AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli : విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే హౌస్ ఫుల్ బోర్డులు..వైజాగ్‌లో రేపటి మ్యాచ్‌కి కోహ్లీ మేనియా పీక్స్‌

ప్రస్తుతం విశాఖపట్నం అంతా విరాట్ కోహ్లీ పేరుతో మారుమోగుతోంది. భారత్, సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ విజేతను నిర్ణయించే చివరి కీలక మ్యాచ్ ఇక్కడే జరగనుంది. మ్యాచ్ దగ్గర పడుతున్న కొద్దీ నగరంలో కోహ్లీ క్రేజ్ అమాంతం పెరిగింది. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే.. మొదట్లో ఎవరూ కొనడానికి ఆసక్తి చూపని టికెట్లు, ఇప్పుడు నిమిషాల వ్యవధిలోనే సోల్డ్ అవుట్ అయ్యాయి.

Virat Kohli : విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే హౌస్ ఫుల్ బోర్డులు..వైజాగ్‌లో రేపటి మ్యాచ్‌కి కోహ్లీ మేనియా పీక్స్‌
Virat Kohli
Rakesh
|

Updated on: Dec 05, 2025 | 2:34 PM

Share

Virat Kohli : ప్రస్తుతం విశాఖపట్నం అంతా విరాట్ కోహ్లీ పేరుతో మారుమోగుతోంది. భారత్, సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ విజేతను నిర్ణయించే చివరి కీలక మ్యాచ్ ఇక్కడే జరగనుంది. మ్యాచ్ దగ్గర పడుతున్న కొద్దీ నగరంలో కోహ్లీ క్రేజ్ అమాంతం పెరిగింది. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే.. మొదట్లో ఎవరూ కొనడానికి ఆసక్తి చూపని టికెట్లు, ఇప్పుడు నిమిషాల వ్యవధిలోనే సోల్డ్ అవుట్ అయ్యాయి. ఈ అసాధారణమైన డిమాండ్‌కు కారణం విరాట్ కోహ్లీ ఇటీవల రాంచీ, రాయ్‌పూర్‌లో ఆడిన వన్డేలలో వరుసగా రెండు సెంచరీలు కొట్టడమే. ఆయన ఫామ్ చూసి వైజాగ్‌లో కూడా మరో సెంచరీ చూడాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.

టికెట్ల అమ్మకంలో అనూహ్య మార్పు

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నవంబర్ 28న మూడో వన్డే టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టినప్పుడు, అభిమానుల నుంచి స్పందన కరువైంది. దీంతో ఈసారి మ్యాచ్‌కు తక్కువ మంది వస్తారని భావించిన అధికారులు, కౌంటర్లలో కూడా టికెట్లు అమ్మేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ విరాట్ కోహ్లీ వరుసగా రెండు సెంచరీలు బాదడంతో మొత్తం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీడియా, ఆపరేషన్స్ టీమ్ సభ్యుడు వై వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కోహ్లీ సెంచరీల తర్వాత టికెట్ల రెండో, మూడో దశ అమ్మకాలు నిమిషాల్లోనే పూర్తయ్యాయి. గతంలో ఎవరూ కొనడానికి సిద్ధపడని టికెట్లకు ఇప్పుడు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.

ఎయిర్‌పోర్టులోనూ ఉప్పొంగిన ఉత్సాహం

క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం కేవలం ఆన్‌లైన్ టికెట్లకే పరిమితం కాలేదు. భారత జట్టు విశాఖపట్నం చేరుకోవడానికి ముందే, ఎయిర్‌పోర్టు వద్ద భారీగా జనం గుమిగూడారు. ఫ్లైట్ ఆలస్యమైనప్పటికీ, అభిమానులు గంటల తరబడి నిరీక్షించారు. విరాట్ కోహ్లీ, ఇతర ఆటగాళ్లు బయటకు రాగానే, ఎయిర్‌పోర్ట్ మొత్తం చప్పట్లు, కేకలతో మార్మోగిపోయింది. రాయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా ఇలాంటి ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. విమానం ఆలస్యం కావడంతో విమానయాన సిబ్బందిపై కోపంగా ఉన్న ప్రయాణీకులు, టీమిండియాను చూడగానే ఒక్కసారిగా ప్రశాంతంగా, సంతోషంగా మారిపోయారు. విరాట్‌ను చూడగానే అందరూ మొబైల్ కెమెరాలు ఆన్ చేసి ఉత్సాహంగా కనిపించారు. డిసెంబర్ 6న జరిగే ఈ చివరి వన్డేలో విరాట్ మరో సెంచరీ చేసి, టీమిండియాకు సిరీస్ అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..