AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung Galaxy Book-5 Series: భారత్‌లో అందుబాటులో గెలాక్సీ బుక్-5 సిరీస్ ల్యాప్‌టాప్స్.. టాప్ రేపుతున్న ఫీచర్లు

ఇటీవల కాలంలో ల్యాప్‌టాప్‌ల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్ సమయం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం మొదలు కావడంతో ప్రతి ఇంట్లో ఓ ల్యాప్‌టాప్ ఉండడం సర్వ సాధారణమైంది. అలాగే విద్యార్థులకు ప్రాజెక్టు వర్కులతో ఇతర అవసరాలకు ల్యాప్‌టాప్‌ల అవసరం పెరగడంతో అన్ని కంపెనీలు సరికొత్త ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా సామ్‌సంగ్ కంపెనీ తన గెలాక్సీ బుక్-5 సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Samsung Galaxy Book-5 Series: భారత్‌లో అందుబాటులో గెలాక్సీ బుక్-5 సిరీస్ ల్యాప్‌టాప్స్.. టాప్ రేపుతున్న ఫీచర్లు
Samsung Galaxy Book 5 Series
Nikhil
|

Updated on: Mar 14, 2025 | 4:56 PM

Share

సామ్‌సంగ్ ప్రియులు ఎన్నో రోజులు నుంచి ఎదురుచూస్తున్న గెలాక్సీ బుక్-5 సిరీస్ ల్యాప్‌టాప్స్‌ను ఆ కంపెనీ ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ చేసింది. లేటెస్ట్ గెలాక్సీ బుక్ సిరీస్ ల్యాప్‌టాప్స్‌లో గెలాక్సీ బుక్-5 ప్రో, గెలాక్సీ బుక్-5 ప్రో 360, గెలాక్సీ బుక్-5 360 వేరియంట్స్ కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.  ఈ ల్యాప్‌టాప్‌లో ఏఐ ఆధారిత ఫీచర్స్ కోసం కోసం 47 టీఓపీఎస్ వరకు ఇచ్చే ఎన్‌పీయూతో కూడిన తాజా ఇంటెల్ కోర్ అల్ట్రా సీపీయూ (సిరీస్ 2) గెలాక్సీ బుక్ 5 సిరీస్‌లో ఉన్నాయి. కోపైలట్ ప్లస్ పీసీల్లో 3కే వరకు రిజల్యూషన్ ఎమోఎల్ఈడీ స్క్రీన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లు ఒకే ఛార్జ్‌పై 25 గంటల వరకు పని చేస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. 

గెలాక్సీ బుక్-5 ప్రో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 3కే రిజల్యూషన్‌తో 14 అంగుళాల ఎమోఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తుంది. గెలాక్సీ బుక్-5 360 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎమోఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తుండగా గెలాక్సీ బుక్-5 ప్రో 360 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 16 అంగుళాల ఎమోఎల్ఈడీ 3కే డిస్‌ప్లేతో ఆకట్టుకుంటుంది. సామ్‌సంగ్ గెలాక్సీ బుక్-5 సిరీస్ ల్యాప్‌టాప్స్‌ ఐ5 లేదా ఐ 7 అల్ట్రా ప్రాసెసర్‌లను అందిస్తోంది. ఈ మూడు వెర్షన్‌లు 16 జీబీ +256 జీబీ, 32 జీబీ + 512 జీబీ, 1 టీబీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త గెలాక్సీ బుక్ 5 సిరీస్‌లో మైక్రోసాఫ్ట్ ఫోన్ లింక్, క్విక్ షేర్, మల్టీ-కంట్రోల్ వంటి అనేక ఏఐ ఆధారిత ఫీచర్లు ఉన్నాయి. ఇవి గెలాక్సీ ఏఐ సూట్‌తో పాటు సజావుగా మల్టీ సిస్టమ్ కమ్యూనికేషన్‌ను అనుమతిస్తాయి. 

గెలాక్సీ బుక్-5 ప్రో ల్యాప్‌టాప్స్‌లో 360 స్టీరియో స్పీకర్లు ఆకర్షిస్తున్నాయి. గెలాక్సీ బుక్ 5 ప్రో, ప్రో 360 క్వాడ్ స్పీకర్లను కలిగి ఉన్నాయి. మెరుగైన ఆడియో అనుభవం కోసం అన్ని మోడళ్లు డాల్బీ అట్మోస్‌కు మద్దతు ఇస్తాయి. అదనంగా ప్రతి వేరియంట్‌లో అధిక నాణ్యత వీడియో కాల్‌ల కోసం 2 ఎంపీ ఫుల్ హెచ్‌డీ  వెబ్‌క్యామ్ ఉంటుంది. గెలాక్సీ బుక్-5 5 360 ధర రూ.1,14,990 నుంచి ప్రారంభమవుతుంది. అయితే గెలాక్సీ బుక్-5 ప్రో, గెలాక్సీ బుక్-5 ప్రో 360 ధర వరుసగా రూ.1,31,990 మరియు రూ.1,55,990గా ఉన్నాయి. ఈ మూడు మోడళ్లు సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు సామ్‌సంగ్ ఇండియా స్మార్ట్ కేఫ్స్‌తో పాటు అధీకృత రిటైల్ స్టోర్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్స్ మార్చి 20, 2025 నుంచి వినియోగాదారులకు అందుబాటులో ఉంటాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI 1st T20I: భారత్ ముందు 172 పరుగుల ఛాలెంజ్
IND vs WI 1st T20I: భారత్ ముందు 172 పరుగుల ఛాలెంజ్
ఈఎంఐల్లో ఐఫోన్ కొంటున్నారా? ఒక్కసారి హీరో విజయ్ మాటలు వినండి
ఈఎంఐల్లో ఐఫోన్ కొంటున్నారా? ఒక్కసారి హీరో విజయ్ మాటలు వినండి
ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలో విషాదం.. గ్రెనేడ్ పేలి చేయి ఛిద్రం
ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలో విషాదం.. గ్రెనేడ్ పేలి చేయి ఛిద్రం
రాత్రి పడుకునే ముందు ఈ యోగాసాలు చేయండి.. క్షణాల్లో గాఢ నిద్రలోకి
రాత్రి పడుకునే ముందు ఈ యోగాసాలు చేయండి.. క్షణాల్లో గాఢ నిద్రలోకి
మెయిడీన్ ఓవర్లలో మొనగాళ్లు.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?
మెయిడీన్ ఓవర్లలో మొనగాళ్లు.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు