Tokyo Olympics 2020 Highlights: నీరజ్ సాధించాడు.. వందేళ్ల తర్వాత భారత్‌కు అథ్లెటిక్స్‌లో పతకం.. దేశ ఒలింపిక్స్ చరిత్రలో సరికొత్త రికార్డు.
Tokyo Olympics 2020 Live Update: ఎప్పుడూ లేనివిధంగా భారత్.. పురుషుల జావెలిన్ థ్రో విభాగంలో ఫైనల్స్‌కు భారత్ అర్హత సాధించింది. ఇది సరికొత్త రికార్డ్. ఈ ఈవెంట్‌లో భారత్‌కు ప్రాతినిథ్యాన్ని..
Tokyo Olympics 2020 Live Update: టోక్యో ఒలింపిక్స్ 2020కి భారత్ ఘనమైన ముగింపును ఇచ్చింది. ఈసారి ఒలింపిక్స్‌లో గోల్డ్ పతకం వస్తుందా లేదా అని అందరూ అనుమానిస్తోన్న తరుణంలో నీరజ్ చోప్రా రూపంలో భారత్ ఖాతాలో స్వర్ణం వచ్చి చేరింది. భారత్‌కు ఒలింపిక్స్ చివరి రోజైన నేడు (శనివారం) మంచి ఫలితాలే వచ్చాయి. భారత్ నేడు రెండు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. నిజానికి మొదట రంగంలోకి దిగిన గోల్ఫర్ అదితి అశోక్ కూడా పతకాన్ని ఖాయం చేస్తుందని అందరూ ఆశించారు. కానీ అద్భుత ఆటతీరును కనబరిచిన అదితి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.
ఇక అనంతరం బరిలోకి దిగిన భజరంగ్ అద్భుత ఆటతీరును కనబరిచి భారత్ ఖాతాలో కాంస్య పతకాన్ని చేర్చాడు. ఇక చివరగా భారత్ ఒలింపిక్స్ చరిత్రలో సరికొత్త అధ్యయనాన్ని తెరతీస్తూ నీరజ్ చోప్రా అద్భుతాన్ని సృష్టించాడు. వందేళ్ల భారత ఒలింపిక్స్ చరిత్రలో అథ్లెటిక్స్‌లో తొలి పతకాన్ని సాధించి సంచనం సృష్టించాడు. దీంతో ఈసారి ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య ఏడుకి చేరింది. ఈసారి భారత్‌కు ఒక స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలు దక్కాయి. వీరిలో నీరజ్ చోప్రా స్వర్ణం గెలుచుకోగా, మీరాబాయి చాను, రవి దహియాలు రజతం సొంతం చేసుకున్నారు. ఇక తెలుగు తేజం పీవీ సింధు, లవ్లీనా, హాకీ జట్టు, భజరంగ్‌కు కాంస్య పతకాలు దక్కాయి. భారత్ పతకాల పట్టికలో 47వ స్థానంలో నిలిచింది.
భారత జావెలిన్ థ్రో ప్లేయర్ నీరజ్ చోప్రా చరిత్రను తిరగరాశాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో అద్భుత ప్రదర్శనను కనబరిచిన నీరజ్ ఫైనల్‌లోనూ సత్తా చాటి భారత్‌కు పతకాన్ని సాధించి పెట్టాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ఫైనల్‌కు చేరుకున్న నీరజ్ అద్భుతం సృష్టించాడు. దీంతో అథ్లెటిక్స్‌లో పతకం కోసం ఎదురు చూస్తోన్న భారత్ 100 ఏళ్ల కల నేడు సాకారమైంది.
పురుషుల జావెలిన్ థ్రో విభాగం గ్రూప్-ఏలో నీరజ్ చోప్రా తొలి స్థానంలో నిలవగా.. గ్రూప్-బీలో పాకిస్తాన్ ప్లేయర్ మొదటి ప్లేస్ లో నిలిచాడు. పాకిస్తాన్ జావెలిన్ థ్రయోర్ అర్షద్ నదీం.. గ్రూప్-బీలో మొదటి స్థానంలో ఉన్నాడు. దీంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
LIVE NEWS & UPDATES
-
బంగారు పతకంతో నీరజ్…
Historic. Iconic. Magical. #Tokyo2020 | @Neeraj_chopra1 pic.twitter.com/DbBXKztjPk
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 7, 2021
-
నీరజ్‌కు ఎక్స్‌యూవీ కారును బహుమతిగా ప్రకటించిన ఆనంద్ మహీంద్ర..
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణాన్ని సాధించిన నీరజ్‌పై దేశ వ్యాప్తంగా ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఇప్పటికే హరియానా ముఖ్యమంత్రి భారీ నజరానా ప్రకటించగా.. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఎక్స్‌యూవీ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్ర.. ‘అవును ఇవ్వాల్సిందే. మన గోల్డెన్ అథ్లెట్‌కు బహుమతి ఇవ్వడం నాకు కూడా గర్వకారణమే. వెంటనే నీరజ్ కోసం కొత్త కారును సిద్ధం చేయండి’ అంటూ మహీంద్ర కంపెనీ సీఈఓ విజయ్ నక్రాకు ట్యాగ్ చేశారు.
Yes indeed. It will be my personal privilege & honour to gift our Golden Athlete an XUV 7OO @rajesh664 @vijaynakra Keep one ready for him please. https://t.co/O544iM1KDf
— anand mahindra (@anandmahindra) August 7, 2021
-
-
బంగారు నీరజ్‌కు.. భారీ నజరానా..
జావెలిన్ త్రోలో స్వర్ణం గెలుచుకొని సరికొత్త రికార్డు సృష్టించిన నీరజ్‌కు హరియానా ముఖ్యమంత్రి భారీ నజనరానా ప్రకటించారు. భారత్‌కు బంగారు పతకాన్ని సాధించినందుకుగాను రూ. 6 కోట్లు నజరాన ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కత్తర్ తెలిపారు. నీరజ్ చోప్రాకు అభినందనలను తెలిపిన సీఎం.. ‘ఈ క్షణం కోసం దేశం చాలా కాలంగా ఎదురుచూస్తోంది. దేశం మొత్తం నీ విజయానికి గర్వపడుతుంది’ అంటూ ట్వీట్ చేశారు.
ऐतिहासिक! लठ गाड़ दिया छोरे..
शानदार प्रदर्शन के साथ विश्व के सर्वश्रेष्ठ प्रतियोगियों को पछाड़ते हुए भाला फेंक प्रतियोगिता में भारत को पहली बार स्वर्ण पदक जिताने के लिए @Neeraj_Chopra1 को ढेर सारी बधाई।
इस घड़ी का देश को लंबे समय से इंतजार था। पूरे देश को आप पर गर्व है। pic.twitter.com/muHhaPWZ0D
— Manohar Lal (@mlkhattar) August 7, 2021
-
భారత ఒలింపిక్స్‌లో సరికొత్త అధ్యయనం.. పెరిగిన పతకాల సంఖ్య.
భారత ఒలింపిక్స్ చరిత్రలో సరికొత్త అధ్యయనం ఆవిష్కృతమైంది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా సాధించిన బంగారు పతకంతో టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో భారత ఖాతాలో మరో పతకం చేరింది. దీంతో భారత్ పతకాల సంఖ్య 07కి చేరింది. అంతేకాకుండా భారత ఒలింపిక్స్ చరిత్రలోనూ సరికొత్త రికార్డు సాధ్యమైంది. 2012లో లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ 06 పతకాలు గెలుచుకోగా ఇప్పుడు ఆ సంఖ్య 7కి చేరింది.
-
గెలుపు సాకారమైన తరుణం..
THE THROW THAT WON #IND A #GOLD MEDAL ?#Tokyo2020 | #StrongerTogether | #UnitedByEmotion @Neeraj_chopra1 pic.twitter.com/F6xr6yFe8J
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 7, 2021
-
-
టోక్యోలో సరికొత్త చరిత్ర లిఖించబడింది.. ప్రధాని మోదీ.
జావెలిన్ త్రో లో స్వర్ణాన్ని గెలుచుకొని చరిత్ర సృష్టించిన నీరజ్‌కు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. దేశ ప్రజలంతా నీరజ్ సాధించిన విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. టోక్యోలో సరికొత్త చరిత్ర లిఖించబడింది అంటూ వ్యాఖ్యానించిన మోదీ.. ‘ఈరోజు సాధించిన ఘనత ఎప్పటికీ గుర్తిండిపోతుంది. యువ ఆటగాడు నీరజ్ అద్భుత ఆటతీరును కనబరిచాడు. స్వర్ణం గెలుచుకున్నందుకు నీరజ్‌కు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.
History has been scripted at Tokyo! What @Neeraj_chopra1 has achieved today will be remembered forever. The young Neeraj has done exceptionally well. He played with remarkable passion and showed unparalleled grit. Congratulations to him for winning the Gold. #Tokyo2020 https://t.co/2NcGgJvfMS
— Narendra Modi (@narendramodi) August 7, 2021
-
చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. వందేళ్ల కల సాకారం..
