వెస్టిండీస్ జట్టుకు ఐసీసీ భారీ షాక్!
చెన్నైలో భారత్‌తో జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా వెస్టిండీస్ ఆటగాళ్లకు తమ మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత విధించింది ఐసీసీ. నిర్దేశిత సమయాన్ని పరిగణనలోకి తీసుకున్న తరువాత, కీరోన్ పొలార్డ్ జట్టు లక్ష్యానికి నాలుగు ఓవర్లు తక్కువగా ఉన్నట్లు ఐసిసి మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ జరిమానా విధించారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. నిర్దేశిత సమయంలోపు 46 ఓవర్లు మాత్రమే ముగించింది. ఇంకా 4 […]
చెన్నైలో భారత్‌తో జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా వెస్టిండీస్ ఆటగాళ్లకు తమ మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత విధించింది ఐసీసీ. నిర్దేశిత సమయాన్ని పరిగణనలోకి తీసుకున్న తరువాత, కీరోన్ పొలార్డ్ జట్టు లక్ష్యానికి నాలుగు ఓవర్లు తక్కువగా ఉన్నట్లు ఐసిసి మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ జరిమానా విధించారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. నిర్దేశిత సమయంలోపు 46 ఓవర్లు మాత్రమే ముగించింది. ఇంకా 4 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఓవర్ కు 20 శాతం ప్రాతిపదికగా మొత్తం 4 ఓవర్లకు 80 శాతం కోత విధించారు. “కేటాయించిన సమయంలో బౌలింగ్ పూర్తి చేయడంలో విఫలమైనందువల్ల, జట్టుకు వారి మ్యాచ్ ఫీజులో 80 శాతం జరిమానా విధించబడింది “అని ఐసిసి ఒక ప్రకటనలో తెలిపింది. మ్యాచ్ ముగిసిన తర్వాత వెస్టిండీస్ కెప్టెన్ పొలార్డ్ శిక్షను అంగీకరించడంతో, అధికారిక విచారణ అవసరం రాలేదు.