కోల్‌కతాలోనే ఐపీఎల్‌ వేలం.. బీసీసీఐ క్లారిటీ!

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై బెంగాల్ లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఆటగాళ్ల వేలం షెడ్యూల్ ప్రకారం గురువారం కోల్‌కతాలో జరుగుతుందని బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది. తుది సన్నాహాలను ప్రారంభించడానికి వేలంలో ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించబోయే ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ బృందం మంగళవారం కోల్‌కతాకు చేరుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మంగళవారం సాయంత్రం, బుధవారం ఉదయం నాటికి ఫ్రాంచైజీలు కోల్‌కతాకి వస్తాయని బిసిసిఐ సీనియర్ అధికారి తెలిపారు. డిసెంబర్ 19 న కోల్‌కతాలో […]

కోల్‌కతాలోనే ఐపీఎల్‌ వేలం.. బీసీసీఐ క్లారిటీ!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 17, 2019 | 12:06 PM

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై బెంగాల్ లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఆటగాళ్ల వేలం షెడ్యూల్ ప్రకారం గురువారం కోల్‌కతాలో జరుగుతుందని బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది. తుది సన్నాహాలను ప్రారంభించడానికి వేలంలో ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించబోయే ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ బృందం మంగళవారం కోల్‌కతాకు చేరుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మంగళవారం సాయంత్రం, బుధవారం ఉదయం నాటికి ఫ్రాంచైజీలు కోల్‌కతాకి వస్తాయని బిసిసిఐ సీనియర్ అధికారి తెలిపారు.

డిసెంబర్ 19 న కోల్‌కతాలో జరిగే ఐపిఎల్ వేలానికి 332 మంది క్రికెటర్లు ఎంపికయ్యారు. ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మాక్స్ వెల్, దక్షిణాఫ్రికాకు చెందిన డేల్ స్టెయిన్, మోర్గాన్(ఇంగ్లాండ్), కమ్మిన్స్(ఆస్ట్రేలియా) అత్యధిక ధర పలకనున్నారు. కొందరు ప్రధాన ఆటగాళ్లు మిచెల్‌ స్టార్క్‌, జో రూట్‌ ఈ ఐపీఎల్ కు దూరంగా ఉంటున్నారు. ఈ సంవత్సరం వేలంలో ఎనిమిది ఫ్రాంచైజీలలో కేవలం 73 స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో 29 విదేశీ ఆటగాళ్లకు కేటాయించబడ్డాయి.