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తొలి స్వర్ణాన్ని అందుకుంది. వందేళ్ల చరిత్రలో భారత అథ్లెట్స్‌లో తొలి పతకం సొంతమైంది. జావెలిన్ త్రో ఫైనల్స్‌లో అద్భుత ఆటతీరును కనబరిచిన నీరజ్ చోప్రా సంచలనం సృష్టించాడు. ఫైనల్‌లో 87.58 మీటర్లు విసిరి అద్భుతం చేశాడు. ఇండియన్ ఒలింపిక్ చరిత్రలో ఈ రోజు అద్భుతమని అభివర్ణించడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.
-
కొనసాగుతోన్న నీరజ్ దూకుడు.. ఐదు రౌండ్ల తర్వాత కూడా..
టోక్యో వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఫైనల్ మ్యాచ్ ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా దూసుకుపోతున్నాడు. అన్ని రౌండ్లలోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ పతకం సాధించే దిశగా అడుగులు వేస్తున్నాడు. తాజాగా ఐదో రౌండ్ ముగిసే సమయానికి కూడా టాప్ 1లో నిలిచాడు. దీంతో జెవెలిన్ త్రోలో పసిడి పతకం భారత్ ఖాతాలో చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
-
భారత్ లండన్ రికార్డును దాటేస్తుందా..?
రెజ్లింగ్ ప్లేయర్ భజరంగ్ పునియా సాధించిన కాస్య పతకంతో భారత పతకాల సంఖ్య ఆరుకు చేరింది. అయితే గతంలో 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో కూడా భారత్ 06 పతకాలే గెలుచుకుంది. మరి ఈసారి నీరజ్ ద్వారా మరో పతకాన్ని సొంతం చేసుకొని లండన్ రికార్డును తిరగరాస్తుందో చూడాలి.
-
రౌండ్ రౌండ్‌కు మెరుగువతోన్న నీరజ్ చోప్రా ఆటతీరు.. రెండో రౌండ్‌లో..
జావెలిన్ త్రో ఫైనల్స్‌లో పాల్గొన్న నీరజ్ చోప్రా ఆటతీరు రౌండ్ రౌండ్‌కు మెరుగవుతోంది. మొదటి రౌండ్‌లో 87.03 మీటర్ల దూరం విసిరిన నీరజ్.. రెండో రౌండ్‌లో మరింత మెరుగైన ఆటతీరును కనబరిచాడు. ఈసారి 87.58 మీట్ల దూరం విసిరాడు. దీంతో నీరజ్ చోప్రా రెండో రౌండ్‌లోనూ టాప్ 1లో కొనసాగుతున్నాడు.
-
దూసుకుపోతున్న నీరజ్ చోప్రా.. తొలి అవకాశంలో..
టోక్యో ఒలింపిక్స్‌లో జరుగుతున్న జావెలిన్ థ్రో ఫైనల్ మ్యాచ్‌లో భారత ప్లేయర్ నీరజ్ చోప్రా దూసుకుపోతున్నాడు. తొలి అవకాశంలో 87.03 మీటర్ల దూరం విసిరి మంచి ఆటతీరును కనబరిచాడు. దీంతో నీరజ్ చోప్రా ప్రస్తుతం టాప్ 1లో కొనసాగుతున్నాడు.
-
మోదీ శుభాకాంక్షలు..
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకాన్ని అందించిన భజరంగ్ పునియాకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకంక్షలు తెలిపారు. టోక్యో 2020 నుంచి మంచి వార్త వచ్చిందని అభివర్ణించిన మోదీ.. భజరంగ్ సాధించిన విజయం దేశానికి గౌరవాన్ని, సంతోషాన్ని ఇచ్చిందని ట్వీట్ చేశారు.
Delightful news from #Tokyo2020! Spectacularly fought @BajrangPunia. Congratulations to you for your accomplishment, which makes every Indian proud and happy.
— Narendra Modi (@narendramodi) August 7, 2021
-
భజరంగ్ భళా అనిపించాడు..
భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. భజరంగ్ పునియా రెజ్లింగ్ కాంస్యం కోసం జరిగిన పోరులో విజయం సాధించాడు. కజకిస్థాన్ ప్లేయర్‌పై మొదటి నుంచి దూకుడుగా ఆడి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. రెజ్లింగ్ పురుషుల ఫ్రీస్టైల్ 65 కేజీల విభాగం కాంస్య పతక పోరులో గెలిచాడు టాప్ రెజ్లర్ బజరంగ్ పునియా.
