Best AI tools: ఈ ఏఐ టూల్స్ గురించి తెలిస్తే ఇక రోజూ వాడతారు!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక లైఫ్ చాలా ఈజీ అయిపోయింది. హెల్త్ టిప్స్ నుంచి కెరీర్ గైడెన్స్ వరకూ అన్నింటికి ఏఐ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో బోలెడు ఏఐ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో మనకు డైలీ లైఫ్‌లో ఉపయోగపడే కొన్ని ఇంట్రెస్టింగ్ ఏఐ టూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఏఐతో డైలీ లైఫ్ ను చాలా స్మార్ట్ గా మార్చుకోవచ్చంటే మీరు నమ్ముతారా? నిజమే సరైన టూల్ ను సరైన విధంగా వాడుకోవడం తెలిస్తే రోజంతా స్మార్ట్ గా గడుస్తుంది. ఉదాహరణకు చాట్‌జీపీటీనే తీసుకుంటే ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే దీన్ని అడిగేయొచ్చు. ఏ విషయం గురించి సమగ్రమైన సమాచారం ఇవ్వడమే కాకుండా క్రియేటివ్‌గా ఆలోచించి కవిత్వాలు, కథలు, వ్యాసాల వంటివి కూడా ఇది రాసి ఇవ్వగలదు. కంప్యూటర్ కోడింగ్, ఇంగ్లిష్ రైటింగ్ వంటి వాటిలో కూడా సాయపడగలదు. అలాగే జాగ్రఫీ, సైన్స్, హెల్త్.. ఇలా అన్నిరకాల విషయాలను ఇందులో తెలుసుకోవచ్చు. అయితే ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టూల్స్ కూడా డైలీ లైఫ్ లో ఉపయోగపడతాయి. అవేంటంటే..
జిమిలర్
‘జిమిలర్(ximilar)’ అనే ఏఐ టూల్ సాయంతో ఎటువంటి ఇమేజ్ గురించైనా తెలుసుకోవచ్చు. ఫోటో అప్‌లోడ్ చేసి ఫోటోలో ఉన్న ప్రాంతం గురించిన వివరాలు, అందులో ఉన్న వస్తువుల గురించి, అది ఏ సోర్స్ నుంచి అప్‌లోడ్ అయింది వంటి వివరాలు తెలుసుకోవచ్చు.
రిక్లెయిమ్
‘రిక్లెయిమ్(Reclaim)’ అనే గూగుల్ క్రోమ్ ఏఐ ఎక్స్‌టెన్షన్ సాయంతో ఆఫీస్ వర్క్‌లో ఉండే మీటింగ్స్, షెడ్యూల్స్, బ్రేక్స్‌తో పాటు రోజువారీ పనులను కూడా మ్యానేజ్ చేసుకోవచ్చు. ఈ టూల్ సాయంతో మీ టైం టేబుల్‌ను చక్కగా నిర్వహించుకోవచ్చు.
జిమ్ బడ్డీ
ఇది మీ అవసరాలకు తగ్గట్టు వర్కవుట్ ప్లాన్స్‌ను డిజైన్ చేసే ఏఐ టూల్. ‘జిమ్ బడ్డీ(Gymbuddy)’ అనేది ఐఓఎస్, యాండ్రాయిడ్‌పై పనిచేసే యాప్. ఇందులో మీ ఆరోగ్య వివరాలు, డైలీ రొటీన్ వంటి వివరాలు అందిస్తే మీకు సూట్ అయ్యే వర్కవుట్స్, డైట్, ఇతర ఫిట్‌నెస్ సలహాలను రూపొందిస్తుంది.
మ్యూబెర్ట్
‘మ్యూబెర్ట్(Mubert)’ అనేది ఏఐ మ్యూజిక్ జనరేటర్ టూల్. దీంతో రకరకాల సౌండ్ ట్రాక్స్, మ్యూజిక్ బిట్స్‌ను క్రియేట్ చేయొచ్చు. ఎలాంటి మ్యూజిక్ కావాలో టెక్స్ట్ రూపంలో చెప్తే అటువంటి మ్యూజిక్ క్రియేట్ చేసి ఇస్తుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




