Vijay Hazare Trophy : రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా? స్కోర్ ఎక్కడ చూడాలి?
Vijay Hazare Trophy : విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ రెండో రౌండ్ మ్యాచ్‌లు నేడు అత్యంత ఉత్కంఠభరితంగా ప్రారంభమయ్యాయి. భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ దేశవాళీ క్రికెట్‌లో అడుగుపెట్టడంతో ఈ టోర్నీకి ఎన్నడూ లేని క్రేజ్ వచ్చింది.

Vijay Hazare Trophy : విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ రెండో రౌండ్ మ్యాచ్‌లు నేడు అత్యంత ఉత్కంఠభరితంగా ప్రారంభమయ్యాయి. భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ దేశవాళీ క్రికెట్‌లో అడుగుపెట్టడంతో ఈ టోర్నీకి ఎన్నడూ లేని క్రేజ్ వచ్చింది. మొదటి రౌండ్‌లో రోహిత్ 155 పరుగులు, కోహ్లీ 131 పరుగులతో సెంచరీల వర్షం కురిపించి తమ ఫామ్ ఇంకా తగ్గలేదని నిరూపించారు. దీంతో నేడు జరుగుతున్న రెండో రౌండ్ మ్యాచ్‌లపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల కళ్లు పడ్డాయి.
మొదటి రౌండ్‌లో ముంబై తరపున ఆడుతున్న రోహిత్ శర్మ, సిక్కింపై విరుచుకుపడి విజయ్ హజారేలో అద్భుతమైన రీఎంట్రీ ఇచ్చారు. మరోవైపు ఢిల్లీ జట్టు కోసం ఆడుతున్న విరాట్ కోహ్లీ, ఆంధ్ర జట్టుపై మెరుపు ఇన్నింగ్స్ ఆడి తన పవరేంటో చూపించారు. నేడు జరుగుతున్న రెండో రౌండ్‌లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు గుజరాత్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్‌లో జరుగుతోంది. ఇక రోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై జట్టు ఉత్తరాఖండ్‌తో జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో తలపడుతోంది. ఉదయం 9 గంటలకే ఈ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి.
అయితే, రోహిత్-కోహ్లీల బ్యాటింగ్ చూడాలనుకుంటున్న అభిమానులకు ఒక చిన్న చేదు వార్త. ఈ కీలకమైన మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం లేదా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో లేదు. విజయ్ హజారే ట్రోఫీలో మొత్తం 38 జట్లు ఒకేసారి మ్యాచ్‌లు ఆడుతుండటంతో, బీసీసీఐ అన్ని చోట్లా బ్రాడ్‌కాస్టింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయలేకపోయింది. కేవలం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం, రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియాల్లో జరిగే మ్యాచ్‌లు మాత్రమే టీవీ లేదా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో కనిపిస్తాయి. ఢిల్లీ, ముంబై మ్యాచ్‌లకు సంబంధించిన అప్‌డేట్స్‌ను కేవలం బీసీసీఐ అధికారిక వెబ్‌సైట్ లేదా స్కోర్ బోర్డుల ద్వారానే తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఇతర ప్రధాన మ్యాచ్‌ల విషయానికి వస్తే.. గ్రూప్-Aలో కర్ణాటక వర్సెస్ కేరళ మధ్య పోరు అహ్మదాబాద్‌లో ఆసక్తికరంగా సాగుతోంది. గ్రూప్-Bలో హైదరాబాద్ జట్టు విదర్భతో రాజ్‌కోట్‌లో తలపడుతోంది. తెలుగు రాష్ట్రాల జట్లు ఆంధ్ర, హైదరాబాద్ కూడా తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా అలూర్‌లో జరుగుతున్న గ్రూప్-D మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు రైల్వేస్‌తో పోటీ పడుతోంది. ఒక్క రోజే 19 వేర్వేరు వేదికలపై ఈ మ్యాచ్‌లు జరుగుతుండటంతో దేశవాళీ క్రికెట్ పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది.
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా రెండో రౌండ్ మ్యాచ్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు, వేదికల వివరాలు ఇవే
గ్రూప్ A (వేదిక: అహ్మదాబాద్)
మధ్యప్రదేశ్ వర్సెస్ తమిళనాడు – గుజరాత్ కాలేజ్ గ్రౌండ్, అహ్మదాబాద్ (ఉదయం 9:00)
జార్ఖండ్ వర్సెస్ రాజస్థాన్ – నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్ (ఉదయం 9:00)
పుదుచ్చేరి వర్సెస్ త్రిపుర – ADSA రైల్వే గ్రౌండ్, అహ్మదాబాద్ (ఉదయం 9:00)
కర్ణాటక వర్సెస్ కేరళ – నరేంద్ర మోదీ స్టేడియం B, అహ్మదాబాద్ (ఉదయం 9:00)
గ్రూప్ B (వేదిక: రాజ్‌కోట్)
చండీగఢ్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ – సనోస్ర గ్రౌండ్ A, రాజ్‌కోట్ (ఉదయం 9:00)
అస్సాం వర్సెస్ జమ్మూ కాశ్మీర్ – నిరంజన్ షా స్టేడియం, రాజ్‌కోట్ (ఉదయం 9:00)
బరోడా వర్సెస్ బెంగాల్ – నిరంజన్ షా స్టేడియం గ్రౌండ్ C, రాజ్‌కోట్ (ఉదయం 9:00)
హైదరాబాద్ వర్సెస్ విదర్భ – సనోస్ర గ్రౌండ్ B, రాజ్‌కోట్ (ఉదయం 9:00)
గ్రూప్ C (వేదిక: జైపూర్)
గోవా వర్సెస్ హిమాచల్ ప్రదేశ్ – జైపురియా విద్యాలయ గ్రౌండ్, జైపూర్ (ఉదయం 9:00)
ముంబై వర్సెస్ ఉత్తరాఖండ్ – సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్ (ఉదయం 9:00)
ఛత్తీస్‌గఢ్ వర్సెస్ పంజాబ్ – అనంతమ్ గ్రౌండ్, జైపూర్ (ఉదయం 9:00)
మహారాష్ట్ర వర్సెస్ సిక్కిం – కేఎల్ సైనీ గ్రౌండ్, జైపూర్ (ఉదయం 9:00)
గ్రూప్ D (వేదిక: బెంగళూరు/అలూర్)
హర్యానా వర్సెస్ సౌరాష్ట్ర – KSCA గ్రౌండ్ 2, అలూర్ (ఉదయం 9:00)
ఆంధ్రప్రదేశ్ వర్సెస్ రైల్వేస్ – KSCA గ్రౌండ్, అలూర్ (ఉదయం 9:00)
ఒడిశా వర్సెస్ సర్వీసెస్ – KSCA గ్రౌండ్ 3, అలూర్ (ఉదయం 9:00)
ఢిల్లీ వర్సెస్ గుజరాత్ – సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 1, బెంగళూరు (ఉదయం 9:00)
ప్లేట్ గ్రూప్ (వేదిక: రాంచీ)
బీహార్ వర్సెస్ మణిపూర్ – JSCA ఇంటర్నేషనల్ స్టేడియం, రాంచీ (ఉదయం 9:00)
అరుణాచల్ ప్రదేశ్ వర్సెస్ మిజోరం – JSCA ఓవల్ గ్రౌండ్, రాంచీ (ఉదయం 9:00)
మేఘాలయ వర్సెస్ నాగాలాండ్ – ఉషా మార్టిన్ గ్రౌండ్, రాంచీ (ఉదయం 9:00)
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
