AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూఎస్‌ సెమీస్‌లో సెరెనాకు షాకిచ్చిన అజరెంకా

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై గంపెడాశలు పెట్టుకున్న సెరెనా విలియమ్స్‌కు సెమీ ఫైనల్లో ఎదురుదెబ్బ తగిలింది. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలో దిగిన సెరెనాకు వరల్డ్‌ మాజీ నంబర్‌వన్‌ క్రీడాకారిణి, బెలారస్‌కు చెందిన విక్టోరియా అజరెంకా ఆ అవకాశం ఇవ్వలేదు.

యూఎస్‌ సెమీస్‌లో సెరెనాకు షాకిచ్చిన అజరెంకా
Balu
|

Updated on: Sep 11, 2020 | 12:40 PM

Share

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై గంపెడాశలు పెట్టుకున్న సెరెనా విలియమ్స్‌కు సెమీ ఫైనల్లో ఎదురుదెబ్బ తగిలింది. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలో దిగిన సెరెనాకు వరల్డ్‌ మాజీ నంబర్‌వన్‌ క్రీడాకారిణి, బెలారస్‌కు చెందిన విక్టోరియా అజరెంకా ఆ అవకాశం ఇవ్వలేదు. ఆర్ధర్‌ ఆషే స్టేడియంలో జరిగిన సెమీఫైనల్‌ పోరులో అజరెంకా చాలా ఈజీగా విజయం సాధించింది.. 1-6, 6-3, 6-3 తేడాతో సెరెనాపై విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది.. తొలి సెట్‌లో సెరెనా విజృంభించడంతో అజరెంకా బిత్తరపోయింది.. అయితే తర్వాత రెండు సెట్లలో తన తఢాకా చూపించింది.. ఆత్మవిశ్వాసంతో సెరెనాను ఎదుర్కొంది. మేజర్‌ టోర్నమెంట్లలో తొలి సెట్‌ను గెల్చుకున్న తర్వాత మ్యాచ్‌ను ఓడిపోవడం సెరెనాకు ఆరేళ్ల తర్వాత ఇదే ప్రథమం కావడం గమనార్హం.. 2014లో జరిగిన వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో అలెజ్‌ కార్నెట్‌ చేతిలో కూడా సెరెనా ఇదే విధంగా ఓటమి చెందారు. తల్లి అయిన తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను గెల్చుకోవాలనుకున్న సెరెనా ఆశలపై అజరెంకా నీళ్లు చల్లింది. చాన్నాళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో అజరెంకా ఫైనల్‌కు చేరింది. చివరిసారిగా 2013లో ఫైనల్లోకి అడుగు పెట్టిన అజరెంకా ఇన్నాళ్లకు మళ్లీ ఆ ఘనత సాధించింది. అయితే యూఎస్‌ ఓపెన్‌లో సెరెనాపై విజయం సాధించడమన్నది అజరెంకాకు ఇదే మొదటిసారి.. 2012, 2013లలో యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరుకున్న అజరెంకాను ఆ రెండు సార్లు సెరెనానే ఓడించింది.. అలా పాపం రన్నరప్‌తో సంతృప్తి చెందాల్సి వచ్చింది.. ఈసారి మాత్రం టైటిల్‌ సాధించడం పక్కా అని కాన్ఫిడెంట్‌గా చెబుతోంది అజరెంకా.

Follow Us
కోడి కందనకాయ ఫ్రై.. ఇలా కానీ వండితే.. కదలకుండా 3 కంచాలు పక్కా
కోడి కందనకాయ ఫ్రై.. ఇలా కానీ వండితే.. కదలకుండా 3 కంచాలు పక్కా
శరీరం నుంచి ఆత్మ విడిపోయాక ఏం జరుగుతుంది..? ప్రాణం పోయే క్షణాల్లో
శరీరం నుంచి ఆత్మ విడిపోయాక ఏం జరుగుతుంది..? ప్రాణం పోయే క్షణాల్లో
ఎక్కడ చూసిన ఎండిన ఆకులే.. ఇంతకు వేప చెట్లకు ఏం జరుగుతుంది
ఎక్కడ చూసిన ఎండిన ఆకులే.. ఇంతకు వేప చెట్లకు ఏం జరుగుతుంది
నెలకు రూ.20 వే ఆదాయం.. కేంద్ర ప్రభుత్వ పథకంతో..
నెలకు రూ.20 వే ఆదాయం.. కేంద్ర ప్రభుత్వ పథకంతో..
6 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న సినిమా..థియేటర్లలో అట్టర్ ప్లాప్.
6 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న సినిమా..థియేటర్లలో అట్టర్ ప్లాప్.
వైష్ణవి ఎంత కొట్టినా తలుపు తెరవలేదు.. అనుమానమొచ్చి కిటికీలో నుంచి
వైష్ణవి ఎంత కొట్టినా తలుపు తెరవలేదు.. అనుమానమొచ్చి కిటికీలో నుంచి
రూ. 14 కోట్లు వచ్చాయని షికార్లు చేయకమ్మా.. అతడికి ధోనీ హితబోధ
రూ. 14 కోట్లు వచ్చాయని షికార్లు చేయకమ్మా.. అతడికి ధోనీ హితబోధ
పెళ్లిళ్లకు ముందు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగిన బంగారం, వెండి ధర
పెళ్లిళ్లకు ముందు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగిన బంగారం, వెండి ధర
సౌత్ కొరియన్ సింగర్స్‏తో సుకుమార్ కూతురు..
సౌత్ కొరియన్ సింగర్స్‏తో సుకుమార్ కూతురు..
విద్యార్థులకు కూడా క్రెడిట్ కార్డులు.. ఎలా పొందాలో తెలుసుకోండి
విద్యార్థులకు కూడా క్రెడిట్ కార్డులు.. ఎలా పొందాలో తెలుసుకోండి