- Telugu News Photo Gallery Technology photos Motorola launched Motorola g32 have a look on features and price details
Motorola g32: రూ. 11 వేలకే దుమ్మురేపే స్మార్ట్ ఫోన్.. 50 ఎంపీ కెమెరా, మరెన్నో స్టన్నింగ్ ఫీచర్స్
స్మార్ట్‌ఫోన్ దిగ్గజ సంస్థ మోటోరోలా తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటో జీ32 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌తో మంచి ఫీచర్లతో అందించారు..
Updated on: Jun 23, 2023 | 5:47 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలా ఇటీవల వరుసగా బడ్జెట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్న మోటో తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది.

మోటో జీ32 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,499, కాగా 8జీబీ రామ్+ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ ప్రత్యేకత. ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ఎస్వోసీ చిప్ సెట్‌తో పనిచేస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

మోటో జీ32 స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 33 వాట్స్ టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు




