AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cows: ఆవులు ప్లాస్టిక్ ను జీర్ణించుకోగలవు.. దాని కోసం వాటి కడుపులో ప్రత్యేక అమరిక..వెల్లడించిన శాస్త్రవేత్తలు

Cows: ఆవులు రోడ్లపై కనిపించే అన్నిటితో పాటు ప్లాస్టిక్ కూడా తింటూ ఉంటాయి. ఇప్పటివరకూ ప్లాస్టిక్ తినడం వల్ల ఆవుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని భావిస్తూ వచ్చారు.

Cows: ఆవులు ప్లాస్టిక్ ను జీర్ణించుకోగలవు.. దాని కోసం వాటి కడుపులో ప్రత్యేక అమరిక..వెల్లడించిన శాస్త్రవేత్తలు
Cows Eat Plastic
Balaraju Goud
|

Updated on: Jul 07, 2021 | 6:33 AM

Share

Cows: ఆవులు రోడ్లపై కనిపించే అన్నిటితో పాటు ప్లాస్టిక్ కూడా తింటూ ఉంటాయి. ఇప్పటివరకూ ప్లాస్టిక్ తినడం వల్ల ఆవుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని భావిస్తూ వచ్చారు. కానీ, ఆవులు ప్లాస్టిక్ తిన్నా ఏమీ కాదని తేలింది. అవును.. ఆవులు ప్లాస్టిక్ ను కూడా జీర్ణం చేసుకోగలవు. ప్లాస్టిక్ ను జీర్ణం చేసుకోగల బాక్టీరియా సమూహం ఆవు కడుపులో ఉన్నట్టు ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ బ్యాక్టీరియా కడుపుకు చేరే ప్లాస్టిక్‌ను విచ్ఛిన్నం చేసి జీర్ణమవుతుంది. ఈ పరిశోదనను ఆస్ట్రియన్ యూనివర్శిటీ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ అండ్ లైఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు చేశారు. ఆవుల రుమెన్ రెటిక్యులంలో బ్యాక్టీరియా సమూహం ఉందని, ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి కూడా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. రుమెన్ రెటిక్యులం ఆవు జీర్ణవ్యవస్థలో ఒక భాగం. మూడు రకాల ప్లాస్టిక్‌లను జీర్ణం చేయడంలో బ్యాక్టీరియా ప్రభావవంతంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ప్యాకేజింగ్, వస్త్ర పరిశ్రమలలో ఉపయోగించే పాలిథిలిన్ టెరెఫ్తాలేట్, ఇది సింథటిక్ పాలిమర్. ప్లాస్టిక్ సంచులను తయారు చేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్ పాలీబ్యూటిలీన్ అడిపేట్ టెరెఫ్తాలేట్ అదేవిధంగా పాలిథిలిన్ ఫ్యూరానోట్ అనే ప్లాస్టిక్. ఈ మూడిటిని ఆవులు జీర్ణించుకోగలవు.

ఈ బ్యాక్టీరియా అనేక ఎంజైమ్‌లను ఉపయోగిస్తుంది. శాస్త్రవేత్తలు కబేళా నుండి రుమెన్ యొక్క ద్రవాన్ని తీసుకొని మూడు రకాల ప్లాస్టిక్‌లపై ప్రయోగాలు చేశారు. ద్రవంలో ఉన్న బ్యాక్టీరియా దానిని ఎంతవరకు కరిగించగలదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం జరిగింది. ఈ బాక్టీరియం మూడు రకాల ప్లాస్టిక్‌లను విచ్ఛిన్నం చేయగలదని పరిశోధనలో తేలింది. ఆవు కడుపులో ఉండే బ్యాక్టీరియా అనేక ప్రత్యేక ఎంజైమ్‌లను ఉపయోగిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్లాస్టిక్‌ను విచ్ఛిన్నం చేయడంలో ఇది ప్రభావవంతంగా ఉండటానికి కారణం ఇదే.

శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను ప్రయోగశాలలో చిన్న స్థాయిలో చేశారు. ఈ బ్యాక్టీరియా ఎంత పర్యావరణ అనుకూలమైనదో తెలుసుకోవడానికి ఇప్పుడు పెద్ద ఎత్తున పరిశోధనలు జరుపడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Also Read: భూమిపైకి పెద్ద పెద్ద గ్రహశకలాలు ఎన్ని వచ్చాయో తెలుసా?శాస్త్రవేత్తల కొత్త అధ్యయనంలో వెల్లడి..:asteroids on Earth video.

Microsoft: విండోస్‌ యూజర్లకు మైక్రోసాఫ్ట్ హెచ్చరిక.. సెక్యూరిటీ ప్యాచ్‌ని అప్‌డేట్‌ చేసుకోవాలని సూచన