iPhone యూజర్లకు క్రేజీ న్యూస్.. ఇక పిచ్చెక్కిపోయే ఎడిటింగ్‌తో అదరగొట్టేయండి!
అడోబ్ తన ప్రఖ్యాత ప్రీమియర్ సాఫ్ట్‌వేర్‌ను ఐఫోన్ కోసం విడుదల చేసింది. ఈ కొత్త మొబైల్ యాప్ కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబర్‌లు, రీల్స్ చేసేవారికి కంప్యూటర్ అవసరం లేకుండానే ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ చేసే అవకాశాన్ని అందిస్తుంది. 4K HDR, AI ఆధారిత ఎడిటింగ్, అపరిమిత మల్టీ-ట్రాక్ టైమ్‌లైన్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

అడోబ్ తన ప్రఖ్యాత వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ మొబైల్ ఫస్ట్ వెర్షన్ అయిన ప్రీమియర్ ఆన్ ఐఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ యాప్ ఇప్పుడు ఆపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. కంప్యూటర్ అవసరం లేకుండా కంటెంట్ క్రియేటర్లు ప్రొఫెషనల్ ఎడిటింగ్‌ను చేయొచ్చు. ఈ యాప్ యూట్యూబర్లు, రిల్స్ చేసే వారితో పాటు షార్ట్ ఫిల్మ్ మేకర్స్, వ్లాగర్లు, పాడ్‌కాస్ట్ వీడియోలు చేసే వారికి అద్భుతంగా ఉపయోగపడనుంది. వారు తమ ఐఫోన్‌లలో నేరుగా పాలిష్ చేసిన కంటెంట్‌ను క్రియేట్ చేయొచ్చు.
ధర, లభ్యత
ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించవచ్చు. మరిన్ని జనరేటివ్ క్రెడిట్‌లు, ఎక్స్‌ట్రా స్టోరేజ్ కోసం అప్‌గ్రేడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ వినియోగదారులు ఈరోజు నుండి దీన్ని యాక్సెస్ చేయగలిగినప్పటికీ, ఆండ్రాయిడ్ వెర్షన్ ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది.
ఫీచర్లు..
- 4K HDR ఎడిటింగ్‌తో అపరిమిత మల్టీ-ట్రాక్ టైమ్‌లైన్
- ఫ్రేమ్-కచ్చితమైన కట్స్, అధునాతన ట్రిమ్మింగ్
- యానిమేటెడ్ టైటిల్స్, ఎఫెక్ట్స్
టిక్‌టాక్, యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మరిన్నింటి కోసం ఆటోమేటిక్ ప్లాట్‌ఫామ్ సైజు మార్పు సృష్టికర్తలు ఫాంట్‌లు, స్టిక్కర్లు, ఫొటోలు, రాయల్టీ రహిత సంగీతం వంటి మిలియన్ల కొద్దీ ఫ్రీ ప్రాప్టరీలు అందుబాటులో ఉన్నాయి. తెలివైన వర్క్‌ఫ్లోల కోసం AI- ఆధారిత ఎడిటింగ్ కూడా ఉంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
