AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. అంతర్జాతీయ క్రికెట్ కు ఏబీ రీ ఎంట్రీ

ఇది నిజంగానే క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్ అని చెప్పాలి. తనదైన శైలితో కూడిన షాట్స్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో మిస్టర్ 360గా పేరుగాంచిన ఏబీ డివిలియర్స్ త్వరలోనే రీ-ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జాతీయ జట్టుకు సారధ్య బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు.. అనుకోని విధంగా వర్క్ లోడ్ ఎక్కువైందని.. తన కుటుంబానికి తగిన వ్యవధి ఇవ్వలేకపోవడం వల్లే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని డివిలియర్స్ చెప్పిన సంగతి తెలిసిందే. సఫారీ గడ్డపై ఆస్ట్రేలియాతో గతేడాది జరిగిన టెస్ట్ సిరీస్ డివిలియర్స్‌కు చివరిది. ఇక […]

ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. అంతర్జాతీయ క్రికెట్ కు ఏబీ రీ ఎంట్రీ
Ravi Kiran
| Edited By: |

Updated on: Dec 17, 2019 | 10:26 AM

Share

ఇది నిజంగానే క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్ అని చెప్పాలి. తనదైన శైలితో కూడిన షాట్స్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో మిస్టర్ 360గా పేరుగాంచిన ఏబీ డివిలియర్స్ త్వరలోనే రీ-ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జాతీయ జట్టుకు సారధ్య బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు.. అనుకోని విధంగా వర్క్ లోడ్ ఎక్కువైందని.. తన కుటుంబానికి తగిన వ్యవధి ఇవ్వలేకపోవడం వల్లే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని డివిలియర్స్ చెప్పిన సంగతి తెలిసిందే.

సఫారీ గడ్డపై ఆస్ట్రేలియాతో గతేడాది జరిగిన టెస్ట్ సిరీస్ డివిలియర్స్‌కు చివరిది. ఇక అతడి తర్వాత హషిమ్ ఆమ్లా కూడా జట్టు నుంచి వైదొలగడంతో దక్షిణాఫ్రికా క్రికెట్ కొద్దిరోజులుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటోంది. వన్డే వరల్డ్‌కప్‌లో ఖంగుతిన్న ఈ జట్టును మళ్ళీ ఫామ్‌లోకి తేవడానికి ఆ దేశ బోర్డు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ప్రస్తుతం సఫారీల క్రికెట్ బోర్డుకు మాజీ క్రికెటర్ గ్రేమ్ స్మిత్ 2023 వరకు డైరెక్టర్‌గా వ్యవహరించనున్నాడు. అటు కొత్త కోచ్‌గా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ నియమితుడయ్యాడు. ఇక తాజాగా ఆయన దగ్గర ఏబీ డివిలియర్స్ ప్రస్తావన రాగా.. రిటైర్మెంట్‌ విషయాన్ని మరోసారి పరిశీలించాలని ఏబీని కోరతానని బౌచర్ చెప్పడం విశేషం. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌కు జట్టులో అత్యుత్తమ క్రికెటర్లను ఉంచడమే తన లక్ష్యమని.. తప్పకుండా డివిలియర్స్‌ను రప్పిస్తానని స్పష్టం చేశాడు. దీని బట్టి చూస్తే.. మిస్టర్ 360 అంతర్జాతీయ క్రికెట్ రీ-ఎంట్రీ త్వరలోనే తధ్యమన్నట్లు కనిపిస్తోంది.

Follow Us
ఓర్నాయనో.. అతిగా తింటే ఈ వ్యాధులు మూటగట్టుకున్నట్లే..
ఓర్నాయనో.. అతిగా తింటే ఈ వ్యాధులు మూటగట్టుకున్నట్లే..
ఆరోగ్యాన్నిచ్చే అంబలి.. ఇలా చేసి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!
ఆరోగ్యాన్నిచ్చే అంబలి.. ఇలా చేసి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!
పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా..
పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా..
3, 4 లేదా 5 రెక్కలు.. ఎండాకాలంలో ఏ ఫ్యాన్ గాలి ఎక్కువ వస్తుంది?
3, 4 లేదా 5 రెక్కలు.. ఎండాకాలంలో ఏ ఫ్యాన్ గాలి ఎక్కువ వస్తుంది?
జ్యూసీగా, మంచి రుచిని ఇచ్చే దేశంలోని ఫేమస్ మామిడిపండ్లు ఇవే!
జ్యూసీగా, మంచి రుచిని ఇచ్చే దేశంలోని ఫేమస్ మామిడిపండ్లు ఇవే!
ప్రూఫ్ లేకపోయినా ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవడం ఎలా..?
ప్రూఫ్ లేకపోయినా ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవడం ఎలా..?
థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా..
థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా..
మట్టి కుండ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలిస్తే మీ నీళ్లు ఐస్ లాగే
మట్టి కుండ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలిస్తే మీ నీళ్లు ఐస్ లాగే
RGVకి డైరెక్ట్ చేసే అంత సీన్ ఉందా అనుకున్నా.. ఆ తర్వాత.!
RGVకి డైరెక్ట్ చేసే అంత సీన్ ఉందా అనుకున్నా.. ఆ తర్వాత.!
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..