ఆకాశంలో అద్భుతం.. జూన్ 24 న టెలిస్కోప్ లేకుండానే చూడొచ్చు.. అసలేం జరగనుందంటే?
మీకు అంతరిక్షం, ఖగోళ సంఘటనల పట్ల మక్కువ ఉందా. అయితే, జూన్ 24న మీకో గుడ్ న్యూస్ రానుంది. ఆ రోజున మీ దగ్గర బైనాక్యులర్స్ ఉన్నా లేకపోయినా.. మీరు ఆకాశంలో కనిపించే ఓ అద్భుతాన్ని నిశ్చితంగా చూడొచ్చు.
Astronomical Events 2022: మీకు అంతరిక్షం, ఖగోళ సంఘటనల పట్ల మక్కువ ఉందా. అయితే, జూన్ 24న మీకో గుడ్ న్యూస్ రానుంది. ఆ రోజున మీ దగ్గర బైనాక్యులర్స్ ఉన్నా లేకపోయినా.. మీరు ఆకాశంలో కనిపించే ఓ అద్భుతాన్ని నిశ్చితంగా చూసేయవచ్చు. ఒకే సరళ రేఖలో గ్రహాల రూపాన్ని అద్భుతంగా వీక్షించే ఛాన్స్ ఉంది. జూన్ 24న, భారత కాలమానం ప్రకారం ఉదయం సూర్యోదయానికి ముందు బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను సరళరేఖలో చూడొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఏప్రిల్ చివరి వారం నుంచి మే ప్రారంభం వరకు, టెలిస్కోప్ లేకుండా కూడా చూడొచ్చని తెలిపారు. 2020లో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఖగోళ శాస్త్రవేత్త జేక్ ఫోస్టర్ మాట్లాడుతూ.. గ్రహాలను గుర్తించడం చాలా సులభం. నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి. అయితే గ్రహాలు స్థిరమైన ప్రకాశాన్ని కలిగి ఉంటాయి. 4 గ్రహాలలో శుక్రుడు అత్యంత ప్రకాశవంతంగా ఉంటాడు. బృహస్పతి రెండవ ప్రకాశవంతమైనది.
శని సూర్యుని నుంచి చాలా దూరం ఉన్నందున మిగిలిన మూడింటి కంటే తక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. నారింజ రంగు కారణంగా, ఇతర గ్రహాలతో పోలిస్తే అంగారకుడిని సులభంగా గుర్తించవచ్చు. నాసా ప్రకారం, ఆకాశంలో రెండు ప్రకాశవంతమైన గ్రహాలు, వీనస్, బృహస్పతి కూడా ఈ నెలాఖరులో ఏప్రిల్ 30 న ఒకదానికొకటి చాలా దగ్గరగా వస్తాయి. ఇది ఈ నెల ప్రారంభంలో కనిపించిన కుజుడు, శని గ్రహాల కలయికను పోలి ఉంటుంది.
గ్రహాలు ఎప్పుడూ సరళ రేఖలో ఉండవని టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్, సైంటిస్ట్ డాక్టర్ క్రిస్టోఫర్ ఎస్. బైర్డ్ మాట్లాడుతూ.. మన సౌర వ్యవస్థలోని గ్రహాలు సాధారణంగా సినిమాల్లో చూపించే విధంగా ఎప్పుడూ సరళ రేఖలో ఉండవని అన్నారు. వాస్తవానికి, అన్ని గ్రహాలు సంపూర్ణంగా ఒకే కక్ష్యలో ఉండవు. అవి త్రిమితీయ అంతరిక్ష కక్ష్యలో కదులుతాయి. కాబట్టి అవి ఎప్పుడూ సరళ రేఖలో రాలేవు. జూన్ 24న, సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాలు మెర్క్యురీ, వీనస్, మార్స్, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ సరళ రేఖలో కనిపిస్తాయి. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలను టెలిస్కోప్ లేకుండా చూడవచ్చు. నెప్ట్యూన్, యురేనస్‌లను మాత్రం చూడలేం.
Also Read: Smartphone Overheating: వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్ వేడెక్కుతోందా..? ఈ చిట్కాలను వాడండి..!