Cricket: ఓపెనర్‌గా రిషబ్ పంత్ కంటే అతడైతే బెస్ట్.. టీమిండియా మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
భారత క్రికెట్ జట్టులో కొంతకాలంగా టాప్ ఆర్డర్ ఫెయిలవుతూ వస్తోంది. దీంతో ఓపెనర్‌గా రిషబ్ పంత్ వస్తే బాగుంటుందనే చర్చ నడుస్తున్న సమయంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాత్రం పృథ్వీషాకు మద్దతు ఇచ్చాడు. ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్‌లోనూ టాపార్డర్ బ్యాట్స్ మెన్స్ నిలకడగా..
భారత క్రికెట్ జట్టులో కొంతకాలంగా టాప్ ఆర్డర్ ఫెయిలవుతూ వస్తోంది. దీంతో ఓపెనర్‌గా రిషబ్ పంత్ వస్తే బాగుంటుందనే చర్చ నడుస్తున్న సమయంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాత్రం పృథ్వీషాకు మద్దతు ఇచ్చాడు. ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్‌లోనూ టాపార్డర్ బ్యాట్స్ మెన్స్ నిలకడగా ఆడకపోవడంతో భారత్ ఆ టోర్నీలో విజేతగా నిలవలేకపోయింది. మరోవైపు జట్టు ఎంపిక విషయంలోనూ అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. రిషబ్ పంత్‌ను మిడిలార్డర్‌లో కాకుండా ఓపెనర్‌గా పంపాలనే వాదనలు ఎక్కువవుతున్నాయి. భారత ఆటగాడు దినేశ్ కార్తిక్ సైతం పంత్‌ను ఓపెనింగ్ పంపాలని సూచించాడు. అయితే ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాత్రం భిన్నంగా స్పందించాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన చోప్రా.. ఓపెనర్‌గా పృథ్వీషాను పంపించాలని సలహా ఇచ్చాడు. ఓపెనింగ్ విషయంలో నా మైండ్‌లోకి వచ్చిన ఫస్ట్ ఛాయిస్ పృథ్వీషా అని, అతడి సహజమైన ఆటతీరే విధ్వంసకరంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు ఆకాశ్ చోప్రా, ఈ విషయంలో చాలా మంది ఓపెనర్‌గా అతడు సరికాదంటారు.. కానీ ఒక్కసారి అతడి గణాంకాలు చూస్తే తెలుస్తుందని చెప్పాడు చోప్రా, మీకు రాకెట్ షాట్ కావాలంటే.. అతడు రాకెట్‌లా మారిపోతాడు. ఆ షాట్ చాలా సులభంగా ఆడతాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ రాణిస్తాడని తాను చెప్పడం లేదు కాని, బట్లర్, హేల్స్ లాంటి ఆటగాళ్లయినా ప్రతి మ్యాచ్‌లోనూ రాణించలేరని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు.
దేశవాళీ టోర్నీలో పృథ్వీషా అదిరిపోయే ప్రదర్శన చేసినప్పటికీ.. అతడిని ఈ ఏడాది టీమిండియాకు ఎంపిక చేయలేదు. ఇక రెండో స్థానానికి తన ఆప్షన్ ఇషాన్ కిషన్ అని, ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కూడా దూకుడుగా ఆడగలడన్నాడు. ఒక్కోసారి విఫలమైనప్పటికీ అతడు బాగానే రాణిస్తాడని తెలిపాడు. ముంబయి ఇండియన్స్ తరఫున ఆడినప్పుడు అతడిపై కొంత ఒత్తిడి నెలకొందని ఆకాశ్ చోప్రా తెలిపాడు.
ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భారత్.. న్యూజిలాండ్‌తో 3 టీ20ల సిరీస్ సహా.. మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ కూడా ఆడనుంది. టీ20లకు హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, తొలి టీ20 శుక్రవారం జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా రద్దయింది. రెండో టీ20 ఆదివారం జరగనుంది. ఇప్పటికే భారత జట్టు మ్యాచ్ జరగనున్న వేదిక మౌంట్ మౌంగనూయికి చేరుకుంది. టీ20 సిరీస్ తర్వాత జరిగే వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..