Amazon Sale: అమెజాన్‌లో నయా సేల్ స్టార్ట్.. 5 జీ ఫోన్లపై అదిరిపోయే తగ్గింపులు
తాజాగా అమెజాన్‌లో సాగుతున్న ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్‌కు కొనసాగింపుగా టాప్ బ్రాండ్‌లకు చెందిన 5జీ రివల్యూషన్ సేల్‌ను ప్రవేశపెట్టింది . జూన్ 25, 2023 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ముఖ్యంగా అన్ని కంపెనీల 5 జీ మోడల్ ఫోన్లపై ఈ సేల్‌లో తగ్గింపులు లభిస్తాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెరుగుతున్న ఆన్‌లైన్ సేల్స్‌కు అనుగుణంగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు కూడా ఎప్పటికప్పుడు నూతన సేల్స్ ద్వారా వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఆయా సేల్స్‌లో వినియోగదారులకు తక్కువ ధరకే వారికి కావాల్సిన వస్తువులను అందిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని పొందుతున్నాయి. తాజాగా అమెజాన్‌లో సాగుతున్న ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్‌కు కొనసాగింపుగా టాప్ బ్రాండ్‌లకు చెందిన 5జీ రివల్యూషన్ సేల్‌ను ప్రవేశపెట్టింది . జూన్ 25, 2023 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ముఖ్యంగా అన్ని కంపెనీల 5 జీ మోడల్ ఫోన్లపై ఈ సేల్‌లో తగ్గింపులు లభిస్తాయి.
సామ్‌సంగ్ ఫోన్లపై తగ్గింపులు ఇవే
- సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ ఫోన్ ఈ సేల్లో రూ.1,06,999కు అందుబాటులో ఉంది. 18 నెలల నో కాస్ట్ ఈ ఎంఐతో పాటు రూ.10,000 ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది.
- సామ్సంగ్ గెలాక్సీ ఏ 54 5 జీ ఫోన్ రూ.33,499కు అందుబాటులో ఉంది. అలాగే 24 నెలల నో కాస్ట్ ఈఎంఐ కూడా పొందవచ్చు.
- సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 5 జీ ఫోన్ రూ.76,999కు అందుబాటులో ఉంది. అలాగే 9 నెలల నోకాస్ట్ ఈఎంఐతో వస్తుంది.
ఐక్యూ ఫోన్లపై తగ్గింపు ఇలా
- ఐక్యూ నియో 6 ఫోన్ రూ.22,999కు అందుబాటులో ఉంది.
- ఐక్యూ జెడ్ 7 ఎస్ ఫోన్ రూ.17,499కు అందుబాటులో ఉండడంతో పాటు మూడు నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐతో వస్తుంది.
- ఐక్యూ నియో 7 5జీ ఫోన్ బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.26,999కు వస్తుంది. అలాగే 6 నెలల నో కాస్ట్ ఈఎంఐతో వస్తుంది.
- ఐక్యూ 11 5 జీ ఫోన్ రూ.49,999కు అందుబాటులో ఉంటుంది. అలాగే 9 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌తో వస్తుంది.
వన్ ప్లస్ ఫోన్లపై భారీ తగ్గింపులు
- వన్ ప్లస్ 11 5 జీ ఫోన్ రూ.59,999కు అందుబాటులో ఉండడంతో పాటు 12 నెలల నో కాస్ట్ ఈఎంఐతో వస్తుంది.
- వన్ ప్లస్ 11 ఆర్ ఫోన్ రూ.38,999కు అందుబాటులో ఉంది. అలాగే ఈ ఫోన్ కూడా 12 నెలల నో కాస్ట్ ఈఎంఐతో వస్తుంది.
- వన్ ప్లస్ 10 టీ 5 జీ ఫోన్ రూ.49,999 అందుబాటులో ఉండడంతో పాటు 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌తో వస్తుంది.
ఎంఐ 5 జీ స్మార్ట్ ఫోన్లు
- ఎంఐ 12 ప్రో ఫోన్ రూ.44,999కు అందుబాటులో ఉండగా 9 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ చేస్తుంది.
- రెడ్‌మీ నోట్ 12 5 జీ ఫోన్ రూ.14,999 ధరకు బ్యాంకు ఆఫర్లతో అందుబాటులో ఉంది. అలాగే ఆరు నెలల నో కాస్ట్ ఈఎంఐతో వస్తుంది.
- రియల్ మీ ఫోన్స్‌ఫై ఆఫర్లు
- రియల్ మీ నార్జో 50 ప్రో ఫోన్ ఈ సేల్లో రూ.17,499కు అందుబాటులో ఉంది. 3 నెలల నో కాస్ట్ ఈఎంఐతో ఇది వినియోగదారుల చేతికి వస్తుంది.
బ్యాంకు ఆఫర్లు ఇలా
అమెజాన్ 5జీ రివల్యూషన్ సేల్లో భాగంగా కస్టమర్లు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. అదనంగా రూ.10,000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..