AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bumper Offer: వన్‌ప్లస్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపు.. పూర్తి వివరాలు ఇలా..

Bumper Offer: వన్‌ప్లస్ నార్డ్ సిఇ 5జి స్మార్ట్ ఫోన్‌ ఇవాళ భారతదేశంలో విడుదల కానుంది. ఇంతలోనే వన్‌ప్లస్ సంస్థ మరో గుడ్ న్యూస్ ప్రకటించింది.

Bumper Offer: వన్‌ప్లస్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపు.. పూర్తి వివరాలు ఇలా..
One Plus
Shiva Prajapati
|

Updated on: Jun 11, 2021 | 7:03 AM

Share

Bumper Offer: వన్‌ప్లస్ నార్డ్ సిఇ 5జి స్మార్ట్ ఫోన్‌ ఇవాళ భారతదేశంలో విడుదల కానుంది. ఇంతలోనే వన్‌ప్లస్ సంస్థ మరో గుడ్ న్యూస్ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 8 టి ధరను కంపెనీ భారీగా తగ్గించింది. ధర తగ్గింపు తరువాత, మీరు 8 జీబీ ర్యామ్/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను 38,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. అలాగే.. 12 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ .41,999 కు కొనుగోలు చేయవచ్చు. కొత్త ధరలతో వన్‌ప్లస్ 8 టి అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

వన్‌ప్లస్ 8 టి ఫీచర్స్.. ఈ స్మార్ట్‌ఫోన్ 1080×2400 పిక్సెళ్లతో 6.55 అంగుళాల పూర్తి హెచ్‌డి, అమోలెడ్‌ను కలిగిఉంది. 120 హెచ్‌జడ్ రిఫ్రెష్ రేటు కలిగి ఉంది. 12 GB వరకు ర్యామ్, 256 GB వరకు ఇంటర్నల్ స్టోరేజీకి అవకాశం ఉంది. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్.. స్నాప్‌డ్రాగన్ 865 ఎస్ఒసి చిప్‌సెట్‌తో రెండ్రెనో 650 జిపియు తో పనిచేస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్‌తో క్వాడ్ కెమెరా సెటప్ వస్తుంది. ఇది 16 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, మోనోక్రోమ్ సెన్సార్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీల కోసం, ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంఏహెచ్. జి65డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేస్తుంది. ఇక వన్‌ప్లస్ 8టి ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడిన ఈ ఫోన్‌లో వై-ఫై, బ్లూటూత్ 5.1, జిపిఎస్, గ్లోనాస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి పోర్ట్‌తో పాటు 5 జి, 4 జి వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Also read:

Health Benefits: రైస్ తినాలా? చపాతీ తినాలా?.. రాత్రి పడుకునేందు ఏ ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటారంటే..