AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs England: భారత్-ఇంగ్లండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం.. అక్సర్ పటేల్‌ను ఇంటర్వ్యూ చేసిన హార్దిక్ పాండ్య.. మధ్యలో కోహ్లీ వచ్చి..

India vs England 2021: అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం..

India vs England: భారత్-ఇంగ్లండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం.. అక్సర్ పటేల్‌ను ఇంటర్వ్యూ చేసిన హార్దిక్ పాండ్య.. మధ్యలో కోహ్లీ వచ్చి..
Shiva Prajapati
|

Updated on: Feb 26, 2021 | 4:07 PM

Share

India vs England 2021: అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఈ మ్యాచ్‌లో ఆక్సర్ కీలక పాత్ర పోషించాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఐదు వికెట్లు పడగొట్టాడు. డే-నైట్ టెస్ట్‌లో ఉత్తమ బౌలింగ్‌తో రికార్డును నెలకొల్పాడు. 70 పరుగులకు 11 వికెట్లు సాధించి ఔరా అనిపించాడు. ఇదిలాఉండగ గుజరాత్‌కు చెందిన అక్సర్ పటేల్.. అహ్మదాబాద్ స్టేడియంలోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అవార్డును అందుకున్నాడు. అయితే, అక్సర్ ఈ స్థాయిలో రాణించడానికి అతని కుటుంబం, స్నేహితులే కారణమని చెప్పుకొచ్చాడు. ఇదిలాఉంటే.. టీమిండియా ఘన విజయం అనంతరం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆఫ్ స్పిన్నర్ అక్సర్ పటేల్‌ను ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో అక్సర్ ఆసక్తికర విషయాలు చెప్పాడు. కాగా, ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్వ్యూ లో హార్దిక్, అక్సర్ ఏం చెప్పారంటే.. హార్దిక్: టెస్ట్ క్రికెట్ మీకు ఈజీగా అనిపిస్తుందా? ఆక్సర్: మనం మార్గం మనం వెళ్తున్నప్పుడు ప్రతీది సులువుగా అనిపిస్తుంది. కానీ, ఒక్కోసారి పరిస్థితులు మారొచ్చు. ఏదైనా మనం నమ్మేదానిని బట్టే ఉంటుంది. హార్దిక్: స్నేహితుడిగా, సోదరుడిగా, సహచరుడిగా నీ ఆట తీరును చూసి గర్వంగా ఫీలవుతున్నాను. అక్సర్: నేను 3 సంవత్సరాలు జట్టుకు దూరంగా ఉన్నాను. జట్టులోకి మళ్లీ తిరిగి రావడానికి నా ఆటలో పొరపాటు ఏంటనే దానిపై ఎక్కువగా ఆలోచించే వాడిని. జట్టులో స్థానం కోల్పోయాక చాలా మంది మిత్రులు ఇదే అంశంపై అనేక ప్రశ్నలు వేశారు. ‘ఐపీఎల్‌లో బాగా రాణించిన తర్వాత కూడా మీకు జట్టులో ఎందుకు లేరు’ అని వారు అడిగేవారు. కానీ నేను సరైన సమయంలో జట్టులో చోటు దక్కించుకుంటానని పూర్తి విశ్వాసంతో ఉండేవాడిని. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, మీలాంటి వారు నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. కఠినమైన సమయాల్లో నాకు మద్దతు ఇచ్చినందుకు నా కుటుంబానికి, స్నేహితులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హార్దిక్: అక్సర్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాము. జట్టులోకి రావడం కోసం అక్సర్ కష్టపడిన విధానం చూసి చాలా గర్వంగా ఫీలవుతాము. క్రీడల్లో కష్టపడే తత్వం, సహనం, యధార్థ స్థితిని అంగీకరించే మనస్తితి చాలా ముఖ్యం. ఇవన్నీ అక్సర్‌లో ఉన్నాయని గుర్తించాను. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. కేవలం ఇంటి మైదానంలోనే అక్సర్ ఆట నేర్చుకున్నాడు. అదెలా సాధ్యమైంది? అక్సర్: మోటెరాలో ఇది నా రెండవ మ్యాచ్. ఇక్కడ చాలా గొప్పగా ఆడానని భావిస్తున్నాను. సొంత గడ్డపై రెండు సార్లు 5 వికెట్లు పడగొట్టడం చాలా సంతోషాన్నిచ్చింది. అంతేకాదు.. స్టేడియంలో స్థానిక ప్రేక్షకుల మధయ ఆడటం గొప్పు అనుభూతినిచ్చింది. హార్దిక్: తరువాత మ్యాచ్‌లో కూడా మరో ఐదు వికెట్లు పడగొట్టండి. అక్సర్: నా వంతు ప్రయత్నం చేస్తాను.

ఇదే సమయంలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఈ ఇంటర్వ్యూ మధ్యలో కలగజేసుకున్నాడు. గుజరాతీ భాషలో అక్సర్‌పై ప్రశంసలు గుప్పించాడు. దీనికి స్పందించిన హార్దిక్.. గుజరాతీ నేర్చుకునేందుకు కోహ్లీ ప్రయత్నిస్తున్నారంటూ సరదాగా కామెంట్ చేశాడు.

Also read:

కార్మికుల రాస్తారోకోలతో దద్దరిల్లిన విశాఖపట్నం.. గంటల తరబడి ఎక్కడికక్కడే నిలిచిపోయిన వాహనాలు

రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు