INDIA vs SA: దక్షిణాఫ్రికాపై విజయం తర్వాత డ్యాన్స్ తో అదగరొట్టిన శిఖర్ ధావన్.. ఏ పాటకో తెలుసా..

ధావన్ కెప్టెన్సీలో టీమిండియా దక్షిణాఫ్రికాపై 2-1 తేడాతో వన్డే సిరీస్ ను గెల్చుకుంది. మ్యాచ్ పూర్తైన తర్వాత తన టీమ్ తో కలిసి శిఖర్ ధావన్ డ్రెస్సింగ్ రూమ్ లో డ్యాన్స్ తో అదరగోట్టాడు. వన్డే సిరీస్ విజయం తర్వాత సహచరులతో కలిసి..

INDIA vs SA: దక్షిణాఫ్రికాపై విజయం తర్వాత డ్యాన్స్ తో అదగరొట్టిన శిఖర్ ధావన్.. ఏ పాటకో తెలుసా..
Indian Cricketers Dance In Dressing Room
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 12, 2022 | 10:41 AM

రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లడంతో.. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు భారత క్రికెట్ జట్టుకు శిఖర్ ధావన్ నేతృత్వం వహించాడు. ధావన్ కెప్టెన్సీలో టీమిండియా దక్షిణాఫ్రికాపై 2-1 తేడాతో వన్డే సిరీస్ ను గెల్చుకుంది. మ్యాచ్ పూర్తైన తర్వాత తన టీమ్ తో కలిసి శిఖర్ ధావన్ డ్రెస్సింగ్ రూమ్ లో డ్యాన్స్ తో అదరగోట్టాడు. వన్డే సిరీస్ విజయం తర్వాత సహచరులతో కలిసి ‘బోలో తారా రా రా’ పాటకు శిఖర్ ధావన్ డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను శిఖర్ ధావన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. మూడు మ్యాచ్ ల వన్డే సీరిస్ లో భాగంగా తొలి వన్డేలో సౌతాఫ్రికా గెలవగా, తరువాత రెండు మ్యాచుల్లోనూ భారత్ వరుస విజయాలు సాధించి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. వన్డే సిరీస్‌ను గెలుచుకున్న తర్వాత టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ సహచరులతో సరదాగా గడిపాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మక వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఈ విజయంతో ధావన్ ఆనందానికి అవధుల్లేవని చెప్పుకోవాలి. కేవలం కెప్టెన్ శిఖర్ ధావన్ మాత్రమే కాదు టీమిండియా మొత్తం ఈ విజయాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. వాస్తవానికి ద్వితీయ శ్రేణి జట్టును దక్షిణాఫ్రికాతో టూర్ కు బీసీసీఐ ప్రకటించింది. అయినాసరే టీమిండియా ఆటగాళ్లు సౌతాఫ్రికాపై 2-1 తేడాతో విజయం సాధించింది. డ్రెస్సింగ్ రూమ్ లో సహచరులతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోకు “జీత్ కే బోలో తారా రా రా” అని క్యాప్షన్ ఇచ్చాడు శిఖర్ ధావన్. మూడో వన్డేలో శిఖర్ ధావన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఇవి కూడా చదవండి

భారత్ బౌలర్లు దక్షిణాఫ్రికాను 99 పరుగులకే ఆలౌట్ చేయడంతో ధావన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని భారత బౌలర్లు నిరూపించారు. కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో మెరిపించగా, వాషింగ్టన్ సుందర్ , మహ్మద్ సిరాజ్ , షాబాజ్ అహ్మద్ తలో రెండు వికెట్లు తీశారు. ఏడుగురు దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లో విఫలమైంది. సౌతాఫ్రికా బౌలర్లు కూడా చేతులెత్తె్య్యడంతో భారత్ సునాయాసంగా విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..