Paris Olympics 2024: పారిస్ చేరిన ఒలింపిక్ జెండా.. శరవేగంగా పనులు: పారిస్ మేయర్ హిడాల్గో
టోక్యో ఒలింపిక్ గేమ్స్ ముగిశాయి. జులై 23 నుంచి మొదలైన ఈ విశ్వ క్రీడలు... ఆగస్టు 8వరకు జరిగాయి. ఈ క్రీడల్లో భారత అథ్లెట్లు ఈసారి అద్భుతంగా రాణించారు. ఈ క్రీడల్లో భారత్ మొత్తం 7 పతకాలను సాధించింది.
Paris Olympics 2024: టోక్యో ఒలింపిక్ గేమ్స్ ముగిశాయి. జులై 23 నుంచి మొదలైన ఈ విశ్వ క్రీడలు… ఆగస్టు 8వరకు జరిగాయి. ఈ క్రీడల్లో భారత అథ్లెట్లు ఈసారి అద్భుతంగా రాణించారు. ఈ క్రీడల్లో భారత్ మొత్తం 7 పతకాలను సాధించింది. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు, 4 కాంస్య పతకాలు సాధించింది. అంతకు ముందు జరిగిన ఒలింపిక్స్‌లో సాధించిన రికార్డును బ్రేక్ చేసింది.
టోక్యో ఒలింపిక్స్ ముగిసిన అనంతరం ఒలింపిక్ జెండా 2024 ఒలింపిక్స్‌కు వేదికైన పారిస్ చేరుకుంది. ఈ మేరకు ఒలింపిక్ జెండాను చేత పట్టుకుని పారిస్ మేయర్ హిడాల్గో పారిస్‌లో అడుగుపెట్టారు. ఫ్రాన్స్ పతక విజేతలతో అదే విమానంలో ప్రయాణించిన ఆమె.. పారిస్ విమానాశ్రయంలో దిగారు. ‘‘ఒలింపిక్ క్రీడలు పారిస్‌కు చేరుకున్నాయి అనేందుకు ఈ జెండానే గుర్తు. ఇకనుంచి ఒలింపిక్ క్రీడల ఏర్పాటు వేగవంతం చేస్తాం’’ అని ఆమె పేర్కొన్నారు. ఈమేరకు జపాన్ సహాయసహకారాలు కూడా తీసుకుంటామని పేర్కొన్నారు. టోక్యో ఒలింపిక్స్ ముగింపు ఉత్సవాల సందర్భంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్.. హిడాల్గోకు ఒలింపిక్ పతాకాన్ని అందించాడు.
కాగా, రియో ఒలింపిక్స్ 2016లో భారతదేశం కేవలం 2 పతకాలు మాత్రమే సాధించింది. టోక్యో ఒలింపిక్స్ భారతదేశానికి గొప్ప విజయంగా నిలిచాయనడంలో సందేహం లేదు. 2016లో పతకాల జాబితాలో భారతదేశం 67 వ స్థానంలో నిలించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారతదేశం అత్యుత్తమ ప్రదర్శన చేసింద. అప్పుడు భారతదేశం ఆరు పతకాలు గెలుచుకుంది. కానీ, లండన్‌లో మాత్రం భారత్ స్వర్ణం గెలవలేకపోయింది.