AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Passwords: అలర్ట్.. సోషల్‌ మీడియా అకౌంట్లకు ఇలాంటి పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటే వెంటనే మార్చుకోండి

Passwords: చాలా మంది సోషల్‌ మీడియాకు సంబంధించి అకౌంట్‌కు పాస్‌వర్డ్‌లు సులభమైనవిగా పెట్టుకుంటారు. అలాంటి పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటే ప్రమాదం పొంచివుండే..

Passwords: అలర్ట్.. సోషల్‌ మీడియా అకౌంట్లకు ఇలాంటి పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటే వెంటనే మార్చుకోండి
Password
Subhash Goud
|

Updated on: Jun 21, 2021 | 8:39 AM

Share

Passwords: చాలా మంది సోషల్‌ మీడియాకు సంబంధించి అకౌంట్‌కు పాస్‌వర్డ్‌లు సులభమైనవిగా పెట్టుకుంటారు. అలాంటి పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటే ప్రమాదం పొంచివుండే అవకాశం ఉందని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సులభంగా గుర్తు పెట్టుకునే పాస్‌వర్డ్‌ల వల్ల సైబర్‌ నేరాలు ఎన్నో జరిగాయని చెబుతున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించి సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ప్రజలు ఎక్కువగా ఉపయోగించే ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ తదితర అకౌంట్‌లపై కన్నేసి ఉంచుతున్నారు. ఈ సులభంగా గుర్తించుకునే పాస్‌వర్డ్‌లు పెట్టుకోవడం ద్వారా వ్యక్తిగత వివరాలు సేకరించి బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులను దోచేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అప్రమత్తం చేస్తున్నారు. గత ఏడాదిలో అనేక మంది ఉపయోగించిన టాప్‌టెన్‌ పాస్‌వర్డ్‌లను నిపుణులు తెలిపారు. ఇందులో ఎక్కువగా ఉపయోగిస్తున్న పాస్‌వర్డ్‌లు ఏమిటనేదానిపై నిపుణులు గుర్తించారు.

ఎక్కువగా ఉపయోగించే పాస్‌వర్డులు ఇవే..

123456, password1, qwerty, password, 111111, abc123, 12345,1234567, 12345678, 2222, 112233 ఇలాంటి సులభంగా గుర్తుండే పాస్‌వర్డ్‌లను ఎంపిక చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి సులభంగా గుర్తించుకునే పాస్‌వర్డ్‌లను పెట్టుకుంటే సైబర్‌ నేరగాళ్ల నుంచి ప్రమాదం ఉందని, వీటి వల్ల మీరు సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పాస్‌వర్డ్‌ల వల్ల సైబర్‌ నేరగాళ్లు గుర్తించి మీ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇతర అకౌంట్లను హ్యాక్‌ చేసే అవకాశం ఉందని, దీని వల్ల మీ వ్యక్తిగత వివరాలు పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఇలా తెలుసుకోవడం వల్ల మీ బ్యాంక్‌ అంకౌట్‌ వివరాలు కూడా తెలుసుకుంటారని, తర్వాత మీ ఖాతాలో ఉండే మొత్తం కాజేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సులభంగా గుర్తించుకునే పాస్‌వర్డ్‌లను పెట్టుకోవడం ప్రమాదమేనని చెబుతున్నారు.

Petrol Diesel Prices Today: వాహనదారులకు షాకిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తాజా ధరల వివరాలు

Reliance Jio Recharge Plan: జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. 56 రోజుల వ్యాలిడిటీతో అందించే ప్లాన్స్‌ ఇవే..!