుంటే లేదా హరాస్మెంట్ చేసే వ్యక్తులను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్లో బ్లాక్ చేయాలి. లేదా పోలీసులకు రిపోర్ట్ చేయాలి. అలాగే, వెబ్‌సైట్లలో Privacy సెట్టింగ్‌లు సరిచూసుకోవడం ద్వారా అనధికార వ్యక్తులు కంటెంట్‌ను చూడకుండా అడ్డుకోవచ్చు. కొత్త వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులు ఆమోదించేటప్పుడు లేదా సందేశాలకు స్పందించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సోషల్ మీడియాతో మహిళలు జాగ్రత్త.. వేధింపులకు గురి కాకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి
Social Media Harassment
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Surya Kala

Updated on: Mar 14, 2025 | 3:40 PM

ప్రస్తుతం ఆధునిక యుగం నడుస్తోంది. అంతేకాదు సైబర్ నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియాలో వేధింపులకు గురి కాకుండా మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్‌కు స్పందించకూడదు. ముఖ్యంగా వీడియో కాల్‌లో వ్యక్తిగత ఫొటోలు లేదా సమాచారాన్ని పంచుకోవద్దు. ఎందుకంటే ఇవి మార్ఫింగ్‌ చేయబడే ప్రమాదం ఉంది. సోషల్ మీడియా లేదా WhatsApp గ్రూపుల్లో అనుమతి లేకుండా చేర్చితే.. వాటిని వెంటనే వదిలేయడం మంచిది.

ఇంకా ఫేక్ ప్రొఫైల్స్, తప్పుడు పోస్టులు లేదా అసభ్యకరమైన కంటెంట్ సోషల్ మీడియాలో కనిపిస్తే, వాటిని సోషల్ మీడియా హెల్ప్ సెంటర్‌కు లేదా పోలీసులకు రిపోర్ట్ చేయాలి. మీ పేరు, ఫోటోను ఎవరో తప్పుడు ఉద్దేశంతో వాడుకుంటే తక్షణమే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.

ఇలాంటి సైబర్ నేరాలను ఎదుర్కొనడానికి www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు లేదా 100 (పోలీస్ హెల్ప్‌లైన్) నంబర్‌కు కాల్ చేసి సహాయం పొందాలి. మహిళలు ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండేందుకు ఈ జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్తగా ఉండండి.. సురక్షితంగా ఉండండి! అంటూ CERT-In (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం-ఇండియా), ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మహిళల కోసం “మహిళా సురక్షా” అనే సైబర్ భద్రతా హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు మహిళలు ఆన్‌లైన్‌లో ఎదుర్కొనే ప్రమాదాలను నివారించేందుకు ఉపయోగపడతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని  తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..