Bajaj Mall: వరల్డ్ కప్ ఆఫర్స్.. స్మార్ట్ ఫోన్లపై టాప్ డీల్స్.. మిస్ అయితే మళ్లీ రావు..
టీం ఇండియా ఇప్పటికే ఫైనల్లో అడుగుపెట్టింది. కప్ అందుకునేందుకు మరొక్క విజయానికి దూరంలో నిలిచింది. కాగా ఈ ప్రామఖ్యమైన సమయాన్ని బజాబ్ మాల్ వినియోగించుకునేందుకు ప్రణాళిక చేసింది. స్మార్ట్ ఫోన్లపై వరల్డ్ కప్ నేపథ్యంలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. పలు టాప్ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లను అందిస్తోంది.

ప్రపంచాన్ని క్రికెట్ ఫీవర్ ఆవహించింది. వరల్డ్ కప్-2023 మన దేశంలోనే జరుగుతోంది. ప్రస్తుతం నాకౌట్ పోటీలు జరుగుతున్నాయి. టీం ఇండియా ఇప్పటికే ఫైనల్లో అడుగుపెట్టింది. కప్ అందుకునేందుకు మరొక్క విజయానికి దూరంలో నిలిచింది. కాగా ఈ ప్రామఖ్యమైన సమయాన్ని బజాబ్ మాల్ వినియోగించుకునేందుకు ప్రణాళిక చేసింది. స్మార్ట్ ఫోన్లపై వరల్డ్ కప్ నేపథ్యంలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. పలు టాప్ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లను అందిస్తోంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐలు, అతి తక్కువ డౌన్ పేమెంట్, క్విక్ డెలివరీ, ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ లను అందిస్తోంది. స్మార్ట్ ఫోన్లు రూ. 10,000 నుంచి రూ. 50,000 వరకూ వివిధ ధరల్లో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
ఒప్పో రెనో 10 5జీ.. ఇది చాలా శక్తివంతమైన ఫోన్. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది. డిస్ ప్లే 6.7 అంగుళాలు ఉంటుంది. వెనుకవైపు 32ఎంపీ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఉంటుంది. దీనిని బజాజ్ మాల్లో ఆఫర్ పై రూ. 32,999 కే కొనుగోలు చేయొచ్చు. అది కూడా జీరో డౌన్ పేమెంట్ తో. క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్ కు ఇది చాలా బాగా సపోర్టు చేస్తుంది.
రియల్ మీ 11ఎక్స్ 5జీ.. మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ. దీనిలో 6.72 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. వెనుకవైపు 64ఎంపీ ప్రైమరీ కెమరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. దీనిని బజాజ్ మాల్లో ఆఫర్ పై రూ. 15,999కి దక్కించుకోవచ్చు. అది కూడా జీరో డౌన్ పేమెంట్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది.
వివో వై36 128జీబీ.. అద్భుతమైన డిస్ ప్లే ఇచ్చే ఫోన్లలో ఇదీ ఒకటి. దీనిలో 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 680 చిప్ సెట్ ఉంటుంది. బజాజ్ మాల్లో దీనిని రూ. 14,999 కొనుగోలు చేయొచ్చు. జీరో డౌన్ పేమెంట్ తో పాటు నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది.
రెడ్మీ నోట్ 12.. ఈ ఫోన్ గోల్డ్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 6.67 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50ఎంపీ, 8ఎంపీ, 2ఎంపీ సామర్థ్యాలతో ఉంటాయి. బ్యాటరీ 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 685 ప్రాసెసర్ ఉంటుంది. బజాజ్ మాల్లో దీనిని మీరు కేవలం రూ, 14,499కే ఆఫర్ పై దక్కించుకోవచ్చు. జీరో డౌన్ పేమెంట్ ఆరు నెలల సులభ వాయిదాలలో దక్కించుకోవచ్చు.
శామ్సంగ్ గెలాక్సీ ఏ54 5జీ.. దీనిని బజాజ్ మాల్లో మీరు కేవలం రూ. 36,564కే కొనుగోలు చేయొచ్చు. జీరో డౌన్ పేమెంట్ తో పాటు 12 నెలల ఈజీ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ 50ఎంపీ, 12ఎంపీ, 5ఎంపీ ఉంటుంది. 6.4 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. ఆక్టా కోర్ ప్రాసెసర్ ఆధారంగా పనిచచేస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..