Corona Virus: ఒలంపిక్స్ వేళ.. టోక్యోలో కరోనా కల్లోలం.. భారీగా కొత్త కేసులు నమోదు.. హెల్త్ ఎమర్జెన్సీ విధింపు

Tokyo Olympics Corona Virus: 2020 లో జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ కరోనా కారణంగా వాయిదాపడి ఈ ఏడాదిని నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఒలంపిక్స్ నిర్వాహకులు,..

Corona Virus: ఒలంపిక్స్ వేళ.. టోక్యోలో కరోనా కల్లోలం.. భారీగా కొత్త కేసులు నమోదు.. హెల్త్ ఎమర్జెన్సీ విధింపు
Tokyo
Follow us
Surya Kala

|

Updated on: Jul 30, 2021 | 8:16 AM

Tokyo Olympics Corona Virus: 2020 లో జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ కరోనా కారణంగా వాయిదాపడి ఈ ఏడాదిని నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఒలంపిక్స్ నిర్వాహకులు, ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. అయితే వేర్వేరు దేశాలకు చెందిన కొంతమంది క్రీడాకారులు కరోనా బారిన పడి.. పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పటివరకూ ఒలంపిక్స్ స్టేడియం వద్ద పరిస్థితులు బాగానే ఉన్నప్పటికీ.. టోక్యో నగరంలో మాత్రం కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటివరకూ ఎన్నడూ లేనివిధంగా భారీగా సిటీలో కేసులు నమోదవుతూ ఆందోళన రేకెత్తిస్తోంది. టోక్యో హెల్త్ డిపార్ట్మెంట్ గురువారం సాయంత్రం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. గత 24 గంటల్లో టోక్యోలో కొత్తగా 3,865 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఇక్కడ ఈ రేంజ్ లో కొట్టకేసులు నమోదు కాలేదు. గత రెండు రోజులుగా 3 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో టోక్యో అధికార యంత్రాంగం ఉల్కిపడింది. గత మూడురోజులుగా వరసగా మంగళ, బుధ, గురు వారాల్లో 9,890 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ఇప్పటి వరకూ ఈ రేంజ్ లో కొత్తకేసులు ఎప్పుడూ నమోదు కాలేదని.. ఇది ఇక్కడితో ఆగకపోవచ్చనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.

కొత్త కేసులు అధిక సంఖ్యలో నమోదైన ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను విధించారు. టోక్యో ఒలింపిక్స్ విలేజ్‌లో ఇప్పటికే 155 కేసులు నమోదయ్యాయి. ఒలింపిక్స్‌తో ముడిపడి ఉన్న ఏడుమంది కొత్తగా కరోనా వైరస్‌కు గురయ్యారు. ఇప్పటిదాకా పలువురు అథ్లెట్లు, సపోర్టింగ్ స్టాఫ్ కరోనా బారిన పడ్డారు. టోక్యోలో 25 శాతం మేర కొత్త కేసులు నమోదైన ప్రతి ప్రాంతంలోనూ ఎమర్జెన్సీ విధించారు. కరోనా కేసులు పెరగడం, ఒలింపిక్స్ కొనసాగుతుండటం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. టోక్యో ఒలింపిక్స్ విలేజ్‌లోకి ఎవరినీ అడుగు పెట్టనివ్వడంలేదు. అంతేకాదు కమిటీ అధికారికంగా నియమించుకున్న వాలంటీర్ల సంఖ్యను కూడా మరింత పరిమితం చేశారు అధికారులు.

Also Read: క్వార్టర్ ఫైనల్ చేరిన ఆర్చర్ దీపికా కుమారి.. షూటింగ్‌లో మను బాకర్‌పైనే అందరి చూపు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే