Apple iPhone Risk: ఇంకా ఆ ఐఫోన్‌లను వాడుతున్నారా..? అయితే ప్రమాదంలో పడినట్లే..
Apple iPhone 6 Risk : ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఐఫోన్ యూజర్ల కోసం ఒక అడ్వైజరీని జారీ చేసింది. ఆపిల్ ఐఫోన్‌లను హ్యాకర్లు యాక్సెస్
Apple iPhone 6 Risk : ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఐఫోన్ యూజర్ల కోసం ఒక అడ్వైజరీని జారీ చేసింది. ఆపిల్ ఐఫోన్‌లను హ్యాకర్లు యాక్సెస్ చేసేందుకు అనుమతించే లోపాన్ని కలిగిన ఆపిల్ ఐఓఎస్ (iOS)లో ఉందని జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. Apple iOSలో ఉండే లోపాలను బేస్ చేసుకుని మోసాలు జరిగే అవకాశాలున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. యూజర్లను లక్ష్యంగా చేసుకుని సిస్టమ్‌లో అర్బిటరీ కోడ్‌ని అమలు చేసేందుకు అనుమతిస్తుందని CERT-ఇన్ అడ్వైజరీ పేర్కొంది. WebKit కాంపోనెంట్‌లో టైప్ కన్ఫ్యూజన్ లోపం కారణంగా Apple iOSలో భద్రతా లోపానికి దారితీసింది. తీవ్రమైన ఆర్థిక డేటా నష్టానికి దారితీసే హానికరమైన వెబ్‌సైట్‌ను విజిట్ చేసే యూజర్లను హ్యాకర్లు సులభంగా యాక్సస్ చేసే రిస్క్ ఉంది.
ఏ డివైజ్‌లపై ఎక్కువగా ప్రభావం..?
CERT-In అడ్వైజరీ ప్రకారం.. 12.5.7కి ముందు ఉన్న Apple iOS వెర్షన్లలో ఎక్కువ ప్రభావం ఉంది. ఇందులో ఆపిల్ iPhone 5s, iPhone 6, iPhone 6 Plus, iPad Air, iPad mini 2, iPad mini 3, iPod touch (6వ జనరేషన్) ఉన్నాయి.
ఐఫోన్ యూజర్లు ఏమి చేయాలంటే..?
ఆపిల్ iOS 15.1 కన్నా ముందు రిలీజ్ అయిన iOS వెర్షన్లపై పనిచేస్తుందని CERT-In తెలిపింది. అందువల్ల వినియోగదారులు తగిన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ చేసుకోవాలని సూచించారు. ఆపిల్ ఇప్పటికే iOS 12.5.7 కోసం సెక్యూరిటీ ప్యాచ్‌ను రిలీజ్ చేసింది. iOS 15.1 కన్నా ముందు రిలీజ్ అయిన iOS వెర్షన్‌లలో ఈ లోపం ఉందని నివేదిక తెలిపింది. జనవరి 23, 2023న రిలీజ్ చేసిన ప్యాచ్‌తో కంపెనీ యూజర్లకు హెచ్చరికలు పంపింది. ఇప్పటికే ఉన్న iPhone 5s, iPhone 6, iPhone 6 Plus, iPad Air, iPad mini 2, iPad mini 3, iPod touch (6వ జనరేషన్) యూజర్లు వెంటనే లేటెస్ట్ మోడల్‌లకు అప్‌గ్రేడ్ చేయడం మంచిది. లేదంటే.. కనీసం మీ పాత డివైజ్‌ల నుంచి సున్నితమైన, ప్రైవేట్ డేటాను డిలీట్ చేయడం ఎంతో ఉత్తమం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..