iQOO Z7s 5G: రూ. 25వేల స్మార్ట్‌ఫోన్ రూ. 15వేలకే.. ఇలాంటి ఆఫర్ మళ్లీ ఎప్పుడు రాదు..
ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు కలర్స్‌తో పాటు రెండు వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా 32 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో రూ. 16,999కే సొంతం చేసుకోవచ్చు. అదనంగా ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్ అందిస్తున్నారు...
స్మార్ట్ ఫోన్ కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో ఫోన్‌ల ధరలను తగ్గిస్తున్నారు. రకరకాల ఆఫర్లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐక్యూ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఐక్యూజెడ్ 7ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్‌పై కంపెనీ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో ఈ ఫోన్‌పై డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ఎంత డిస్కౌంట్ లభించనుంది ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు కలర్స్‌తో పాటు రెండు వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా 32 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో రూ. 16,999కే సొంతం చేసుకోవచ్చు. అదనంగా ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్ అందిస్తున్నారు. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఒక వేళ వన్‌కార్ట్ క్రెడిట్ కార్డ్‌తో విక్రయిస్తే గరిష్టంగా రూ. 2,750 డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను కేవలం రూ.14,249కే పొందవచ్చు. వీటితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఐక్యూ జెడ్7ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌ను అందించారు. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం ఉపయోగపడుతుంది. ఇక స్క్రీన్ విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. సూపర్ స్మూత్ డిస్‌ప్లే ఈ ఫోన్ సొంతం. మంచి నాణ్యతతో కూడిన వీడియోలను వీక్షించవచ్చు. ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ఔరా లైట్ OIS ఈ కెమెరా సొంతం. ఇక ఛార్జింగ్ విషయానికొస్తే ఇందులో 66 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4600 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..