Amazon Offer: ఈ వన్ ప్లస్ ఫోన్‌పై ఏకంగా రూ. 7వేల తగ్గింపు.. త్వరపడండి..

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఫోన్ల పై భారీ తగ్గింపు ధరలు ప్రకటించింది. అత్యధిక ధర కలిగిన ప్రముఖ బ్రాండ్ల ఫోన్లను అత్యంత తగ్గింపు ధరలకే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. మెరుగైన పనితీరు, ఆకట్టుకునే లుక్, ప్రత్యేక ఫీచర్లు గల ఈ ఫోన్ల ను సామాన్యులు కూడా కొనుగోలు చేసే అవకాశం లభించింది. ముఖ్యంగా ఫోన్ ప్రియులు ఈ ఆఫర్ ను ఉపయోగించుకుని బెస్ట్ ఫోన్లను సొంత చేసుకోవచ్చు.

Amazon Offer: ఈ వన్ ప్లస్ ఫోన్‌పై ఏకంగా రూ. 7వేల తగ్గింపు.. త్వరపడండి..
Oneplus 12
Follow us

|

Updated on: Jul 16, 2024 | 5:24 PM

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఫోన్ల పై భారీ తగ్గింపు ధరలు ప్రకటించింది. అత్యధిక ధర కలిగిన ప్రముఖ బ్రాండ్ల ఫోన్లను అత్యంత తగ్గింపు ధరలకే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. మెరుగైన పనితీరు, ఆకట్టుకునే లుక్, ప్రత్యేక ఫీచర్లు గల ఈ ఫోన్ల ను సామాన్యులు కూడా కొనుగోలు చేసే అవకాశం లభించింది. ముఖ్యంగా ఫోన్ ప్రియులు ఈ ఆఫర్ ను ఉపయోగించుకుని బెస్ట్ ఫోన్లను సొంత చేసుకోవచ్చు.

రూ.7 వేల డిస్కౌంట్..

ప్రస్తుతం అమెజాన్ లో వన్ ప్లస్ 12 ఫోన్ పై రూ.12 వేల తగ్గింపు ప్రకటించారు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు పై ఈ తగ్గింపు లభిస్తుంది. దీంతో వన్ ప్లస్ 12 ను రూ. 57,999కు సొంత చేసుకోవచ్చు. కానీ ఈ ఆఫర్ ఎప్పడు వరకూ కొనసాగుతుందో తెలియదు. కాబట్టి ముందుగానే కొనుగోలు చేయడం చాలా అవసరం.

ఐసీఐసీఐ కార్డుదారులకు..

వన్ ప్లస్ 12 ఫోన్ అసలు ధర 64,999. దీనిపై అమెజాన్ లో భారీ తగ్గింపు ధర ప్రకటించారు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్న ఈ ఆఫర్ వర్తిస్తుంది. రూ.7 వేల తగ్గింపు ధరలో రూ. 57,999కు కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు అమెజాన్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా ఉంది. దాని ద్వారా కూడా వన్ ప్లస్ 12 ఫోన్ ను అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.26 వేలు వరకూ తగ్గింపు లభిస్తుంది. అయితే పాత ఫోన్ పరిస్థితిపై ఇది ఆధారపడి ఉంటుంది.

ప్రత్యేక ఫీచర్లు..

  • వన్ ప్లస్ 12 ఫోన్ లో 6.82 అంగుళాల డిస్‌ప్లే ఉంది. స్క్రీన్‌పై ఉన్న కంటెంట్ ఆధారంగా ఇది సర్దుబాటు చేయబడుతుంది. అలాగే కంటెంట్ ను చాలా స్పష్టంగా చూడవచ్చు.
  • వివిధ రంగులలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. వన్ ప్లస్ 11 ఫోన్ డిజైన్ దీనిలోనూ కంపెనీ కొనసాగింది.
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ సెట్ తో పనిచేస్తుంది. దీనిలో కొత్తగా డ్యూయల్ క్రయో-వేగం కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. మెరుగైన గేమింగ్ అనుభవం కోసం ఇది ఉపయోగపడుతుంది.
  • ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 14.0 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది.
  • ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ కెమెరా సిస్టమ్ అమర్చారు. దీనిలో 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్, 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో 64 మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. వీటికి అదనంగా 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఏర్పాటు చేశారు. కెమెరా సెటప్ అంతా వన్ ఫ్లస్ ఓపెన్ స్మార్ట్‌ఫోన్‌లాగే ఉంటుంది.

మంచి ఆదరణ..

చైనా కు చెందిన స్మార్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ నుంచి విడుదలయ్యే ఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ విడుదల చేసిన అన్ని ఫోన్లకు ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ పరిస్థితులు, కొనుగోలు దారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫోన్లను ఎప్పడికప్పుడు ఉత్పత్తి చేస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..