AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google AI Edge: గూగుల్ నుంచి దిమ్మ తిరిగే యాప్.. నెట్ లేకుండానే ఏఐ వాడొచ్చు!

గూగుల్.. ఓ కొత్త ఏఐ యాప్ ను లాంఛ్ చేసింది. ఇంటర్నెట్ లేకుండానే ఏఐ ఇమేజ్ టూల్స్ వాడుకునేలా కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది. అదే గూగుల్ ఏఐ ఎడ్జ్ గ్యాలరీ. ఇదెలా పని చేస్తుంది. మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Google AI Edge: గూగుల్ నుంచి దిమ్మ తిరిగే యాప్..  నెట్ లేకుండానే ఏఐ వాడొచ్చు!
Google Ai Edge (2)
Nikhil
|

Updated on: Sep 28, 2025 | 1:09 PM

Share

ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. బనానా ఎఐ, గిబ్లీ.. ఇలా ఏఐ టూల్స్ తో రకరకాల ఇమేజ్ ట్రెండ్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ ఓ కొత్త ఏఐ టూల్ ను తీసుకొచ్చింది. ఈ టూల్ తో.. ఇంటర్నెట్ లేకుండానే ఏఐ  ఇమేజ్ లు క్రియేట్ చేసుకోవచ్చు.

ఇంటర్నెట్ లేకుండా..

సాధారణంగా ఏఐ టూల్స్ వాడాలంటే ఇంటర్నెట్ తప్పనిసరి. అయితే గూగుల్ తెచ్చిన గూగుల్ ఏఐ ఎడ్జ్ గ్యాలరీ అనే యాప్ ఇంటర్నెట్ లేకుండానే పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా రకరకాల ఏఐ ఇమేజ్ ఎఫెక్ట్స్ ను ఆఫ్ లైన్ లోనే క్రియేట్ చేసుకోవచ్చు.  ఇంటర్నెట్ లేకుండానే  ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ తో ఇమేజ్‌లను సృష్టించడం, ఇమేజ్ కోడ్స్ లేదా ప్రాంప్ట్స్ వంటివి క్రియేట్ చేయొచ్చు.

ప్రైవసీ ఇబ్బంది లేదు

ఈ ఏఐ టూల్ లో  ఉన్న మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ టూల్ వాడడం ద్వారా యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొబైల్ యూజర్లు అప్ లోడ్ చేసే ఫొటోలు, ఇతర డేటా అంతా.. క్లౌ్డ్ లో కాకుండా.. మొబైల్ స్టోరేజ్ లోనే సేవ్ అవుతుంది. కాబట్టి ఇతర ఏఐ టూల్స్ తో ఉండే ప్రైవసీ ఇబ్బందులు ఇందులో ఉండవు. గూగుల్ ఏఐ ఎడ్జ్ గ్యాలరీ.. మొబైల్‌బ్యాక్ఎండ్‌లో రన్ అవుతుంది. తద్వారా సెక్యూరిటీ రిస్క్‌ కూడా తగ్గుతుంది. ఇది ఆఫ్ లైన్ యాప్ కాబట్టి దీని రెస్పాన్స్ కూడా వేగంగా ఉంటుంది.  సర్వర్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా యూజర్లు అడిగిన ఇమేజ్ లను వెంటనే క్రియేట్ చేసి ఇస్తుంది.

క్షణాల్లోనే..

గూగుల్ ఏఐ ఎడ్డ్ గ్యాలరీ యాప్‌.. గెమ్మా 31బీ అనే లాంగ్వేజ్ మోడల్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఇది అపాచీ 2.0 లైసెన్స్‌తో వస్తోంది. దీన్ని ఎడ్యుకేషన్, కమర్షియల్ అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఏఐ టూల్.. సెకనుకు 2,585 టోకెన్లను ప్రాసెస్ చేయగలదు. అంటే ప్రశ్న అడిగిన క్షణాల్లో రిప్లై ఇస్తుంది. పెద్ద పెద్ద టెక్స్ట్ ను కూడా జనరేట్ చేయగలదు.  ప్రస్తతానికి గూగుల్ ఏఐ ఎడ్జ్ గ్యాలరీ యాప్‌ ఓపెన్ సోర్స్‌లో అందుబాటులో ఉంది. ఐఓఎస్ వెర్షన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు.

మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..