-
భారత్ స్వర్ణం కోసం ఎదురు చూస్తోంది.. ఆకట్టుకుంటోన్న నీరజ్ చోప్రా సైకత శిల్పం.
ప్రస్తుతం భారత క్రీడా అభిమానుల చూపులన్నీ టోక్యోవైపే ఉన్నాయి. మరికాసేపట్లో ప్రారంభం కానున్న జావెలిన్ త్రో ఫైనల్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న నీరజ్ చోప్రా గోల్డ్‌ను సాధిస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభంకానున్న ఫైనల్స్‌లో నీరజ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇదిలా ఉంటే దేశ ప్రజలంతా నీరజ్‌కు తమ మద్ధతును పలుకుతున్నారు. ఇందులో భాగంగానే సైకత శిల్ప కళాకారుడు మానస్ సాహూ.. నీరజ్‌కు శుభాకాంక్షలు తెలపుతూ ఇసుకతో శిల్పాన్ని చెక్కాడు. దానిపై ఇండియా స్వర్ణం కోసం ఎదురు చూస్తోంది అని రాసుకొచ్చాడు.
-
లవ్లీనా పతకం అందుకున్న వేళ..
తొలి ఒలింపిక్స్‌లోనే పతకం అందుకొని దేశం దృష్టిని ఆకర్షించింది భారత మహిళల బాక్సింగ్ ప్లేయర్ లవ్లీనా బోర్గోహైన్. స్వర్ణ పతకాన్ని భారత్ ఖాతాలో వేస్తుందని అందరూ భావించినా సెమీస్ ఓడి కాంస్యాన్ని గెలుచుకుంది. మహిళల 69 కిలోల విభాగంలో లవ్లీనా 0-5తో ప్రపంచ చాంపియన్ బుసానెజ్ సుర్మెనెలి (టర్కీ) చేతిలో ఓడినా పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆమెపై భారత్‌కు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే లవ్లీనా తాజాగా పతకాన్ని అధికారికంగా అందుకుంది. నేడు నిర్వహించిన టోక్యో 2020 విక్టరీ సెర్మనీలో లవ్లీనా పతకాన్ని అందుకుంది.
Admire it for as long as you please, Lovlina. It’s YOUR #bronze! ?
Women’s welterweight boxer Lovlina Borgohain picked up #IND’s third medal at #Tokyo2020 during the victory ceremony today. ?#StrongerTogether | #UnitedByEmotion | #Boxing | #BestOfTokyo pic.twitter.com/sOKjJlhP1u
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 7, 2021
-
అత్యధిక ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారిణికి ఘనంగా వీడ్కోలు..
ఒలింపిక్స్ క్రీడల్లో ఒక్కసారైనా పాల్గొనాలేనది ప్రతీ క్రీడాకారుడి ఆశ. ఇందుకోసమే జీవితమంతా ఎదురు చూస్తుంటారు. అయితే ఉజ్బెకిస్తాన్‌కు చెందిన వాల్ట్ జిమ్నాస్ట్ ఒక్సానా చుసోవిటినా మాత్రం ఏకంగా వరుసగా 8 ఒలింపిక్స్‌లో పాల్గొని సరికొత్త చరిత్ర సృష్టించింది. 1992 నుంచి 2020 ఒలింపిక్స్ వరకు ఒక్కసారి కూడా మిస్ కాకుండా పాల్గొనడం విశేషం. దీంతో శనివారం ఒక్సానా చివరి ఆట ముగియడంతో ఆమెకు ఘనమైన వీడ్కోలు దక్కింది. ప్రత్యర్థి ప్లేయర్స్ సైతం ఆమెకు చప్పట్లతో వీడ్కోలు పలికారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Uzbekistan’s Oksana Chusovitina has officially competed at her EIGHTH Olympic Games.
At 46 years old, she competed for one last time and received a standing ovation from her competitors. #TokyoOlympics pic.twitter.com/qJgPTWICAD
— #TokyoOlympics (@NBCOlympics) July 26, 2021
-
వందనకు భారీ నగదు బహుమతి ప్రకటించిన ఉత్తరాఖండ్ సీఎం..
ఉత్తరఖాండ్‌కు చెందిన హాకీ ప్లేయర్ వందన కటారియాకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ నగదు బహుమతిని ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ అద్భుత ఆటతీరు కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించిన కటారియాకు రూ. 25 లక్షల ప్రైజ్ మనీని ఇవ్వనున్నట్లు ఉత్తరఖాండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ఇదిలా ఉంటే టోక్యో ఒలింపిక్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో వందన సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ఆమె హ్యాట్రిక్ గోల్స్ చేయడం విశేషం. భారత మహిళా హాకీ ప్లేయర్ ఇలా హ్యాట్రిక్ గోల్ చేయడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో 4-3 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
-
భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరుతాయా.?
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు నేడు చివరి రోజు. భారత ప్లేయర్స్ నేడు మూడు పతకాల కోసం పోటీ పడనున్నారు. వీరిలో ఒకరైన అదితి గోల్ఫ్‌లో అద్భుత ఆటతీరు కనబరించినప్పటికీ ఓటమిని ఎదురు చూసింది. అయితే ప్రస్తుతం భారత్‌కు మరో రెండు పతకాలు గెలుచుకునే అవకాశం ఉంది. వీటిలో ఒకటి.. అథ్లెటిక్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో ప్లేయర్ నీరజ్ చోప్రా బరిలోకి దిగనుండగా.. రెజ్లింగ్‌లో బజరంగ్ పునియా కాంస్యం కోసం పోరాడనున్నాడు. మరి వీరిద్దరిలో భారత్ ఖాతాలో ఎవరు మరో పతకాన్ని చేర్చుతారో చూడాలి.
-
చాలా బాగా ఆడావు అదితి.. పతకం మిస్ అయితేనేమీ..
టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో తృటిలో పతకాన్ని కోల్పోయిన అదితిపై ప్రశంసలు కురుస్తున్నాయి. పతకం గెలుచుకోకపోయినా భారతీయుల హృదయాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా అదితిని పొగుడుతూ ట్వీట్ చేశారు. ‘చాలా బాగా ఆడావు అదితి. టోక్యో 2020లో అద్భుత ప్రదర్శనను కనబరిచావు. కొంతలో మెడల్‌ను మిస్ అయ్యుండొచ్చు కానీ ఇప్పటి వరకు ఏ భారతీయుడు చేరుకోలేనంత దూరం వెళ్లావు. నీ భవిష్యత్తు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.
Well played @aditigolf! You have shown tremendous skill and resolve during #Tokyo2020. A medal was narrowly missed but you’ve gone farther than any Indian and blazed a trail. Best wishes for your future endeavours.
— Narendra Modi (@narendramodi) August 7, 2021
-
జావెలిన్ త్రో ఫైనల్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న నీరజ్
ఎప్పుడూ లేనివిధంగా భారత్.. పురుషుల జావెలిన్ థ్రో విభాగంలో ఫైనల్స్‌కు భారత్ అర్హత సాధించింది. ఇది సరికొత్త రికార్డ్. ఈ ఈవెంట్‌లో భారత్‌కు ప్రాతినిథ్యాన్ని వహించిన నీరజ్ చోప్రా సాయంత్రం 4. 30 నిమిషాలకు ఫైనల్స్ ఆడనున్నాడు. తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
పురుషుల జావెలిన్ థ్రో విభాగం గ్రూప్-ఏలో నీరజ్ చోప్రా తొలి స్థానంలో నిలవగా.. గ్రూప్-బీలో పాకిస్తాన్ ప్లేయర్ మొదటి ప్లేస్ లో నిలిచాడు. పాకిస్తాన్ జావెలిన్ థ్రయోర్ అర్షద్ నదీం.. గ్రూప్-బీలో మొదటి స్థానంలో ఉన్నాడు. దీంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
-
ఓడితేనేమి.. చరిత్ర సృష్టించావు.. గోల్ఫ్‌పై దృష్టి పెట్టేలా చేశావు
టోక్యో ఒలింపిక్స్ లో నిశ్శబ్దంగా పతాకానికి చేరువై.. ఒక్క స్ట్రోక్ తో పతకం కోల్పోయిన భారతీయ గోల్ఫర్ అదితి అశోక్ పై యావత్ భారతం ప్రశంసల వర్షం కురిపిస్తుంది. పతకం రాకపోతేనేమి.. చరిత్ర సృష్టించావు అదితి అంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు సహా పలువురు ప్రశంసలు వర్షం కురిపించారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గోల్ఫ్ పై ద్రుష్టి పెట్టాలా నీ ఆట కొనసాగిందని మా పై ఒత్తిడి పెంచిన నీకు కృతఙ్ఞతలని చెప్పారు.
