Boat Smart Watches: కృత్రిమ మేధతో పనిచేసే మొట్టమొదటి స్మార్ట్ వాచ్‌లు ఇవే.. మతిపోగొడుతున్న ఫీచర్లు..

ప్రముఖ బ్రాండ్ బోట్(boAt) బడ్జెట్ ధరలో స్మార్ట్ వాచ్ మార్కెట్లో రిలీజ్ చేసింది. లూనార్ సిరీస్ లో రెండు వాచ్ లను ఆవిష్కరించింది. లూనార్ కాల్ ప్రో, లూనార్ కనెక్ట్ ప్రో పేరిట రెండు ప్రీమియం స్మార్ట్ వాచ్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.

Boat Smart Watches: కృత్రిమ మేధతో పనిచేసే మొట్టమొదటి స్మార్ట్ వాచ్‌లు ఇవే.. మతిపోగొడుతున్న ఫీచర్లు..
Boat Lunar Call Pro, Lunar Connect Pro
Follow us
Madhu

|

Updated on: Apr 01, 2023 | 6:30 PM

లేటెస్ట్ ట్రెండీ ఐటెం స్మార్ట్ వాచ్. ప్రతి ఒక్కరి మణికట్టుకు ఈ స్మార్ట్ వాచ్ కనిపిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ స్మార్ట్ వాచ్ లు ఇప్పుడు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. వినియోగదారులు కూడా మంచి బ్రాండ్ లో అత్యాధునిక ఫీచర్లు కలిగిన వాచ్ లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా అనువైన బడ్జెట్లో స్మార్ట్ వాచ్ లను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ బ్రాండ్ బోట్(boAt) బడ్జెట్ ధరలో స్మార్ట్ వాచ్ మార్కెట్లో రిలీజ్ చేసింది. లూనార్ సిరీస్ లో రెండు వాచ్ లను ఆవిష్కరించింది. లూనార్ కాల్ ప్రో, లూనార్ కనెక్ట్ ప్రో పేరిట రెండు ప్రీమియం స్మార్ట్ వాచ్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇవి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే సామర్థ్యం ఉంటుంది. వీటి ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

లుక్, డిజైన్.. ఈ స్మార్ట్‌వాచ్‌లు పెద్ద అమోల్డ్ డిస్‌ప్లేలు, బెస్ట్ ప్రాసెసర్లతో వచ్చాయి. మెటాలిక్ లింక్ స్ట్రాప్‌లతో ఇవి మరింత సౌకర్యవంతంగా ఉండనున్నాయి. రెండు స్మార్ట్‌వాచ్‌లు సర్కులర్ అల్యూమినియం డయల్‌తో వస్తాయి. ఇవి రెండూ 1.39-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేలతో యూజర్లకు గొప్ప వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తాయి. 600 నిట్స్‌ బ్రైట్‌నెస్, 60Hz రిఫ్రెష్ రేట్, ఆల్వేస్-ఆన్-డిస్‌ప్లే ఫంక్షనాలిటీ కూడా వీటిలో అందించారు. ఇవి యాంబియంట్ లైట్ సెన్సార్‌తో బ్రైట్‌నెస్‌ను అడ్జస్ట్ కూడా చేసుకుంటాయి.

కలర్ ఆప్షన్స్.. లూనార్ కనెక్ట్ ప్రో మెటాలిక్ బ్లాక్, యాక్టివ్ బ్లాక్, ఇంక్ బ్లూ, చెర్రీ బ్లోసమ్ రంగులలో రాగా.. లూనార్ కాల్ ప్రో మెటాలిక్ బ్లాక్, చార్‌కోల్ బ్లాక్, డీప్ బ్లూ, చెర్రీ బ్లోసమ్ రంగులలో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

పనితీరు.. లూనార్ కనెక్ట్ ప్రో, కాల్ ప్రో రెండూ అత్యంత వేగవంతమైన అపోల్లో ప్రాసెసర్ పై పనిచేస్తాయి. వీటిలో మెరుగైన బ్లూటూత్ కాలింగ్‌ కోసం హెచ్ డీ స్పీకర్, మైక్రోఫోన్ ఇచ్చారు. ఈ వాచ్‌లలో 20 ఫోన్ నంబర్లను సేవ్ చేసుకోవచ్చు. రెండు వాచ్‌లలో దేని ద్వారా అయినా నేరుగా కాల్స్ కూడా చేయవచ్చు.

సామర్థ్యం.. ఈ స్మార్ట్‌వాచ్‌లు బైకింగ్, డ్యాన్స్, వంటలను ట్రాక్ చేయడానికి 700కి పైగా యాక్టివ్ మోడ్‌లతో వస్తాయి. ఈ రెండింటిలో అందించిన 260ఎంఏహెచ్ బ్యాటరీ సింగిల్ చార్జ్‌పై 15 రోజుల వరకు పనిచేస్తుంది. ఇంకా ఈ వాచీలు ఏఎస్ఏపీ ఛార్జ్ టెక్, పవర్ సేవింగ్ మోడ్‌ ఆఫర్ చేస్తాయి.

హెల్త్ ఫీచర్లు.. ఈ స్మార్ట్ వాచ్ లలో హార్ట్ బీట్ సెన్సార్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్, స్లీప్ ట్రాకర్, స్ట్రెస్ ట్రాకర్, బ్రీత్ కంట్రోల్ మోడ్ వంటివి చాలానే ఉన్నాయి.

ధర ఎంతంటే.. బోట్ లూనార్ కనెక్ట్ ప్రో ధరను రూ.10,999, లూనార్ కాల్ ప్రో ధరను రూ.6,990గా కంపెనీ నిర్ణయించింది. అయితే, ప్రత్యేక లాంచ్ ఆఫర్‌గా, రెండింటినీ కంపెనీ వెబ్‌సైట్ ద్వారా రూ.3,499కే సొంతం చేసుకోవచ్చు. రెండు స్మార్ట్‌వాచ్‌లపై ఏడాది వారంటీ ఉంది.

కృత్రిమ మేధతో..

  • లూనార్ కాల్ ప్రో, లూనార్ కనెక్ట్ ప్రో స్మార్ట్ వాచ్ లు వాచ్ ఫేస్ స్టూడియో(Watch Face Studio), సెన్స్ ఏఐ(SensAi) టెక్నాలజీతో వచ్చిన మొదటి స్మార్ట్‌వాచ్‌లుగా నిలిచాయి.
  • స్టాన్స్ బీమ్ అనేది క్రికెట్ ఆటగాళ్లకు ఇన్‌సైట్స్‌, విశ్లేషణలను అందించడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగించే ఒక టెక్నాలజీ.
  • ఈ సెన్సార్ ఎంత వేగంగా బంతిని బౌల్‌ చేస్తున్నారు, బ్యాట్ ఎంత వేగంగా ఊపతున్నారు వంటి అంశాలను తెలియజేయడంతో పాటు మిస్సెస్, యాంగిల్స్‌, హిట్‌ల శక్తిని కొలవగలగుతుంది.
  • అలానే సెన్స్ ఏఐ టెక్నాలజీతో పనిచేసే స్టాన్స్ బీమ్ ఫీచర్‌తో ఆటగాళ్లు తమ ఆటను మెరుగుపరచుకోవడానికి టిప్స్ పొందవచ్చు.
  • వినియోగదారులు బోట్ క్రెస్ట్ యాప్‌లో వాచ్ ఫేస్ స్టూడియో ద్వారా వాచ్ ఫేస్‌లను తమకు నచ్చినట్లు మార్చుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..