ప్రొ కబడ్డీలో కోహ్లీ అప్పీరియన్స్ !
ముంబై: వారం రోజుల పాటు హైదరాబాద్‌లో అభిమానులను అలరించిన ప్రొ కబడ్డీ లీగ్ పోటీలు శుక్రవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. శనివారం ముంబయికి చేరుకున్న ఈ లీగ్‌లో యు ముంబ, పుణెరి పల్టాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు ప్రత్యేక అతిథిగా భారత క్రికెట్ సారథి, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ హజరయ్యాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లతో కలిసి జాతీయగీతాన్ని ఆలపించాడు. అనంతరం స్టేడియం ఆటను చూస్తూ ఆస్వాదించాడు. ఈ […]

ముంబై: వారం రోజుల పాటు హైదరాబాద్‌లో అభిమానులను అలరించిన ప్రొ కబడ్డీ లీగ్ పోటీలు శుక్రవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. శనివారం ముంబయికి చేరుకున్న ఈ లీగ్‌లో యు ముంబ, పుణెరి పల్టాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు ప్రత్యేక అతిథిగా భారత క్రికెట్ సారథి, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ హజరయ్యాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లతో కలిసి జాతీయగీతాన్ని ఆలపించాడు. అనంతరం స్టేడియం ఆటను చూస్తూ ఆస్వాదించాడు. ఈ మ్యాచ్‌లో యు ముంబ 33-23తో పుణెపై విజయం సాధించింది.