-
గోల్ఫ్‌లో నాలుగో ప్లేస్‌తో సరిపెట్టుకున్న అదితి
గోల్ప్ మహిళా విభాగం తుది పోరులోని నాలుగో రౌండ్ ఉత్కంఠభరింతంగా సాగింది.. చివరి కంటూ పోరాడిన భారత గోల్ఫర్ అదితి అశోక్ చివరికి నాలుగో ప్లేస్ తో సరిపెట్టుకుంది.
-
ప్రారంభమైన గోల్ఫ్..నాలుగో స్థానంలో అదితి
టోక్యో ఒలింపిక్స్ లో తుది సమరం రసవత్తరంగా సాగుతుంది. వర్షం ఆలస్యం తర్వాత గోల్ఫ్ తిరిగి ప్రారంభమైంది. అయితే భారత గోల్ఫర్ నాలుగో స్థానికి పడిపోయింది. ఇంకా ఒక రంధ్రం ఆడాల్సి ఉంది.
-
అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత గోల్ఫర్ అదితి అశోక్…
టోక్యో ఒలింపిక్స్ లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత గోల్ఫర్ అదితి అశోక్ అనూహ్యంగా పతకం రేసులో నిలిచింది. ఈ 23 ఏళ్ల యువతి ఒకానొక దశలో అగ్ర స్థానంలోకి దూసుకొచ్చి పసిడి రేసులో కూడా నిలిచింది.
World no.200 is competing against world no.1, What an achievement #AditiAshok ?
Go for gold?? #Golf #golfindia #TokyoOlympics2020 pic.twitter.com/jQFTTk6Qtn
— Rahul???? (@iamrk287) August 7, 2021
-
తుఫాన్ వలన 4వ రౌండ్ పూర్తి కాకపోతే.. 54 హొల్స్ స్కోరు పరిగణలోకి
టోక్యో ఒలింపిక్స్ లో తుది సమరం రసవత్తరంగా సాగుతున్న సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. భారీగాలులు వర్షంతో ఆటని కొంత సమయం పాటు నిలిపివేశారు. అయితే తిరిగి ఈ ఆటను భారత కాలమానం ప్రకారం 9: 45 తిరిగి ప్రారంభిస్తారు.. అదితి అశోక్ కు రెండో హొల్స్ మిగిలి ఉన్నాయి. అయితే ఒకవేళ తుఫాన్ వలన 4 వ రౌండ్ పూర్తి కాకపోతే.. 54 రంధ్రాల స్కోరు పరిగణిస్తారని తెలుస్తోంది.
If the 4th round is not completed due to thunderstorm, score of 54 holes will be considered. #Aditi Ashok @HTSportsNews @Tokyo2020 pic.twitter.com/p0GTNvRAdz
— Avishek Roy (@tweet2avishek) August 7, 2021
-
కాంస్యం పోరులో అదితికి ఇంకా ఛాన్స్..
టోక్యో ఒలింపిక్స్ లో భారత గోల్ఫర్ గా చరిత్ర సృష్టించడానికి అదితికి ఇంకా ఛాన్స్ ఉంది. అదితి కాంస్య పతక పొందడానికి ఇక రెండు హొల్స్ మాత్రమే ఉన్నాయి.
-
ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీ గాలులు.. ఆట నిలిపివేత
గోల్ప్ మహిళా విభాగం తుది పోరులోని నాలుగో రౌండ్ ఉత్కంఠభరింతంగా కొనసాగుతోంది.. ఆట ఆఖరుకు చేరుకోవడంతో క్షణక్షణలకు సమీకరణలు మారిపోతున్న సమయంలో..భారత గోల్ఫర్ అదితి మళ్లీ మూడో పొజిషన్‌కు చేరుకుంది. అయితే ఇంతలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీగాలులు వీచడంతో ఆటను నిలిపివేశారు.
-
నాలుగో స్థానంలో అదితి.. ఇక మరో మూడు హొల్స్ మాత్రమే..
గోల్ప్ మహిళా విభాగం తుది పోరులోని నాలుగో రౌండ్ ఉత్కంఠభరింతంగా కొనసాగుతోంది.. ఆఖరుకు చేరుకున్న ఆట.. జపాన్ క్రీడాకారిణి ఇనామికి ఒక బర్డీ లభించింది దీంతో న్యూజిలాండ్ యొక్క లిడియా కో మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే ఈవెంట్‌లో మూడవ స్థానంలో నిలిచింది. అదితి అశోక్ నాలుగో ప్లేస్ కు చేరుకుంది. ఇక మరోవైపు మరో మూడు హోల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో అదితి పతకం ప్రత్యర్థి నెగెటివ్ పాయింట్ల మీదే ఆధారపడినట్లు అయింది.
