Tokyo Olympics 2020: నేడు ఒలింపిక్స్ బరిలో దీపికా కుమారి, సింధు, మను బాకర్, లవ్లీనా.. భారత అథ్లెట్ల పూర్తి షెడ్యూల్..!
టోక్యో ఒలింపిక్స్ 2020 లో భారతదేశానికి నేడు (జులై 30) చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు చాలా మంది భారత క్రీడాకారులు పతకానికి చేరువయ్యే మ్యాచులు ఆడనున్నారు.
Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ 2020 లో భారతదేశానికి నేడు (జులై 30) చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు చాలా మంది భారత క్రీడాకారులు పతకానికి చేరువయ్యే మ్యాచులు ఆడనున్నారు. దీపికా కుమారికి ఒలింపిక్ పతకం సాధించే అవకాశం ఉంది. ఆమె ప్రస్తుతం నంబర్ వన్ మహిళా ఆర్చర్‌గా బరిలో నిలిచారు. టోక్యో ఒలింపిక్ క్రీడలలో నిన్న (జులై 29) భారత అథ్లెట్లు చాలామంది విజయాలు సాధించారు. స్టార్ బాక్సర్ మేరీ కోమ్ ఒక్కతే ఓటమి పాలైంది. భారత స్టార షట్లర్ పీవీ సింధు, ఆర్చర్ దీపికా కుమారి, మహిళల బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్, సిమ్రంజిత్ మ్యాచ్‌లు నేడు జరగనున్నాయి. నేటి మ్యాచులో లొవ్లీనా గెలిస్తే పతకం ఖాయం చేసుకుంటుంది. మిగిలిన వారికి పతకానికి చాలా దగ్గరగా చేరుకుంటారు. షూటింగ్‌లో మను బాకర్‌కు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో పాల్గొననుంది.
ఈ రోజు భారత మహిళల హాకీ జట్టుకు డూ ఆర్ డై లాంటి మ్యాచ్ ఆడనున్నారు. టోర్నమెంట్‌లో ఉండాలంటే ఈరోజు కచ్చితంగా గెలవాలి. అలాగే అథ్లెటిక్స్ ఈవెంట్స్ కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. నలుగురు భారత ఆటగాళ్లు మైదానంలోకి దిగనున్నారు. కాగా, అర్హత రౌండ్ మ్యాచ్‌లు మాత్రమే అథ్లెటిక్స్‌లో ఆడతారు. మిగిలిన గుర్రపు స్వారీ, గోల్ఫ్, సెయిలింగ్‌లో కూడా భారత ఆటగాళ్లు పాల్గొంటారు.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల షెడ్యూల్..
ఆర్చరీ ఉదయం 6.00 గంటలకు: దీపికా కుమారి వర్సెస్ క్సేనియా పెరోవా (రష్యా ), మహిళల వ్యక్తిగత ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్.
అథ్లెటిక్స్ ఉదయం 6.17: అవినాష్ సేబుల్, పురుషుల 3000 మీ. స్టీపుల్‌చేస్ ఉదయం 8.45: ఎంపీ జాబీర్, పురుషుల 400 మీ హర్డిల్స్, రౌండ్ 1 హీట్ 5 ఉదయం 8.45: ద్యుతీ చంద్, మహిళల 100 మీ, మొదటి రౌండ్ సాయంత్రం 4.42: మిక్స్‌డ్ 4×400 మీ. రిలే పోటీ, మొదటి రౌండ్ హీట్ 2
బ్యాడ్మింటన్ మధ్యాహ్నం 1.15 నుంచి: పీవీ సింధు వర్సెస్ అకానే యమగుచి (జపాన్), ఉమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్
బాక్సింగ్ ఉదయం 8.18 గంటలకు: సిమ్రాంజిత్ కౌర్ వర్సెస్ సుడాపోర్న్ సిసోండి (థాయ్‌లాండ్), మహిళల 60 కేజీల ఫైనల్ 16. ఉదయం 8.48: లవ్లీనా బోర్గోహైన్ వర్సెస్ నీన్ చిన్ చెన్ (చైనీస్ తైపీ), మహిళల 69 కిలోల క్వార్టర్ ఫైనల్
హార్స్ రైడింగ్ ఫౌవాద్ మీర్జా, మధ్యాహ్నం 2 గంటల నుంచి
గోల్ఫ్ ఉదయం 4.00: అనిర్బన్ లాహిరి-ఉదయన్ మానే, పురుషుల వ్యక్తిగత స్ట్రోక్
హాకీ ఉదయం 8. 15 గంటలకు: ఇండియా వర్సెస్ ఐర్లాండ్, మహిళల పూల్ ఏ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు: భారత్ vs జపాన్, పురుషుల పూల్ ఏ మ్యాచ్
సెయిలింగ్ కేసీ గణపతి-వరుణ్ థక్కర్, పురుషుల స్కిఫ్ నేత్రా కుమనన్, మహిళల లేజర్ రేడియల్ రేస్ విష్ణు శరవణన్, పురుషుల లేజర్ రేస్
షూటింగ్ ఉదయం 5. 30 గంటల నుంచి: రాహి సర్నోబాత్-మను బాకర్, మహిళల 25 మీ. పిస్టల్ క్వాలిఫికేషన్ రాపిడ్ రౌండ్ ఉదయం 10. 30 గంటల నుంచి: మహిళల 25 మీ. పిస్టల్ ఫైనల్
Also Read: Viral Video: మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానును అనుకరిస్తున్న చిన్నారి.. వీడియో
Tokyo Olympics 2020: బీచ్ వాలీబాల్‌లో బికినీ ధరించం.. ఈ సంప్రదాయంపై మహిళా అథ్లెట్లు సీరియస్..!