AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Itel Smartwatch: ఐటెల్ నుంచి మరోకొత్త స్మార్ట్ వాచ్ విడుదల.. ఏకంగా 12 రోజుల బ్యాటరీ లైఫ్..

ఐటెల్ స్మార్ట్ వాచ్ 2ఈఎస్ పేరుతో రిలీజ్ చేసిన ఈ వాచ్ యువతను కచ్చితంగా ఆకర్షిస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా గతేడాది రిలీజ్ చేసి ఐటెల్ స్మార్ట్ వాచ్ 1 జీఎస్‌కు కొనసాగింపుగా ఈ వాచ్‌ను కంపెనీ రిలీజ్ చేసింది.

Itel Smartwatch: ఐటెల్ నుంచి మరోకొత్త స్మార్ట్ వాచ్ విడుదల.. ఏకంగా 12 రోజుల బ్యాటరీ లైఫ్..
Itel Smartwatch
Nikhil
|

Updated on: Apr 22, 2023 | 6:00 PM

Share

యువత ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా స్మార్ట్ యాక్ససరీస్‌ను వాడుతున్నారు. ఈ స్మార్ట్ యాక్ససరీస్‌లో ఎక్కువగా స్మార్ట్ వాచ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సంప్రదాయ వాచ్‌లకు భిన్నంగా ఉండడంతో పాటు స్మార్ట్‌ఫోన్లకు అనుసంధానం చేసి వాడుకునే అవకాశం ఉండడంతో యువత వీటి వాడకానికి మక్కువ చూపుతున్నారు. కంపెనీలు ఎక్కువగా యువత ఆలోచనలకు అనుగుణంగా కొత్త కొత్త మోడల్స్‌లో స్మార్ట్ వాచ్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ప్రముఖ సంస్థ ఐటెల్ ఇటీవల ఓ స్మార్ట్ వాచ్‌ను అందుబాటులోకి తీసుకవచ్చింది. ఐటెల్ స్మార్ట్ వాచ్ 2ఈఎస్ పేరుతో రిలీజ్ చేసిన ఈ వాచ్ యువతను కచ్చితంగా ఆకర్షిస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా గతేడాది రిలీజ్ చేసి ఐటెల్ స్మార్ట్ వాచ్ 1 జీఎస్‌కు కొనసాగింపుగా ఈ వాచ్‌ను కంపెనీ రిలీజ్ చేసింది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో వచ్చిన ఈ ఐటెల్ స్మార్ట్‌వాచ్ 2ఈఎస్ అధిక నాణ్యతతో రూపొందించారు.  అలాగే అధునాతన ఫీచర్లతో లోడ్ చేసిన ఈ వాచ్ ఓ సారి చార్జ్ చేస్తే గరిష్టంగా 12 రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. వినియోగదారులు ఎక్కువకాలం నిరంతరాయంగా ఈ వాచ్‌ను ఉపయోగించుకోవచ్చు.

1.8 అంగుళాల ఐపీఎస్ హెచ్‌డీ డిస్‌ప్లే వల్ల స్పష్టమైన, శక్తివంతమైన విజువల్స్‌ను అందిస్తాయి. నావిగేషన్, ఫీచర్ యాక్సెస్‌ను మరింత సులభతరం చేస్తుంది. బ్లూటూత్ వీ 5.3 సాంకేతికతతో వినియోగదారులు వాచ్‌లోని అంతర్నిర్మిత మైక్రోఫోన్, స్పీకర్‌ని ఉపయోగించి కాల్స్ చేయవచ్చు. ఈ ఐటెల్ స్మార్ట్‌వాచ్ 2 ఈఎస్ ఏఐ వాయిస్ అసిస్టెంట్‌తో వస్తుంది. ఇది వినియోగదారులకు వాయిస్ ఆదేశాలను అనుసరించి కాల్‌లు చేయడానికి, సందేశాలు పంపడానికి, ఇతర స్మార్ట్ పరికరాలను నియంత్రించడానికి అనుమతిస్తుంది. ఇది హృదయ స్పందన రేటు, రక్త ఆక్సిజన్ మానిటర్‌ను కలిగి ఉంటుంది. అలాగే వ్యాయామ ట్రాకింగ్ కోసం 50 స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది. సంగీతం, కెమెరా నియంత్రణ, స్మార్ట్ నోటిఫికేషన్‌లు వినియోగదారులను కనెక్ట్ చేసి ఉంచుతాయి. స్మార్ట్‌వాచ్ 90 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 500నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది.  ఈ వాచ్ దీర్ఘకాలిక బ్యాటరీని కలిగి ఉంటుంది. అలాగే మాగ్నెటిక్ ఛార్జర్, అదనపు ఉచిత స్ట్రిప్‌తో కలిపి వస్తుంది. ఐటెల్ స్మార్ట్ వాచ్ 2ఈఎస్ రియల్ టైమ్ హెల్త్ మానిటరింగ్, ఇంటెలిజెన్స్ వాయిస్ అసిస్టెంట్ మాడ్యూల్‌తో వినియోగదారు ఆరోగ్యానికి మరింత ప్రాధాన్యతనిస్తుంది. ఈ వాచ్ ఐపీ 68 నీటి నిరోధకతతో ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఈ వాచ్ ధరను రూ.1699గా కంపెనీ నిర్ణయించింది. కంపెనీ వెబ్‌సైట్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ వాచ్‌ కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..