-
ప్రత్యర్థి నెగెటివ్ పాయింట్ల మీదే ఆధారపడ్డ అదితి పతకం
గోల్ప్ మహిళా విభాగం తుది పోరులోని నాలుగో రౌండ్ ఉత్కంఠభరింతంగా కొనసాగుతోంది.. ఆఖరుకు చేరుకున్న ఆట.. జపాన్ క్రీడాకారిణి ఇనామికి ఒక బర్డీ లభించింది దీంతో మహిళల గోల్ఫర్ అదితి అశోక్ , న్యూజిలాండ్ యొక్క లిడియా కో మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే ఈవెంట్‌లో మూడవ స్థానంలో నిలిచారు. ప్రత్యర్థి నెగెటివ్ పాయింట్ల మీదే ఆధారపడ్డ అదితి పతకం
-
ఆఖరుకు చేరుకున్న ఆట.. మూడో స్థానంలో అతిది
గోల్ప్ మహిళా విభాగం తుది పోరులోని నాలుగో రౌండ్ ఉత్కంఠభరింతంగా కొనసాగుతోంది.. ఆఖరుకు చేరుకున్న ఆట.. మూడో స్థానంలో అతిది
-
రెండో ప్లేస్‌లో నలుగురి పోటీ.. వారిలో అతిధి ఒకరు
గోల్ప్ మహిళా విభాగం తుది పోరులోని నాలుగో రౌండ్ ఉత్కంఠభరింతంగా కొనసాగుతోంది. రెండో స్థానంలో నలుగురి పోటీ పడుతున్నారు.. వారిలో అతిది ఒకరు.
-
మళ్ళీ పతకం రేసులోకి వచ్చిన అదితి..
నాలుగో రౌండ్ పోటాపోటీగా సాగుతుంది. భారత్ గోల్ఫర్ అదితి అశోక్ మళ్ళీ పతకం రేసులోకి వచ్చింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌కు చెందిన లిడియా కోతో మూడో స్థానంలో ఉంది.
-
పతకం రేసు నుంచి భారత్ గోల్ఫర్ ఔట్..
కొనసాగుతున్న నాలుగో రౌండ్.. పతకం రేసు నుంచి భారత్ గోల్ఫర్ ఔట్.. మళ్ళీ తిరిగి పట్టాలెక్కుతుందా
-
మళ్ళీ మూడో స్థానానికి పడిపోయిన అదితి అశోక్..
కొనసాగుతున్న నాలుగో రౌండ్.. మళ్ళీ మూడో స్థానానికి పడిపోయిన అదితి అశోక్.. కాంస్యం కోసం పోరు
-
మహిళల గోల్ఫ్ చరిత్ర సృష్టించే దిశగా అదితి.. పసిడి కోసం పోటీ
గోల్ఫ్ మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే – రౌండ్ 4 లో యుఎస్ ప్లేయర్ నెల్లీ కోర్డ్రా తో పసిడి కోసం భారత్ గోల్ఫ్ క్రీడాకారిణి అదితి తో పాటు న్యూజిలాండ్ క్రీడాకారిణి లిడియా కో కూడా పోటీపడుతున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు సంయుక్తంగా మొదటి ప్లేస్ లో ఉన్నారు -
గోల్స్‌లో మొదటి ప్లేస్‌కు చేరుకున్న అతిధి.. పసిడి కోసం పోటీ
టోక్యో ఒలింపిక్స్ 2020 లో భారత గోల్ఫర్ అదితి అశోక్ చరిత్ర సృష్టించే దిశగా సాగుతుంది. ప్రస్తుతం నాలుగో రౌండ్ లో మొదటి స్థానానికి చేరుకుంది. దీంతో ఇప్పటి వరకూ మొదటి స్థానంలో ఉన్న యుఎస్ గోల్స్ క్రీడాకారిణి నెల్లీ కోర్డాతో సమానంగా మొదటి ప్లేస్ చేరుకుంది. పసిడి కోసం పోటీ పడనుంది.
