AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ గర్ల్‌ఫ్రెండ్ దొరికేసింది.. 15 ఏళ్లకే డేటింగ్ మొదలెట్టేశాడా?

Vaibhav Suryavanshi : గత కొద్ది రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో వైభవ్ ఒక అమ్మాయితో కలిసి ఉన్నట్లు కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల్లో వైభవ్‌కు ఉన్న క్రేజ్ చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ క్రమంలోనే వైభవ్ గర్ల్‌ఫ్రెండ్ ఎవరు? అనే ప్రశ్న గూగుల్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ గర్ల్‌ఫ్రెండ్ దొరికేసింది.. 15 ఏళ్లకే డేటింగ్ మొదలెట్టేశాడా?
Vaibhav Suryavanshi
Rakesh
|

Updated on: May 10, 2026 | 8:29 AM

Share

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్‌లో తన సిక్సర్ల సునామీతో ప్రపంచ క్రికెట్‌ను షేక్ చేస్తున్న 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాడు. కేవలం క్రికెట్ మైదానంలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా ఈ కుర్రాడికి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా అమ్మాయిల్లో వైభవ్‌కు ఉన్న క్రేజ్ చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ క్రమంలోనే వైభవ్ సూర్యవంశీ గర్ల్‌ఫ్రెండ్ ఎవరు? అనే ప్రశ్న గూగుల్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

గత కొద్ది రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో వైభవ్ ఒక అమ్మాయితో కలిసి ఉన్నట్లు కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ ఫోటోల వెనుక ఉన్న అసలు నిజాన్ని పరిశీలిస్తే.. అవి ఏఐ ద్వారా క్రియేట్ చేసినవిగా తేలింది. ఎవరో కావాలని వైభవ్ క్రేజ్‌ను వాడుకుంటూ ఇలాంటి తప్పుడు ప్రచారానికి తెరలేపారు. ప్రస్తుతం వైభవ్ వయస్సు కేవలం 15 ఏళ్లే. అతను పూర్తిగా తన ఆట మీద, చదువు మీద దృష్టి పెడుతున్నాడని అతని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

వైష్ణవి శర్మతో డేటింగ్? పుకార్ల వెనుక వాస్తవం ఏంటి?

కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా ఖాతాలు ఒక అడుగు ముందుకు వేసి.. వైభవ్ సూర్యవంశీ, మహిళా క్రికెటర్ వైష్ణవి శర్మతో ప్రేమలో ఉన్నాడని ప్రచారం చేస్తున్నాయి. క్రికెట్24షార్ట్స్ వంటి కొన్ని అకౌంట్లు ఈ వార్తలకు మరింత ఆజ్యం పోశాయి. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. వైష్ణవి శర్మ కూడా ఒక క్రీడాకారిణి కావడంతో వారిద్దరి మధ్య స్నేహం ఉండవచ్చని, కానీ దానికి ప్రేమ రంగు పులమడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇంగ్లాండ్ దాకా వెళ్లిన లేడీ ఫ్యాన్స్

వైభవ్‌కు ఉన్న క్రేజ్ కేవలం భారత్‌కే పరిమితం కాలేదు. ఇటీవల టీమిండియా అండర్-19 జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. వైభవ్ ఆటను చూడటం కోసం ఆన్యా, రివా అనే ఇద్దరు అమ్మాయిలు ఏకంగా ఆరు గంటల పాటు కారులో ప్రయాణించి మైదానానికి చేరుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ పింక్ జెర్సీలు ధరించి మరీ వారు వైభవ్‌ను కలవడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత వారు వైభవ్‌తో ఫోటోలు దిగి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇది కేవలం వీరాభిమానం మాత్రమే తప్ప, దీనికి ఎలాంటి ప్రేమ సంబంధం లేదని స్పష్టమవుతోంది.

క్రికెట్టే లోకం.. రికార్డులే లక్ష్యం

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్‌లో ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. 15 ఏళ్లకే ఐపీఎల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయడం, టీ20ల్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు బాదడం వంటి రికార్డులు అతని ఖాతాలో ఉన్నాయి. ఇంత చిన్న వయసులో ఇలాంటి గాసిప్స్‌ను పట్టించుకోకుండా, అతను తన కెరీర్‌ను నిర్మించుకోవడంలో బిజీగా ఉన్నాడు. కాబట్టి వైభవ్ సింగిలే అని, ప్రస్తుతం అతని ఫోకస్ అంతా బ్యాటింగ్ మీదే ఉందని చెప్పవచ్చు.

Follow Us