AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phone Tips: సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా..? ఫస్ట్ ఈ విషయాలు తెలుసుకోండి.. లేకపోతే తిప్పలు తప్పవు..

పలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, యాప్‌లలో సెకండ్ హ్యాండ్ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని కొనుగోలు చేసే ముందు.. అవి చోరీ చేసిన ఫోన్‌లా..? కాదా..? అని తెలుసుకోవడం ముఖ్యం. లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. పోలీస్ స్టేషన్ కూడా వెళ్లాల్సి రావచ్చు. వాటిని ఎలా చెక్ చేయాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Phone Tips: సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా..? ఫస్ట్ ఈ విషయాలు తెలుసుకోండి.. లేకపోతే తిప్పలు తప్పవు..
Second Hand Phones
Krishna S
|

Updated on: Jul 27, 2025 | 4:01 PM

Share

ఇటీవలి కాలంలో దేశంలో సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్‌ల మార్కెట్ వేగంగా పెరుగుతోంది. చాలా మంది తక్కువ ధరలకు ఖరీదైన సెకండ్ హ్యాండ్  ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఈ మొబైల్ ఫోన్‌లు అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, యాప్‌లలో అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని కొనుగోలు చేసే ముందు, ఇవి దొంగిలించబడిన ఫోన్‌లా.? కాదా..? అని కచ్చితంగా చెక్ చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందుల్లో పడతారు.

సాధారణంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మొదలైన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో యూజ్‌డ్ ఫోన్‌లు కొంటే పెద్దగా ప్రాబ్లమ్ ఉండదని అంటున్నారు. కానీ కొన్ని కంపెనీలు సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌లను తక్కువ ధరలకు విక్రయిస్తాయి. వాటికి ఎటువంటి ప్రామాణికత ఉండదు. తక్కువ రేట్ ఉండడంతో చాలా మంది వాటిని కొనుగోలు చేస్తారు. వాటిని కొనుగోలు చేసే ముందు చెక్ చేయడం ముఖ్యం. దీనికి సంబంధించి ప్రజలు ఈజీగా చెక్ చేసుకునేలా ప్రభుత్వం కొన్ని కీలక చర్యలు చేపట్టింది. ఎస్ఎంఎస్ ద్వారా మీరు ఫోన్ ను చెక్ చేసుకోవచ్చు.

ఎలా చెక్ చేయాలి..?

ముందు మీరు ఆ ఫోన్ ఐఎమ్ఈఐ నంబర్ తెలుసుకోవాలి. మీరు కొనుగోలు చేస్తున్న ఫోన్‌లో బాక్స్ లేకపోతే.. *#06# అని టైప్ చేసి ఐఎమ్ఈఐ నంబర్ తెలుసుకోవచ్చు. ఐఎమ్ఈఐ నంబర్ తెలిసిన తర్వాత మెసేజెస్ యాప్‌కి వెళ్లాలి. KYM అని టైప్ చేసి 15-అంకెల ఐఎమ్ఈఐ నంబర్‌ను ఎంటర్ చేసి 14422కి పంపాలి.

బ్లాక్‌లిస్ట్ అని వస్తే..

ఈ మెసేజ్ సెండ్ అయిన తర్వాత మీకు ప్రభుత్వం నుండి డీటెయిల్స్ వస్తాయి. అది ఫోన్ దొంగిలించబడిందా లేదా సమాచారం వస్తుంది. రిప్లై బ్లాక్‌లిస్ట్ అని వస్తే.. ఆ ఫోన్ దొంగిలించబడిందని, దాన్ని ఐఎమ్ఈఐ నంబర్ బ్లాక్‌లిస్ట్ చేశారని అర్థం. అలా వస్తే ఆ ఫోన్‌ను కొనుగోలు చేయకపోవడమే బెటర్. మీరు చోరీ చేసిన ఫోన్ కొంటే ఏదో ఒక రోజు పోలీస్ స్టేషన్ వెళ్లాల్సి వస్తది. కాబట్టి చెక్ చేశాకే కొనుక్కోండి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్