- Telugu News Photo Gallery Business photos What Will Happen If You Leave Your Smartphone Charger At Charging Point
Smartphone Charger: ఫోన్‌ను ఛార్జ్ చేసిన తర్వాత ఛార్జర్‌ను విద్యుత్ బోర్డుకే ఉంచుతున్నారా? నష్టమే!
స్మార్ట్‌ఫోన్‌లు లేని జీవితం దాదాపు స్తంభించిపోయినట్లే ఉంటుంది. కేవలం కాల్స్, మెసేజింగ్ మాత్రమే కాదు, ఇంకా ఎన్నో పనులు స్మార్ట్ ఫోన్ల ద్వారా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ సాధారణంగా ఇంటికి వెళ్లి రోజు చివరిలో ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ఇష్టపడతారు. చాలా మంది పని వద్ద కూడా ఫోన్ ఛార్జర్‌ని తమ వద్ద ఉంచుకుని అవసరమైనప్పుడు ఛార్జ్ చేస్తారు. ఛార్జింగ్ తర్వాత ఛార్జర్‌ను కరెంట్ బోర్డుకు..
Updated on: Jul 16, 2024 | 4:00 PM

స్మార్ట్‌ఫోన్‌లు లేని జీవితం దాదాపు స్తంభించిపోయినట్లే ఉంటుంది. కేవలం కాల్స్, మెసేజింగ్ మాత్రమే కాదు, ఇంకా ఎన్నో పనులు స్మార్ట్ ఫోన్ల ద్వారా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ సాధారణంగా ఇంటికి వెళ్లి రోజు చివరిలో ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ఇష్టపడతారు. చాలా మంది పని వద్ద కూడా ఫోన్ ఛార్జర్‌ని తమ వద్ద ఉంచుకుని అవసరమైనప్పుడు ఛార్జ్ చేస్తారు. ఛార్జింగ్ తర్వాత ఛార్జర్‌ను కరెంట్ బోర్డుకు అలాగే వదిలేయడం చాలాసార్లు కనిపిస్తుంది. చాలా మంది ఇప్పటికీ ఛార్జర్‌ని స్విచ్ బోర్డ్‌కు జోడించి వదిలేస్తారు. కొందరు స్విచ్ ఆఫ్ చేయడం కూడా మర్చిపోతుంటారు.

ఛార్జర్‌ని ఇలా వదిలేయడం వల్ల చాలా నష్టం వాటిల్లుతుంది. ఛార్జర్ ప్లగిన్ చేయబడితే, అది నిరంతర విద్యుత్ కనెక్షన్‌ను సరఫరా అయి ఉంటుంది. ఇది ఎక్కువ సమయం ఇలాగే ఉంచినట్లయితే కరెంటు సరఫరా ఉండటం వల్ల పేలవచ్చు.. లేదా ఎక్కువ కాలం సర్వీస్ ఇవ్వలేకపోవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా ఇది చిన్న విషయంగా అనిపించినప్పటికీ, ఇది చాలా నష్టాన్ని కలిగిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఛార్జర్ ఎక్కువసేపు ఉంచినట్లయితే అడాప్టర్ వేడిగా మారవచ్చు. ఈ పరిస్థితుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫలితంగా, ఛార్జర్ దెబ్బతినవచ్చు. అంతే కాదు, ఛార్జర్‌ని అమర్చినప్పుడు నీరు చేరితే అది షాక్‌కు గురి చేస్తుంది.

అందుకే ఛార్జింగ్ తర్వాత ఛార్జర్‌ని విద్యుత్ బోర్డు నుంచి తీసివేయడం ఉత్తమం. ఆ ఛార్జర్‌ని పొడి ప్రదేశంలో ఉంచాలి. అలాగే, చెడిపోయిన ఛార్జర్లు, నాణ్యత లేని ఛార్జర్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దు.

దీని వల్ల మొబైల్ కూడా త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. కేవలం ఛార్జర్లే కాదు, ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువును ఉపయోగించిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయాలి. రన్నింగ్ ఏసీ గురించి కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.