-
అదితి అశోక్ తిరిగి రౌండ్ 4 లో 2 వ స్థానంలో నిలిచింది
అదితి అశోక్ తిరిగి రౌండ్ 4 లో 2 వ స్థానంలో నిలిచింది.. టోక్యో ఒలింపిక్స్ లో పతకం గెలిచి.. భారత దేశం నుంచి ఒలింపిక్స్ లో పతకం తెచ్చిన మొదటి గోల్ఫర్ గా చరిత్ర సృష్టించనుందా..!
-
విశ్వక్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఒలింపిక్స్ .. ఎన్ని పతకాలో తెలుసా..
అయితే ఇప్పటి వరకూ ఈ విశ్వక్రీడల్లో భారత్ లభించిన పతాకాల్లో ఎక్కువగా హాకీ ద్వారా వచ్చినవే.. ఇక 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ 6 పతకాలు సాధించింది. ఇప్పటి వరకూ ఇదే అత్యుత్తమం.. అయితే టోక్యో ఒలింపిక్స్ లో ఇప్పటికే రెండు రజతాలు, 3 కాంస్యాలు మొత్తం 5 పతకాలతో ఉంది. దీంతో చివరి రోజు కనీసం రెండు పతకాలు వచ్చినా మొత్తం విశ్వ క్రీడల్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఒలింపిక్స్ గా టోక్యో ఒలింపిక్స్ నిలుస్తాయి.
-
మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో రౌండ్ 4 .. మూడో స్థానంలో అదితి
మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే ఈవెంట్‌లో న్యూజిలాండ్‌కు చెందిన లిడియా కో ఒక స్థానం ఎగబాకడంతో గోల్ఫర్ అదితి అశోక్ మూడో స్థానానికి పడిపోయింది.
మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే నాలుగో రౌండ్ కొనసాగుతుంది. భారత గోల్ఫ్ క్రీడాకారిణి అదితి అశోక్ ఒక స్థానం కిందకు దిగి మూడో ప్లేస్ లో నిలిచింది. మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే ఈవెంట్‌లో న్యూజిలాండ్ కు చెందిన లిడియా కో వరుసగా మూడు బర్డీలను సాధించింది. దీంతో ఒక స్థానం మెరుగుపరుచుకుని సెకండ్ ప్లేస్ కు చేరుకుంది. దీంతో భారత్ గోల్ఫర్ అదితి అశోక్ మూడో ప్లేస్ కు పడిపోయింది. అదితి అశోక్ ప్రస్తుతం డెన్మార్క్ క్రీడాకారిణి ఎమిలీ క్రిస్టిన్ పెడెర్సన్ , జపాన్ యొక్క మోనే ఇనామితో కలిసి సంయుక్తంగా మూడవ స్థానంలో ఉన్నారు.
నిన్న మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో రౌండ్ 3 లో ఆకట్టుకున్న ప్రదర్శన తర్వాత అదితి రెండవ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే..
-
టోక్యో ఒలింపిక్స్ లో నేటితో భారత ఈవెంట్స్ పూర్తి.. మూడు అంశాల్లో పోటీ.. పతాకాలపై ఆశలు
కరోనా నేపథ్యంలో వాయిదాపడుతూ వచ్చిన టోక్యో ఒలింపిక్స్ అనేక నిబంధనల మధ్య పోటీలు మొదలయ్యాయి. ఆగష్టు 8 తో తెరపడనున్నాయి. అయితే భారత్ పోటీలు మాత్రం నేటితో ముగియనున్నాయి. అయితే ఈరోజు భారత క్రీడాకారులు తలపడే ఈవెంట్స్ లో పతకాలు తెస్తారనే భారీ అంచనాలున్నాయి. మొత్తం మూడు ఈవెంట్స్ లో భారత పోటీపడుతోంది. శనివారం జరిగే పోటీల్లో పురుషుల జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా బరిలోకి దిగనుండగా .. పతకం తెస్తాడనే భారీ అంచనాలున్నాయి. ఇక మరోవైపు రెజ్లింగ్‌లో బజరంగ్ పునియా కాంస్యం కోసం పోరాడనున్నాడు. ఇక గోల్ఫ్‌లో అదితి అశోక్‌కు కూడా రజతం లభించే అవకాశం ఉంది.
-
గోల్ఫ్: రెండో స్థానంలో అదితి అశోక్
గోల్ఫ్‌లో భారత క్రీడాకారిణి అదితి అశోక్ పతకంపై ఆశలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం మొదలైన మ్యాచులో అదితి అశోక్ ఉమెన్స్ రౌండ్ 4లో రెండవ స్థానంలో కొనసాగుతోంది.
Published On - Aug 07,2021 4:23 AM